అద్దె ఒప్పందం 11 నెల‌లకు చేసుకునేందుకు కార‌ణం తెలుసా?

ప‌ద‌కొండు నెల‌ల అద్దె ఒప్పందంతో స్టాంప్ డ్యూటీ, ఇత‌ర ఛార్జీల‌ను త‌ప్పించుకోవ‌చ్చు.

అద్దె ఒప్పందం 11 నెల‌లకు చేసుకునేందుకు కార‌ణం తెలుసా?

ఇంటిని అద్దెకు ఇవ్వ‌డం లేదా అద్దెకు ఉండాల‌నుకున్న‌ప్పుడు య‌జ‌మాని, అద్దెదారుడు క‌చ్చితంగా ఒప్పంద ప‌త్రంపై సంత‌కం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వ‌ర‌కు అద్దె ఒప్పందం 11 నెల‌లే ఉంటుంది. ఎందుక‌ని ఎప్పుడైనా ఆలోచించారా. ఇంటి య‌జ‌మానులు, అద్దెదారులు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఈ విష‌యంపై అవ‌గాహ‌న ఉండ‌దు.

అద్దె ఒప్పందం అనేది ఆస్తి యజమాని (భూస్వామి), అద్దెదారు మధ్య రాత‌పూర్వ‌కంగా ఉంటుంది. అందులో ఆస్తి వివరాలు, నెలవారీ అద్దె, సెక్యూరిటీ డిపాజిట్, ఎందుకు అద్దుకు తీసుకుంటున్నారు (నివాస లేదా వాణిజ్య) , ఒప్పందం వ్యవధి, వంటి నిబంధనలు, ప‌రిమితులు ఉంటాయి. ఇద్ద‌రి అంగీకారంతో నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించుకోవ‌చ్చు.

11 నెల‌ల‌కు అద్దె ఒప్పందం కుద‌రుర్చుకుంటే స్టాంప్ డ్యూటీతో పాటు ఇత‌ర ఛార్జీల‌ను మిన‌హాయించ‌వ‌చ్చు. రిజిస్ర్టేష‌న్ యాక్ట్ 1908 ప్ర‌కారం, 12 నెల‌ల కంటే ఎక్క‌వ రోజులు లీజుకు తీసుకుంటే రిజిస్ర్టేష‌న్‌ త‌ప్ప‌నిస‌రి అని చెప్తుంది. ఒప్పందం చేసుకున్న‌ట్లు న‌మోదు అయితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు దిల్లీలో ఐదేళ్ల వ‌ర‌కు లీజుకు తీసుకుంటే స్టాంప్ పేప‌ర్ ఖ‌ర్చు మొత్తం సంవ‌త్స‌రానికి అద్దెలో స‌గ‌టుగా 2 శాతం ఉంటుంది. ఒక‌వేళ సెక్యూరిటీ డిపాజిట్ కూడా అద్దె ఒప్పందంలో ఉంటే ఫ్లాట్ ఫీజు రూ.100 ఉంటుంది . ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం లీజుకు తీసుకుంటే ఇది 3 శాతం, ప‌దేళ్ల నుంచి 20 ఏళ్ల లోపు తీసుకుంటే 6 శాతం ఉంటుంది. స్టాంప్ పేప‌ర్ య‌జ‌మాని లేదా అద్దెదారుడి పేరుతో ఉంటుంది. దీంతో పాటు డిమండ్ డ్రాప్ట్‌లో ఫ్లాట్ రిజిస్ర్టేషన్ ఫీజు రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది.

ఒక‌వేళ 24 నెల‌ల కోసం అద్దె తీసుకంటే మొద‌టి 12 నెల‌ల కోసం నెల‌కు రూ.20 వేలు, మ‌రో 12 నెల‌ల కోసం రూ.22 వేలు అవుతుంది. 12 నెల‌ల కోసం రిజిస్ర్టేష‌న్ ఛార్జీలు 2 శాతం అంటే రూ.5,040 ( నెల‌కు స‌గ‌టు అద్దె రూ.21 వేలు అయితే) ఉంటుంది. దీంతో పాటు ఒప్పందంలో సెక్యూరిటీ డిపాజిట్ ఉంటే రూ.100, రిజిస్ర్టేష‌న్ వ్యాయ‌లు రూ.1,100 మొత్తం క‌లిపి రూ.6,240 అవుతుంది. లాయ‌ర్లు లేదా ఇత‌ర‌ మ‌ధ్య‌వ‌ర్తుల‌కు కాకుండా ఇంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖ‌ర్చును మిన‌హాయించేందుకు చాలావ‌ర‌కు య‌జ‌మానులు, అద్దెదారులు అద్దె ఒప్పందాన్ని రిజిస్ట‌ర్ చేసుకోరు. ఒక‌వేళ‌ రిజిస్ట‌ర్ చేసుకుంటే ఈ వ్య‌యాన్ని ఇద్ద‌రు స‌మానంగా చెల్లించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly