మార‌టోరియం ఎంచుకోనివారికి కూడా క్యాష్‌బ్యాక్‌

ఫిబ్ర‌వ‌రి 29 నాటికి ఉన్న వ‌డ్డీ రేట్ల ప్ర‌కారం ఈ లెక్క‌లు ఉంటాయి

మార‌టోరియం  ఎంచుకోనివారికి  కూడా క్యాష్‌బ్యాక్‌

ఈ పండుగ సీజన్లో రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం ల‌భించింది. మార‌టోరియం కాలంల‌తో ఆరు నెలల పాటు ‘వడ్డీపై వడ్డీ’ మాఫీని అమలు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు రుణం తీసుకున్న వారందరికీ మాఫీ వర్తిస్తుంది. మారటోరియం కాలానికి వసూలు చేసిన 'వడ్డీ మీద వడ్డీ’ని వెనక్కి ఇస్తారు. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య ఉన్న తేడాను రుణగ్రహీత ఖాతాలో వేస్తారు. మారటోరియం సౌకర్యాన్ని వినియోగించుకున్న వారికి ఎంత లబ్ధి కలుగుతుందో వినియోగించుకోని వారికి కూడా అంతే మొత్తాన్ని అందజేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా.

మార్చి 1 నుంచి ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు మార‌టోరియం అమ‌లైంది. మార‌టోరియం వినియోగించుకున్న‌వారికి వ‌డ్డీపై వ‌డ్డీ (చ‌క్ర‌వ‌డ్డీ) వ‌ర్తించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో ఆరు నెల‌ల కాలానికి చెల్లించిన చ‌క్ర‌వ‌డ్డీకి- సాధార‌ణ వ‌డ్డీకి మ‌ధ్య ఉన్న తేడాను రుణ గ్ర‌హీత‌ల‌కు వెన‌క్కి చెల్లించ‌నుంది.

ఎనిమిది వర్గాలలో లభించే రూ. 2 కోట్ల లోపు రుణాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది: 1) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) రుణాలు, 2) విద్యా రుణాలు, 3) హౌసింగ్ రుణాలు, 4) దీర్ఘ‌కాలిక వ‌స్తువుల కోసం రుణాలు, 5) క్రెడిట్ కార్డ్ బకాయిలు , 6) ఆటో రుణాలు, 7) వ్యక్తిగత, వృత్తిపరమైన, 8) వినియోగ రుణాలు.

వడ్డీ మినహాయింపు పథకం:
కీలక నియమాలు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి

  1. క్రెడిట్ కార్డ్ బకాయిల విషయంలో, మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు వినియోగదారుల నుంచి ఈఎంఐ ప్రాతిపదికన ఫైనాన్స్ చేసిన లావాదేవీల కోసం కార్డ్ జారీచేసేవారు వసూలు చేసే సగటు రుణ రేటు (WALR) వడ్డీ రేటు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
  2. కాంట్రాక్ట్ రేటు లేదా WALR లో భాగంగా జరిమానా వడ్డీ, ఆలస్య చెల్లింపు కోసం జరిమానా లెక్కలోకి రాదు.
  3. ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్ , ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ , ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థ‌ల‌కు అన్నింటికి ఇది వ‌ర్తిస్తుంది.
  4. రుణదాతలు నవంబర్ 5 లోపు చ‌క్ర‌ వడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని అర్హత గల రుణగ్రహీతలకు జమ చేయాలి.
  5. ఎక్స్-గ్రేషియా రిలీఫ్ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేకుండా అర్హత కలిగిన రుణగ్రహీతలందరి ఖాతాకు జమ అవుతుంది.

ఎవరు అర్హులు?
సర్క్యులర్‌లో పేర్కొన్న విధంగా తాత్కాలికంగా, పాక్షికంగా లేదా అస‌లు మార‌టోరియం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోనివారికి కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly