సిప్ స్టేట్‌మెంట్ల‌లో ఏం ఉంటాయి?

స్టేట్మెంట్ మీరు చేసిన సిప్‌ల మొత్తాన్ని వివరంగా చూపుతుంది. దీన్ని సమీక్షించడం చాలా ముఖ్యం.

సిప్ స్టేట్‌మెంట్ల‌లో ఏం ఉంటాయి?

సిప్ స్టేట్‌మెంట్‌లో మీ పేరు, ఫోలియో నంబర్, ఏవిధ‌మైన ప‌ధ్ధతి (సింగిల్ లేదా ఉమ్మడి పెట్టుబడి) , కేవైసీ గురించి తెలుసుకునే స్థితి, నామినీ ఇమెయిల్ ఐడీ ఉంటుంది. దీంతో పాటు ప్ర‌తీ పెట్టుబ‌డి సాధ‌నానికి భద్రతకు కేటాయించిన అంతర్జాతీయ భద్రతా గుర్తింపు సంఖ్య (ఐసిన్) ను ఉంటుంది. మీకు కేటాయించిన ప్రత్యేక క్లయింట్ కోడ్ (యుసిసి) కూడా ఉంటుంది. ఇది ప్రతి పెట్టుబడిదారుడికి పాన్ కార్డుతో అనుసంధానించి ఉంటుంది. ఈ ప్రాథమిక వివరాల కింద పెట్టుబడి తేదీ (ఇది తప్పనిసరిగా మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయ్యే తేదీ) , సిప్ మొత్తం, ఆ రోజు నాటికి నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) ఉంటాయి .

సిప్ పెట్టుబ‌డి మొత్తాన్నిఫండ్ ఎన్ఏవీతో విభజించడం ద్వారా ఆ నెలలో మీరు పొందిన‌ యూనిట్ల సంఖ్యను తెలుసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు నెలకు రూ. 2,000 పెట్టుబడి, ఆ తేదీన ఫండ్ ఎన్ఏవీ 143.41 అనుకుందాం. మీ ఖాతాకు జమ చేసిన యూనిట్ల సంఖ్య 13.946 అవుతుంది. పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి మీ స్టేట్మెంట్ మీ మొత్తం సిప్ విలువను కూడా చూపుతుంది. స్టేట్‌మెంట్ లో ప్రతి నెల చివరి రోజున మీ ఖాతాలో ఉన్న‌ యూనిట్ల సంఖ్య‌ను ఎన్ఏవీతో గుణించ‌డం ద్వారా మొత్తాన్ని చూపుతుంది. ఎన్ఏవీ త‌క్కువ‌గా ఉంటే ఎక్కువ యూనిట్లు మీ ఖాతాకు జమ అవుతాయి.

స్టేట్మెంట్ మీరు చేసిన సిప్‌ల మొత్తాన్ని వివరంగా చూపుతుంది. దీన్ని సమీక్షించడం చాలా ముఖ్యం. సరైన తేదీన మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్ అవుతుందో లేదో తనిఖీ చేసుకోవాలి. త‌గిన యూనిట్లు ఖాతాలో చూపిస్తున్నాయా లేదా త‌నిఖీ చేసుకోవాలి. అయితే, సిప్‌ తో సహా ఏ విధమైన ఈక్విటీ పెట్టుబడి అయినా దీర్ఘకాలికంగా కొన‌సాగించ‌టం మంచిది. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఉంటే ఆందోళ‌న చెందకూడ‌దు. దీర్ఘకాలంలోమార్కెట్ అస్థిరతను అధిగమించి మంచి రాబ‌డిని అందిస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly