మ్యూచువ‌ల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ అంటే?

న్యూ ఫండ్ ఆఫ‌ర్ (ఎన్ఎఫ్ఓ) త‌రువాత మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను స‌మీక‌రించేందుకు ఫండ్ సంస్థ ఫ‌ర్‌ద‌ర్ ఫండ్ ఆఫర్ (ఎఫ్ఎఫ్ఓ)ను జారీ చేస్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ అంటే?

మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీ కొత్త మ్యూచువల్ ఫండ్‌ను ప్రారంభించినప్పుడల్లా, కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ) ప్రక్రియ ద్వారా మ‌దుప‌ర్ల‌ను పెట్టుబ‌డులు చేసేందుకు ఆహ్వానిస్తుంది. ఇది ఓపెన్ క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్లు రెండింటికీ వర్తిస్తుంది. ఎన్ఎఫ్ఓ ద్వారా మ‌దుప‌ర్లు ప్రారంభించబోయే కొత్త ఫండ్ యూనిట్లకు స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందవచ్చు, ఇది సాధారణంగా రూ. 10 గా ఉంటుంది. కాబట్టి మీరు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, 1,000 యూనిట్లు పొంద‌వ‌చ్చు. పెట్టుబడిదారుల నుంచి స‌రైన స్పంద‌న రాక‌పోతే, యూనిట్ల‌ను పొందడానికి పెద్దగా ఆసక్తి చూపకపోతే ఎన్‌ఎఫ్‌ఓను రద్దు చేయవచ్చు. ఉదాహరణకు, ఈక్విటీ పథకాలు కనీస మొత్తం పెట్టుబడి పొందడానికి అవసరం ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో 1కోటి రూపాయ‌లు. ఎన్‌ఎఫ్‌ఒ ప్రధాన లక్ష్యం స్టాక్స్, బాండ్ల వంటి వివిధ ఆస్తి తరగతుల్లో పెట్టుబడులు పెట్టడానికి మార్కెట్ల నుండి మూలధనాన్ని సేకరించడం. త‌ద్వారా వ‌చ్చే రాబ‌డిని మ‌దుప‌ర్లు కొనుగోలు చేసిన యూనిట్ల ఆధారంగా పంపిణీ చేయ‌డం.

ఫ‌ర్‌ద‌ర్ ఫండ్ ఆఫర్ (ఎఫ్ఎఫ్ఓ) అంటే ఏమిటి?
ఎన్ఎఫ్ఓ త‌రువాత మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను స‌మీక‌రించేందుకు ఫండ్ సంస్థ ఎఫ్ఎఫ్ఓను జారీ చేస్తుంది. ఆ స‌మ‌యంలో కొనసాగుతున్న ఎన్ఏవీ వద్ద కొనుగోలు, ఉప‌సంహ‌ర‌ణ కోసం ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్లు ఎల్ల‌పుడూ అవ‌కాశం ఉంటుంది. అయితే, క్లోజ్-ఎండెడ్‌ల‌లో అన్ని స‌మ‌యాల్లో కొనుగోలు,విక్ర‌య ప్ర‌క్రియ‌లు జ‌ర‌గ‌వు. క్లోజ్డ్ ఎండ్ ఫండ్లలో కొత్త యూనిట్లు ఫ‌ర్‌ద‌ర్ ఫండ్ ఆఫర్ (ఎఫ్ఎఫ్ఓ) ద్వారా మాత్రమే స‌మీక‌రించ‌గ‌ల‌రు.

ఎన్ఎఫ్ఓ లో, యూనిట్లు ప్రస్తుత లేదా కొత్త పెట్టుబడిదారులకు ఆఫర్ ధర వద్ద కొనుగోలు చేసేంద‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఒక ఫండ్ ఎన్ని ఎన్‌ఎఫ్‌ఓలను జారీ చేయ‌వ‌చ్చు. ఎఫ్‌ఎఫ్‌ఓల ఆఫర్ ధరను రిఫరెన్స్ మార్కెట్ ధరగా సూచిస్తారు. ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా ఉంటుంది. కొన్ని సంధ‌ర్భాల్లో ఎఫ్ఎఫ్ఓ ల్లో మార్కెట్ ధర వద్ద మ‌దుప‌ర్ల‌కు రాయితీ ఇస్తుంటారు.

ఏమి చేయాలి?
సాధారణంగా, ఎన్‌ఎఫ్‌ఓల ద్వారా కొనుగోలు చేడ‌యం మంచిది కాదు ఎందుకంటే ఆ ఫండ్‌కు ట్రాక్ రికార్డ్ లేదు. మార్కెట్ లో మంచి ట్రాక్‌తో ఉన్న మ్యూచువ‌ల్ ఫండ్లు ఎక్కువ‌గానే ఉన్నాయి. కాబట్టి ఎన్‌ఎఫ్‌ఓలో పెట్టుబడులు పెట్టే కంటే మంచి ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్న ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది. క్లోజ్డ్ ఎండ్ ఫండ్లు లేదా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ల ఎన్ఎఫ్ఓల‌ విషయంలో , మ‌దుప‌ర్లు పర్యవేక్షించడానికి వాటి పనితీరు చరిత్ర ఉంటుంది. క్లోజ్డ్ ఎండ్ ఫండ్ లేదా ఈటీఎఫ్ ఎఫ్ఎఫ్ఓలో పెట్టుబ‌డి పెట్టేముందు ఆ ఫండ్ ట్రాక్ రికార్డ్, దాని వ్యయ నిష్పత్తి, ఇప్పటి వరకు రాబడిని అంచనా వేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly