సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవ‌డం కీలకం

గత రెండేళ్ల కాలంలో వ‌స్తున్న మార్పులు గ‌మ‌నిస్తే ఫండ్ ఎంపిక చాలా కీల‌కంగా మారింది. ఒకే కేట‌గిరీకి చెందిన‌ రెండు పథకాలు చాలా భిన్నమైన రాబడిని ఇస్త‌న్నాయి.

సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవ‌డం కీలకం

ఇటీవ‌లి కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్ రంగంలో వ‌స్తున్న అల‌జ‌డుల కార‌ణంగా మదుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ ఎంపికలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌త కొంత కాలంగా మ్యూచువ‌ల్ ఫండ్ల రాబ‌డులు ఎందుకు త‌గ్గాయి.

మ్యూచువ‌ల్ ఫండ్లు ఈక్విటీ(షేర్లు), డెట్( బాండ్లు) లో పెట్టుబ‌డులు చేస్తున్నాయి. ఈక్విటీ విభాగంలో స్మాల్ క్యాప్ షేర్లు గ‌త రెండేళ్లుగా స‌రైన ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డం లేదు. ఈ కేట‌గిరిల‌లో మ‌దుపు చేసిన ఫండ్లు రాబ‌డులు త‌గ్గిపోయాయి. దీనికి ఫండ్ మేనేజ‌ర్లు చెప్పే రెండు కార‌ణాలు నోట్ల ర‌ద్దు ప్ర‌భావం, గ‌తంలో మార్కెట్లు అనుకూలంగా ఉన్న స‌మ‌యంలో షేర్ల ధ‌ర‌లు అధిక‌విలువ‌కు చేర‌డం. అయితే డీమోనిటైజేషన్ ప్రభావం త‌గ్గ‌డం వ‌ల్ల స్మాల్,మిడ్ క్యాప్ మ్య‌చువ‌ల్ ఫండ్లు క్ర‌మంగా కోలుకునే అవకాశం ఉంది. డెట్ విభాగంలో ఐఎల్&ఎఫ్ఎస్ సంక్షోభం, అనంత‌రం ఎస్సెల్, డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ‌ల్లో కూడా ఇది ఏర్ప‌డ‌టం. ఈ కంపెనీల‌కు చెందిన డెట్ పెట్టుబ‌డులు పెట్టిన ఫండ్లు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.

గ‌తంలో అక్టోబ‌రు 2017న సెబీ మ్యూచువ‌ల్ ఫండ్ల పున‌వ‌ర్గీక‌ర‌ణ చేసింది. దీని ప్ర‌భావం ఆరు నెల‌లు మాత్రమే ఉంది. మ్యూచువ‌ల్ ఫండ్లు అవి పెట్టే పెట్టుబ‌డుల‌కు, సూచించే పేర్ల‌ను ప్ర‌తిబింబించే విధంగా మార్పులు చేసింది. దీని వ‌ల్ల మ‌దుప‌ర్ల‌కు క‌చ్చిత‌మైన అవ‌గాహ‌న ఏర్ప‌డింది. ఉదాహ‌ర‌ణ‌కు పున‌వ‌ర్గీక‌ర‌ణ అనంత‌రం టాప్ 100 కంపెనీల్లో మాత్రమే లార్జ్ క్యాప్ ఫండ్లు మ‌దుపు చేయాలి.

గత రెండేళ్ల కాలంలో వ‌స్తున్న మార్పులు గ‌మ‌నిస్తే ఫండ్ ఎంపిక చాలా కీల‌కంగా మారింది. ఒకే కేట‌గిరీకి చెందిన‌ రెండు పథకాలు చాలా భిన్నమైన రాబడిని ఇస్త‌న్నాయి, కాబట్టి మీరు ఒక పథకాన్ని ఎంచుకునే ముందు దాని నిర్వాహకుడిని, ఫండ్ ప‌నితీరు విశ్లేషించడానికి సమయం కేటాయించాలి. లేదా, మంచి సలహాదారుని కనుగొనవచ్చు. మీరు బ్యాంక్ లేదా డిస్ట్రిబ్యూటర్ ద్వారా పెట్టుబడి పెడుతుంటే, ఫండ్ గురించి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోండి. నిష్పాక్షికమైన అభిప్రాయాన్ని తీసుకోకుండా బ్యాంకులు తమ అనుబంధ మ్యూచువల్ ఫండ్ సంస్థ‌ల నుంచి అధిక సంఖ్యలో పథకాలను సిఫారసు చేశాయని తాజా అధ్యయనం పేర్కొంటుంది.

మ్యూచువ‌ల్ ఫండ్లు విస్తృత మార్కెట్ ప‌నితీరు బ‌ట్టి ప‌నితీరును క‌న‌బ‌రుస్తాయి. ఫండ్ ప‌నితీరును దాని బెంచ్ మార్క్, ఇత‌ర ఫండ్ల‌తో పోల్చి చూడాలి. ప‌నితీరు అనుకూలంగా లేకుంటే మీరు నిష్క్రమణ మార్గాన్ని తీసుకోవచ్చు. డెట్ ఫండ్లకు సంబంధించి ఇప్పటికే చాలా ఫండ్ సంస్థ‌లు తమ మొత్తం పెట్టుబడుల‌లో ప్ర‌తికూలంగా ఉన్న వాటిని ప‌క్క‌న (సైడ్ పాకెటింగ్) పెట్టారు. కాబ‌ట్టి అటువంటి మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి నిష్క్రమించడం వల్ల ఎక్కువ ప్రయోజనం రాదు. అయితే ప్ర‌స్తుతం మీరు పెట్టుబ‌డి పెట్టిన మ్యూచువ‌ల్ ఫండ్ వద్ద ఉన్న డెట్ పెట్టుబ‌డుల‌లో క్షీణత, పేపర్‌లో రేటింగ్ డౌన్‌గ్రేడ్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే ఇది భ‌విష్య‌త్తులో ఫండ్ ప‌నితీరుపై ప్ర‌తికూలంగా ప్ర‌భావం చూపుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly