ఐటీఆర్-1 ఫారం ఎవ‌రికి? ఎలా దాఖ‌లు చేయాలి?

ఆదాయానికి అనుగుణంగా ప‌న్ను చెల్లింపుదారులు ఏడు ఐటీఆర్ ఫారంల‌లో వారికి స‌రిప‌డే ఫారంను ఎంచుకోవాలి.

ఐటీఆర్-1 ఫారం ఎవ‌రికి? ఎలా దాఖ‌లు చేయాలి?

2019-20 మ‌దింపు సంవ‌త్స‌రానికి ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేముందు, 2018019 ఆర్థిక సంవ‌త్స‌ర ఆదాయానికి మీకు ఏ ఐటీఆర్ ఫారం స‌రిపోతుందో తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ఆదాయ ప‌న్ను శాఖ ఏడు ఐటీఆర్ ఫారంల‌ను జారీచేసింది. త‌ప్పు ఐటీఆర్ ఫారంను ఎంచుకుంటే త‌ర్వాత ఆదాయ ప‌న్ను శాఖ మీ రిట‌ర్నుల‌ను తిర‌స్క‌రిస్తుంది. .

వ్య‌క్తుల ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ఫారంను ఎంచుకోవాల్సి ఉంటుంది. దాదాపు వేత‌న జీవులు ఐటీఆర్‌-1 ఫారం ద్వారా ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్‌-1 ఫారం ఎవ‌రికి?

వేత‌నం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తుల‌కు ఐటీఆర్ లేదా స‌హ‌జ్ ఫారం ద్వారా రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తం ఆదాయం 2019-20 మ‌దింపు సంవ‌త్స‌రంలో రూ.50 ల‌క్ష‌లు దాట‌క‌పోతే ఈ ఫారం వ‌ర్తిస్తుంది. అదేవిధంగా పెన్ష‌న్, ఇంటి అద్దె, ఇత‌ర మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు ఐటీఆర్-1 ద్వారా ఫైలింగ్ చేయాలి.

ఈ-ఫైలింగ్ త‌ప్ప‌నిసరి:

ఈ ఏడాది నుంచి ఐటీఆర్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేయ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. కేవ‌లం సూప‌ర్ సీనియ‌ర్ సిట‌జ‌న్లు అంటే 80 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌సు క‌లిగిన‌వారు మాత్ర‌మే ఆఫ్‌లైన్‌లో ఫారంను స‌మ‌ర్పించే అవ‌కాశం ఉది. ఆదాయ‌ప‌న్ను శాఖ ఇప్ప‌టికే ప‌న్ను రిట‌ర్నుల‌కు చివ‌రి తేదిని ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు పొడ‌గించిన సంగతి తెలిసిందే.

ఐటీఆర్‌-1 ఫారం ఎలా పూరించాలి?

ఐటీఆర్‌-1 ఫారంలో చాలా వ‌ర‌కు వివ‌రాలు ముందుగానే పూర్తిచేసి ఉంటాయి. మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు, వేత‌నం, టీడీఎస్ వంటివి ఫారంలో ఉంటాయి. అయితే అన్ని వివ‌రాల‌ను ఒక‌సారి స‌రిగా ఉన్నాయా లేదా ప‌రిశీలించుకోవాలి. ఈ ఏడాది నుంచి ఆదాయ ప‌న్ను శాఖ వేత‌నం గురించి మ‌రింత వివ‌రంగా ఐటీఆర్ ఫారంలో తెల‌పాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించింది. సెక్ష‌న్ 10 కింద మిన‌హాయింపు ల‌భించే ఇత‌ర అల‌వెన్సులు, అద‌న‌పు చెల్లింపుల గురించి వెల్ల‌డించాల్సి ఉంటుంది. అదేవిధంగా అద్దె ద్వారా వ‌చ్చే ఆదాయం, వ‌డ్డీ ఆదాయం కూడా పేర్కొనాలి.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly