జియో, ఎయిర్‌టెల్, ఐడియా.. ఏది త‌క్కువ‌?

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీలు.. రీఛార్జ్ ప్లాన్‌ల ధరల‌ను 15-47 శాతం వ‌ర‌కు పెంచాయి

జియో, ఎయిర్‌టెల్, ఐడియా.. ఏది త‌క్కువ‌?

ప్ర‌ధాన టెలికాం ఆప‌రేట్ల‌రు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా, రిల‌య‌న్స్ జియో త‌మ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధ‌ర‌ల‌ను పెంచాయి. ఐడియా, ఎయిర్‌టెల్ పెరిగిన ఛార్జీలు డిసెంబ‌ర్ 2 నుంచి అమ‌ల్లోకి రాగా, రిల‌య‌న్స్ జియో స‌వ‌రించిన టారీఫ్‌లు డిసెంబ‌ర్ 6 నుంచి వ‌చ్చాయి. కంపెనీల మ‌ధ్య ఏర్ప‌డిన పోటీ నేప‌థ్యంలో అందుబాటులోకి తెచ్చిన కొత్త ప్లాన్స్ దాదాపుగా ఒకేర‌కంగా ఉన్నాయి. అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజువారిగా డేటా వంటి ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, ఐడియా ఇత‌ర నెట్‌వ‌ర్క్‌కు కూడా ఉచిత కాల్స్ స‌దుపాయం అందిస్తున్నాయి. అయితే మూడింటి ధ‌ర‌లు, ఏది త‌క్కువ‌గా ఉందో తెలుసుకుందాం.

కొత్త‌ రీఛార్జ్ ప్లాన్‌లు

recharge.jpg
ఎయిర్‌టెల్ తాజా టారీఫ్ ఛార్జీలు:
ఏ నెట్‌వ‌ర్క్‌కి అయిన ఉచిత కాలింగ్ కోసం ఎయిర్‌టెల్ మూడు ప్లాన్‌ల‌ను ప్ర‌క‌టించింది. రూ.219, రూ.399, రూ.449.

 • రూ.219 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు, రోజుకి 1 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత హ‌లో ట్యూన్స్‌, అన్‌లిమిటెడ్ వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‌ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్‌లో భాగంగా అందిస్తోంది.
 • రూ.399 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, ఉచిత హలోట్యూన్స్‌, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ సబ్‌స్ర్కిప్ష‌న్ ల‌భిస్తుంది.
 • రూ.449 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు, రోజుకు 2జీబీ డేటా, 96 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ ల‌భిస్తాయి.
  వొడాఫోన్ ఐడియా తాజా ప్లాన్‌లు
 • రూ.149 నెల‌వారీ ప్లాన్, అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు
 • రూ.249 ప్లాన్, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు
 • 299 ప్లాన్‌, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు
 • రూ.699 ప్లాన్‌, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, వ్యాలిడిటీ 84 రోజులు
 • రూ.1,499 వార్షిక ప్లాన్‌, అన్‌లిమిటెడ్ కాల్స్‌, 24జీబీ డేటా, 3600 ఎస్ఎంఎస్‌లు, వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ ధ‌ర ఏకంగా రూ.500 పెంరిగింది. గ‌తంలో ఇది రూ.999 కి ల‌భించేది. అయితే డేటా ప‌రిమితి 12 జీబీ నుంచి 24 జీబీకి పెంచింది.

రిల‌య‌న్స్ జియో కొత్త ప్లాన్స్
జియో అన్‌లిమిటెడ్ కాల్స్ కేవ‌లం జియో నెట్‌వ‌ర్క్‌కు కాల్ చేస్తే మాత్ర‌మే ఉచితం. జియోతో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేస్తే ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

 • రూ.98 ప్లాన్‌ను జియో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టింది. వ్యాలిడిటీ 28 రోజులు, మొత్తం 2 జీబీ డేటా, ఆ త‌ర్వాత నెట్‌వ‌ర్క్ స్పీడ్ 64 కెబిపీఎస్‌కి త‌గ్గుతుంది. 300 ఎస్ఎంఎస్‌లు చేసుకోవ‌చ్చు. జియో నుంచి జియో నెట్‌వ‌ర్క్‌కి ఉచిత వాయిస్ కాల్స్. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌కి కాల్ చేసేందుకు ఐయూసి టాప్-అప్ వోచ‌ర్ల‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి బ‌దులుగా రూ.10 వోచ‌ర్‌కి 1జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.98 ప్లాన్ కొనుగోలు చేస్తే ఇత‌ర కాల్స్ చేసేందుకు టాప్‌-అప్ వోచ‌ర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 • రూ.149 ప్లాన్‌ను జియో మ‌ళ్లీ కొత్త‌గా ఆవిష్క‌రించింది. వ్యాలిడిటీ 24 రోజులు, మొత్తం 24 జీబీ డేటా. 300 నిమిషాలు ఉచిత టాక్‌టైమ్ అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు, 100 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్‌కు ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly