ఎమ్‌సీఎల్ఆర్ వ‌ల్ల లాభ‌మేంటి?

రిజ‌ర్వు బ్యాంకు ప‌ర‌ప‌తి విధానంలో భాగంగా రేటు త‌గ్గించిన‌పుడు వెంట‌నే వినియోదార్ల‌కు అందేందుకు ఎమ్‌సీఎల్ఆర్ తోడ్ప‌డుతుంది.

ఎమ్‌సీఎల్ఆర్ వ‌ల్ల లాభ‌మేంటి?

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎమ్‌సీఎల్ఆర్): రుణం తీసుకునేందుంకు బ్యాంకుకు వెళ్లే వారికి ఎమ్‌సీఎల్ఆర్ ను ప్రామాణికంగా తీసుకుని వ‌డ్డీ రేటు నిర్ణ‌యిస్తున్నారు. రిజ‌ర్వు బ్యాంకు ఎమ్‌సీఎల్ఆర్ విధానాన్ని ఏప్రిల్ 1, 2016 నుంచి అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది.గ‌తంలో ఇది బేస్ రేటు ఆధారంగా ఉండేది. అయితే ఇప్పుడు ఎమ్సీఎల్ఆర్ , బేస్ రేటు స్థానాన్ని భ‌ర్తీ చేసింది.

నిధుల ఉపాంత వ్య‌య ఆధారిత రుణ రేటు (ఎమ్‌సీఎల్ఆర్) అంటే వినియోగ‌దార్ల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే క‌నీస వ‌డ్డీ రేటు (రిజ‌ర్వు బ్యాంకు అనుమ‌తించిన కొన్ని సంద‌ర్భాల్లో మిన‌హా). బ్యాంకుల‌కు నిధుల స‌మీక‌ర‌ణ‌కు అయ్యే రేటు (మార్జిన‌ల్ కాస్ట్) ఉపాంత‌ వ్యయం అంటారు.

నిధుల‌కు అయ్యే మార్జిన‌ల్ వ్య‌యం, బ‌్యాంకుల‌కు అయ్యే నిర్వ‌హ‌ణ రుసుం, సీఆర్ఆర్ ప్ర‌భావం, కాల‌ప‌రిమితి ప్రీమియంల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఎమ్సీఎల్ఆర్ ను గ‌ణిస్తారు. రిజ‌ర్వుబ్యాంకు నిబంధ‌నల‌ ప్ర‌కారం బ్యాంకులు ఎమ్సీఎల్ఆర్ ను ప్ర‌తీనెల గ‌ణించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఓవర్నైట్ ఎమ్‌సీఎల్ఆర్, ఒకనెల ఎమ్‌సీఎల్ఆర్, మూడునెలల ఎమ్‌సీఎల్ఆర్, ఆరునెలల ఎమ్‌సీఎల్ఆర్, ఒకసంవత్సరం ఎమ్‌సీఎల్ఆర్ రేట్ల‌ను ప్ర‌చురిస్తుంటాయి.

ఎమ్‌సీఎల్ఆర్ విధానంలో బ్యాంకులకు ఫ్లోటింగ్, స్థిర రుణ వ‌డ్డీరేట్లు నిర్ణ‌యించేందుకు వీలుంటుంది. బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ కంటే త‌క్కువ‌ రేటుకు రుణం అందించే అవ‌కాశముండ‌దు.రుణ కాల‌ప‌రిమితి ఆధారంగా రుణ రేటు కూడా మారుతుంది. మూడేళ్ల కాల‌ప‌రిమితి తో ఉండే స్థిర రేటు రుణాలు కూడా ఎంసీఎల్‌ఆర్ ప్రకారంనిర్ణయింస్తారు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాల‌ప‌రిమితి ఉన్న స్థిరరేటు రుణాలు, ప్రభుత్వం అందించే ప్రత్యేక రుణ పథకాల వంటి కొన్ని రుణ రేట్లు తో ఎంసీఎల్‌ఆర్ అనుసంధానం చేయ‌రు.

రిజ‌ర్వు బ్యాంకు వ‌డ్డీరేటు త‌గ్గించిన వెంట‌నే బ్యాంకులు వ‌డ్డీరేట్ల త‌గ్గింపు జ‌ర‌గ‌క‌పోవ‌డం ఉండేది. రెపో రేటు ద్వారా బ్యాంకుల‌కు త‌క్కువ రేటుకు నిధులు స‌మ‌కూరుతున్నప్ప‌టికీ బ్యాంకులు వినియోగ‌దార్ల‌కు ఇచ్చే రుణాల‌పై ఆ రేటును త‌గ్గించ‌డంలేదు. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు ఎమ్‌సీఎల్ఆర్ ప్ర‌వేశ పెట్టారు. దీని గ‌ణ‌నలో రెట‌పోరేటును కూడా క‌లిపి లెక్కిస్తారు. కాబ‌ట్టి రెపో రేటు త‌గ్గించిన ప్ర‌తీసారీ ఎమ్‌సీఎల్ఆర్ రేటు త‌గ్గుతుంది. దీని మూలంగా బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే వ‌డ్డీరేటుకు, బ్యాంకులు ఖాతాదార్ల‌కు అందించే వ‌డ్డీరేట్ల మ‌ధ్య అంత‌రాయం త‌గ్గుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly