ఏటీఎమ్‌లు ఎందుకు త‌గ్గిపోతున్నాయి?

ఏటీఎంల సంఖ్య త‌గ్గడం, దేశంలో ఏటీఎమ్ ల‌ను వినియోగించే అధిక జ‌నాభాపై ప్రభావం చూపుతోంది.

ఏటీఎమ్‌లు ఎందుకు త‌గ్గిపోతున్నాయి?

మ‌న దేశంలో లావాదేవీలు పెరిగిన‌ప్ప‌టికీ, దేశంలో ఉన్న ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ల సంఖ్య‌ గత రెండేళ్లలో త‌గ్గిన‌ట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ప్ర‌తీ 1,00,000 మంది ప్రజలకు ఏటీఎమ్ అందుబాటులో ఉండే విష‌యంలో భారతదేశం ఇప్పటికే బ్రిక్స్ దేశాల్లో చివ‌ర‌న ఉంది. గత ఏడాది రిజ‌ర్వు బ్యాంక్ భద్రత‌కు సంబంధించిన నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. దీంతో బ్యాంకులు, ఏటీఎమ్ ఆపరేటర్లు ఈ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంది. దీనికి సాఫ్ట్‌వేర్, పరికరాల నవీకరణల ఖర్చుభారీగా పెరిగింది. పెరిగిన ఖ‌ర్చు కార‌ణంగా బ్యాంకులు త‌మ ఏటీఎమ్ ల‌ సంఖ్య‌ను వీలైనంత త‌గ్గించుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా ఏటీఎమ్ ల సంఖ్య తగ్గింది. ఏటీఎంల సంఖ్య త‌గ్గడం, ఏటీఎమ్ ల‌ను వినియోగించే అధిక జ‌నాభాపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా డిజిట‌ల్ లావాదేవీల‌ను త‌క్కువ‌గా చేసే ప్ర‌జ‌ల‌కు ఇది చాలా ఇబ్బందిగా మారింది. సెక్యూరిటీ సంబంధిత‌ ఖర్చులు పెరగడంతో, ఏటీఎమ్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే ఆదాయంగా ల‌భించే రుసుములు తక్కువగా ఉంటాయి. వీటిని పెంచేందుకు రెగ్యులేట‌రీ అనుమ‌త‌లు త‌ప్ప‌నిస‌రిగా అవ‌స‌రం. ప్ర‌స్తుతం బ్యాంకులు లేదా ఇత‌ర థ‌ర్డ్ పార్టీ సంస్థ‌లు ఏటీఎమ్ ఆపరేటర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవి ఒక్కో నగదు ఉపసంహరణ కోసం ఉపయోగించిన రూ.15 ఇంటర్ఛేంజ్ రుసుమును వసూలు చేస్తాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలో ఏటీఎమ్ ల సంఖ్య‌ తగ్గింది. ఇంటర్ఛేంజ్ రుసుములు ఏటీఎమ్ ల సంఖ్య త‌గ్గుద‌ల‌కు ఒక ప్ర‌ధాన కార‌ణం అని రిజ‌ర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పేర్కొన్నారు. బ్యాంకులు తమ సొంత ఏటీఎమ్ ల‌ను నిర్వహించడం కంటే ఇతర బ్యాంకులకు ఇంటర్ఛేంజ్ రుసుము చెల్లించటమే ప్ర‌యోజ‌న‌క‌రంగా భావిస్తున్నాయి.

జ‌న్ ధ‌న్ యోజ‌న వ‌ల్ల 2014 త‌రువాత మొత్తం 35.5 కోట్ల మంది బ్యాంకింగ్ వ్యవస్థ‌లోకి వ‌చ్చారు. దీంతో ఏటీఎమ్లతో సహా ప్రాథమిక ఆర్థిక సేవలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. 2016 నవంబర్లో నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఏటీఎమ్‌ల అవ‌స‌రం మ‌రింత పెరిగింది. ప్రభుత్వ ప‌థ‌కాల ద్వారా అందించే సంక్షేమ ప్రయోజనాలు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయ‌డం వ‌ల్ల ఏటీఎంలపై ఆధార‌ప‌డే వారి సంఖ్య మ‌రింత పెరిగింది.

బ్యాంకు బ్రాంచీల పున‌ర‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ కూడా ఏటీఎమ్‌ల సంఖ్య త‌గ్గ‌డానికి ఒక కార‌ణంగా చెప్పాలి. భార‌తీయ స్టేట్ బ్యాంకు 2018 తొలి అర్థ సంవ‌త్స‌రంలో 1000 ఔట్లెట్ల‌ను త‌గ్గించింది. భ‌విష్య‌త్తులో బ్యాంకులు బ్రాంచీల పై త‌క్కువ‌గా ఆధార‌డ‌తాయ‌ని, డిజిట‌ల్ విధానంలో ఎక్కువ‌ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తాయ‌ని ఎస్‌బీఐ ఎండీ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు.

తగ్గిపోతున్న ఏటిఎంల వ‌ల్ల‌ మొబైల్ బ్యాంకింగ్ మరింత పెంచే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోని అత్య‌ధిక‌ జనరేషన్ Z జనాభా దేశంలో ఉండ‌టం మొబైల్ బ్యాంకింగ్ వేగంగా పెరుగుతోంది. గత ఐదు సంవత్సరాలలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు 65 సార్లు పెరిగాయి. ప్రజలు మొబైల్ యాప్ ల‌కు బదిలీ అవుతున్నారని ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశుతోష్ ఖజురియా అన్నారు. డిజిట‌ల్ లావాదేవీలు పెరుగుతున్నా మ‌న దేశంలో ఇప్పుడే ఏటీఎమ్‌లకు ముగింపు ప‌ల‌కడం ఆమోద‌యోగ్యం కాదని ఆయ‌న పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly