ప‌న్ను చెల్లింపుదారుల ఈ అయిదు కోరిక‌లు నెర‌వేరేనా?

బ‌డ్జెట్ సెష‌న్ ఫిబ్ర‌వ‌రి 1నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌భుత్వం భారీగా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగించాల‌నుకుంటోంది. ఇన్‌క‌మ్ ట్యాక్స్ చ‌ట్టంలో కొన్ని మార్పులు చేయాల‌నుకుంటోంది. కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డుకు ఈ మేర‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

ప‌న్ను చెల్లింపుదారుల ఈ అయిదు కోరిక‌లు నెర‌వేరేనా?

బ‌డ్జెట్ సెష‌న్ ఫిబ్ర‌వ‌రి 1నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌భుత్వం భారీగా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగించాల‌నుకుంటోంది. ఇన్‌క‌మ్ ట్యాక్స్ చ‌ట్టంలో కొన్ని మార్పులు చేయాల‌నుకుంటోంది. కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డుకు ఈ మేర‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కూ ఎల్టీఏ ప్ర‌యోజ‌నాలు

ప్ర‌స్తుతానికి ఉద్యోగికి ఇచ్చే లీవ్ ట్రావెల్ అల‌వెన్స్‌(ఎల్‌టీఏ) ద్వారా అందే మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు పొందే వీలుంది. దీన్ని ఉప‌యోగించి భార‌త్‌లో ఎక్క‌డైనా ప‌ర్య‌టించి ఎల్టీఏ పొందే వీలుంది. భార‌త ప‌ర్య‌ట‌క ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేయ‌డం అనేది ఈ మిన‌హాయింపు ఉద్దేశాల్లో ఒక‌టి. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితి దృష్ట్యా మ‌న దేశంలో కొన్ని ప్ర‌దేశాల‌ను చుట్టి వ‌చ్చేకంటే విదేశాల్లో కొన్ని ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌డం ఖ‌ర్చు త‌క్కువ‌తో కూడుకున్న‌ది. అందుకే విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కూ ఎల్టీఏ ప్ర‌యోజ‌నాలు అందించాల‌ని కోరుతున్నారు.

మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్ పెంపు

వైద్య చికిత్స చేయించుకున్న ఉద్యోగుల‌కు రూ.15వేల దాకా మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చేలా ప్ర‌భుత్వం 1999లో ప్ర‌వేశ‌పెట్టింది. ఇది రూ.15వేల‌కు మించితే ఉద్యోగికి ఆ అద‌న‌పు దానికి ప‌న్ను ప‌డుతుంది. గ‌డ‌చిన 18ఏళ్ల‌లో వైద్య ఖ‌ర్చులు పెరిగిన దృష్ట్యా ఈ మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్ ను క‌నీసం రూ.50వేల‌కు పెంచాల‌ని ప్ర‌తిపాద‌న ఉంది.

కొన్ని అల‌వెన్సులు మరీ త‌క్కువ‌

ఉద్యోగుల‌కు ఇచ్చే కొన్ని అల‌వెన్సులు మ‌రీ త‌క్కువ‌గా ఉంటున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు పిల్ల‌ల చ‌దువుల‌కు ఇచ్చే అల‌వెన్సుపై ప‌రిమితిని నెల‌కు రూ.100 పెట్టారు. హాస్ట‌ల్ ఖ‌ర్చుల ప‌రిమితి నెల‌కు రూ.300 దాకా పెట్టారు. గ‌త ద‌శాబ్ద కాలంగా పిల్ల‌ల చ‌దువులు, వ‌స‌తి సేవ‌ల ఖ‌ర్చులు పెరిగిన మాట వాస్త‌వ‌మే. ఇప్పుడు ఈ క‌నీస ప‌రిమితులు పెంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.

హెచ్ఆర్ఏ ప‌రిమితులు… మ‌రిన్ని మెట్రో నగ‌రాలకు

ఇంటి అద్దె అల‌వెన్సు లేదా హెచ్ఆర్ఏ ద్వారా ఉద్యోగి ప‌న్ను మిన‌హాయింపు పొందే సౌల‌భ్యం ఉంది. ముంబ‌యి, ఢిల్లీ, కోల్‌క‌తా, చెన్నై లాంటి న‌గ‌రాల్లో ఉద్యోగి అద్దెకు నివ‌సిస్తున్న‌ట్ట‌యితే మ‌రింత ఎక్కువ హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే పెరుగుతున్న స్థిరాస్తి ధ‌ర‌ల దృష్ట్యా హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులోనూ ఇంటి అద్దెలు త‌క్కువ‌గా ఏమీ లేవు. అందుకే ఈ న‌గ‌రాల‌ను సైతం అధిక హెచ్ఆర్ఏ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని కోరుతున్నారు.

సెక్ష‌న్ 54 ప్ర‌యోజ‌న గ‌డువు పెంపు

స్థిరాస్తిని అమ్మ‌డం ద్వారా వ‌చ్చే దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభాల‌ను… నివాస స‌ముదాయం కొనుగోలు లేదా క‌ట్ట‌డానికి వెచ్చించ‌డం వ‌ల్ల ప‌న్ను మిన‌హాయింపును పొందవ‌చ్చు. సెక్ష‌న్ 54, సెక్ష‌న్ 54ఎఫ్ ఈ సౌల‌భ్యాన్ని పాత ఇంటిని అమ్మక ఏడాది మునుపు లేదా అమ్మిన మూడేళ్ల‌ వ‌ర‌కు ఇస్తుంది.

స్థిరాస్తి నియంత్ర‌ణ చ‌ట్టం, రెరాను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో ఇప్పుడు ఒక ప్రాజెక్టు పూర్తి కావ‌డానికి గ‌రిష్ట కాల‌వ్య‌వ‌ధి అంటూ లేదు. పెద్ద ప్రాజెక్టుల్లో భాగంగా కొనుగోలుదారుకు సొంత ఇల్లు అనేది 3ఏళ్ల త‌ర్వాత వ‌స్తే సెక్ష‌న్ 54 కింద ప‌న్ను మిన‌హాయింపును క్లెయించేసుకోలేడు. ఈ ప‌రిమితిని ఈ బ‌డ్జెట్‌లో పెంచాల‌ని చూస్తున్నారు.

చివ‌ర‌గా…

ప్ర‌త్య‌క్ష ప‌న్నుల వ‌సూళ్ల‌లో వేత‌నాలు అందుకునే ఉద్యోగులే కీల‌క భూమిక పోషిస్తున్నారు. వీరికి కేంద్రం త‌గిన విధంగా అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly