బ‌డ్జెట్ ప్ర‌కారం ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి? ప్రియ‌మ‌య్యేవి ఏవి?

వాహ‌నాల విడిభాగాల ధ‌ర‌లు పెర‌గ‌నుండ‌గా, ఎల‌క్ర్టిక్ వాహ‌నాల విడిభాగాల ధ‌ర‌లు మాత్రం త‌గ్గ‌నున్నాయి.

బ‌డ్జెట్ ప్ర‌కారం ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి? ప్రియ‌మ‌య్యేవి ఏవి?

న‌రేంద్ర‌మోడీ 2.0 ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేడు లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. కొన్ని ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ్స్ సుంకాన్ని పెంచుతూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దీంతో మార్కెట్లో వ‌స్తువుల ధ‌ర‌లు మారిపోయే అవ‌కాశం ఉంది. మ‌రి ఏ వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గాయో ఏవి పెరిగాయో తెలుసుకుందాం…

ప్రియ‌మైన‌వి
పెట్రోల్, డీజిల్: వాహనదారులపై మరింత భారం పడనుంది. ఇంధన ధరలపై సుంకాలు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి చొప్పున సెస్‌ పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో ఇంధన ధరలు పెరగనున్నాయి.

బంగారం, ఇత‌ర లోహాలు
బంగారం దిగుమతులపై కూడా కస్టమ్స్‌ సుంకాలను పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10శాతం ఉండగా… దాన్ని 12.5శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు.

ఇంకా … వాహ‌న విడిభాగాలు, పొగాకు ఉత్ప‌త్తులు, డిజిట‌ల్ కెమెరా, దిగుమ‌తి చేసుకున్న పుస్త‌కాలు, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్స్, బాదం, సింథ‌టిక్ ర‌బ్బ‌ర్‌, వినైల్ ఫ్లోరింగ్ వంటి వాటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. దేశీయ కంపెనీల‌ను ప్రోత్స‌హించేందుకు ఈ వ‌స్తువుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీని పెంచ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

ధ‌ర‌లు త‌గ్గేవి
కొన్ని ప్ర‌త్యేక ఎల‌క్ర్టానిక్ వ‌స్తువులు, ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాలు, ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు వంటివి. దేశీయ త‌యారీని ప్రోత్స‌హించేందుకు ఈ ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ్స్ సుంకాన్ని త‌గ్గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly