జియో, ఎయిర్‌టెల్ ఫ్రీ వైఫై కాలింగ్.. ఏది బెస్ట్ ?

ఎయిర్‌టెల్ 100 ర‌కాల ఫోన్ మోడ‌ళ్ల‌కు, జియో 150 మోడ‌ళ్ల‌కు వైఫై కాలింగ్ స‌దుపాయం అందిస్తుంది

జియో, ఎయిర్‌టెల్ ఫ్రీ వైఫై కాలింగ్.. ఏది బెస్ట్ ?

దేశంలో ప్ర‌ధానం టెలికాం ఆప‌రేట‌ర్లు భార‌తీ ఎయిర్‌టెల్, రిల‌య‌న్స్ వైఫై కాలింగ్ సేవ‌ల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఏది ఎక్కువ‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉంది తెలుసుకుందాం. దేశ‌వ్యాప్తంగా ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్‌తో వాయిస్ కాల్స్‌ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. ఇంత‌కుముందు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్‌తో ఈ సేవ‌ల‌ను అందించేది. ఇప్పుడు ప‌బ్లిక్ వైఫై నెట్‌వ‌ర్క్‌, ఇంటిలో కూడా వైఫై నెట్‌వ‌ర్క్‌తో వాయిస్ ఓవ‌ర్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ రెండు ఆప‌రేట‌ర్ల సేవ‌లు కొంత‌వ‌ర‌కు ఒకేర‌కంగా ఉన్నాయి. రెండూ, దేశంలోని ఇత‌ర వినియోగ‌దారుల‌కు ఉచిత‌ కాల్స్‌ స‌దుపాయం అందిస్తున్నాయి. దీనికోసం వేరే యాప్ లేదా సిమ్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అయితే రెండింటిలో ఉన్న ఒక వ్య‌త్యాసం ఏంటంటే ఎయిర్‌టెల్ 100 ఫోన్ల మోడ‌ళ్ల‌కు వైఫై కాలింగ్ స‌దుపాయం ఇస్తే, జియో 150 ఫోన్లకు ఇస్తోంది.

రిల‌య‌న్స్ జియో
జియో నుంచి జియో కాల్స్‌కు ఉచిత‌ వాయిస్, వీడియో కాలింగ్ అందిస్తోంది. . యాపిల్, సామ్‌సంగ్, షామీ, వివో వంటి ఇత‌ర స్మార్ట్ ఫోన్లు ఏవైతే హెచ్‌డీ వాయిస్ స‌దుపాయం ఉందో వాటికి అంత‌రాయం లేకుండా వైఫై సేవ‌ల‌న అందించ‌నుంది. జియో వైఫైకి స‌హ‌క‌రించే యాపిల్ ఐఫోన్ 6ఎస్‌, యాపిల్ స్మార్ట్‌ఫోన్స్, సామ్‌సంగ్ గెలాక్సీ జే6, సామ్‌సంగ్ గెలాక్సీ ఎం30, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 10, వ‌న్ ప్ల‌స్ 7, వ‌న్ ప్ల‌స్ 7 ప్రో, వ‌న్ ప్ల‌స్ 7టీ, వంటివి. పూర్తి వివ‌రాల కోసం…

ఎయిర్‌టెల్‌
అన్ని యాపిల్ ఫోన్లు, సామ్‌సంగ్ ఎస్ 10, ఎస్ 10ఇ, ఎం20, వ‌న్ ప్ల‌స్ 6 అండ‌ట్ 6టీ, షామీ రెడ్‌మీ కె20, రెడ్‌మి కె20 ప్రో, పోకో ఎఫ్1, సామ్‌సంగ్ జే6, సామ్‌సంగ్ ఏ10ఎస్‌, సామ్‌సంగ్ ఆన్‌6, సామ్‌సంగ్ ఎం30, వ‌న్ ప్ల‌స్ 7, వ‌న్ ప్ల‌స్ 7 ప్రో, వ‌న్ ప్ల‌స్ 7టీ, వ‌న్ ప్ల‌స్ 7టీ ప్రో వంటి మోడ‌ళ్ల‌కు ఎయిర్‌టైల్ వైఫై కాలింగ్ స‌దుపాయం ఉంది.

వైఫై కాలింగ్ మీ మొబైల్‌లో ఎలా సెట్ చేసుకోవాలి?

  • మీ ఫోన్‌లో వైఫై కాలింగ్‌కు త‌గిన సౌక‌ర్యం ఉంద‌ని నిర్ధారణ చేసుకున్న త‌ర్వాత‌, వైఫై కాలింగ్‌కు స‌పోర్ట్ చేసే మొబైల్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలి
  • Settings లో Wi-Fi Calling ఆప్ష‌న్‌ను స్విచ్ ఆన్ చేయాలి
  • నిరంతర సేవ‌ల కోసం VoLTE స్విచ్ ఆన్ చేయండి
    నెట్‌వర్క్‌లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కొత్త‌ సేవను ఆస్వాదించడానికి, మీరు మీ Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌ల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయబడాలి. దీంతో పాటు అధిక-వేగం, స్థిరమైన Wi-Fi ఇంటర్నెట్ కనెక్షన్ సౌక‌ర్యం మీ ఫోన్ల‌లో ఉండాలి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly