పీపీఎఫ్ చందాదారులు ఫారం హెచ్ ఎందుకు ఇవ్వాలి?

పీపీఎఫ్‌కు సంబంధించి ఫారం-హెచ్‌ను బ్యాంకు, ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

పీపీఎఫ్ చందాదారులు ఫారం హెచ్ ఎందుకు ఇవ్వాలి?

పీపీఎఫ్ లేదా ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులు మెచ్యూరిటీ స‌మ‌యం వ‌చ్చేస‌రికి ఫారం H గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. పీపీఎఫ్ ఖాతా 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఈ 15 సంవ‌త్స‌రాల పూరైన త‌రువాత 5 సంవ‌త్స‌రాల చొప్పున ఎన్నిసార్లు అయిన కాల‌ప‌రిమితి పొడిగించుకోవ‌చ్చు. దీనికి ఎలాంటి ప‌రిమితి లేదు. దీనికి తోడు కాల‌ప‌రిమితికి పెంచుక‌న్న స‌మ‌యంలో కాంట్రీబ్యూషన్ అనేది ఖాతాదారుని ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. కాంట్రీబ్యూష‌న్ చేసిన, చేయ‌క‌పోయినా ఖాతా ముగిసే వ‌ర‌కు వ‌డ్డీ వ‌స్తుంది.

మెచ్యూరిటీ స‌మ‌యం అనంత‌రం కూడా పీపీఎఫ్ ఖాతాదారుడు కాంట్రీబ్యూష‌న్‌ను కొన‌సాగించాలి అనుకుంటే, మెచ్యూరిటీ స‌మ‌యంకు ఒక సంవ‌త్స‌రం ముందుగానే ఫార‌మ్ హెచ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేసిన తాజా డిపాజిట్ల‌పై ఎటువంటి వ‌డ్డీ ల‌భించ‌దు. అంతేకాకుండా ఈ డిపాజిట్ల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌దు.

పీపీఎఫ్ ఫారం హెచ్ ఒకే పేజిలో ఉంటుంది. దీనిని బ్యాంకు, ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఖాతాదారులు ఈ ఫార‌మ్‌ను నింపి, త‌మ‌కు పీపీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంకులో లేదా పోస్టాఫీసులో స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.
పోస్టాఫీసు పీపీఎఫ్ ఖాతాదారులు ఫారం హెచ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్క‌డ క్లిక్‌చేయండి

పీపీఎఫ్ ఖాతాను పొడిగించిన త‌రువాత‌, చందాదారుడు సంవ‌త్స‌రానికి ఒకసారి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఐదేళ్ళ‌లో విత్‌డ్రా చేసుకునే మొత్తం కాల‌ప‌రిమితి పొడిగించుకునే స‌మ‌యానికి ఉన్న పీపీఎఫ్ మొత్తంలో 60 శాతానికి మించ‌కూడ‌దు.

పీపీఎఫ్ చందాదారుడు మెచ్యూరిటీ స‌మ‌యానికి ఖాతా మూసివేయ‌క‌పోయినా లేదా మెచ్యూరిటీ స‌మ‌యానికి ఒక సంవ‌త్స‌రం ముందుగా ఫారం హెచ్‌ను ఇవ్వక‌పోయినా, కాల‌ప‌రిమితి ముగిసిన అనంత‌రం కాంట్రీబ్యూష‌న్ చేసేందుకు అనుమ‌తించ‌రు. అయితే మెచ్యూరిటీ స‌మ‌యం వ‌ర‌కు ఉన్న మొత్తంపై మాత్రం వ‌డ్డీ జ‌మ అవుతూనే ఉంటుంది.

కాంట్రీబ్యూష‌న్ల‌ను కొన‌సాగించాల‌నుకునే పీపీఎఫ్ చందాదారులు కాల‌ప‌రిమితి ముగిసిన అనంత‌రం ఖాతాను మూసివేసి మ‌రొక కొత్త ఖాతాను తెర‌వ‌డం కంటే పాత ఖాతాను 5 సంవ‌త్స‌రాలు చొప్పున పొడిగించ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఖాతాను పొడిగించుకుంటే ప్ర‌తీ సంవ‌త్స‌రం పాక్షిక విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly