ఎలక్ట్రిక్ బైకును విడుదల చేసిన షియామి..

హిమో సీ20 ఈ-బైక్ ను రోజువారీ నగరాల్లో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు

ఎలక్ట్రిక్ బైకును విడుదల చేసిన షియామి..

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియామి, కేవలం మొబైల్స్ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. మొదట మొబైల్స్ రంగంలో అడుగుపెట్టిన షియామి అతి తక్కువ సమయంలోనే టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ రంగాలకు విస్తరించింది. ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ (ఈ-బైక్) ను చైనాలో ఆవిష్కరించింది. దాని పేరు ‘హిమో సీ20’. ఇది పెడల్ సహాయంతో నడిచే ఎలక్ట్రిక్ బైకు. ఈ బైకు ధర 375 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీ లో సుమారు రూ. 26,000 అనమాట. హిమో సీ20 ఈ-బైక్ ను రోజువారీ నగరాల్లో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో 36V 10Ah లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది 360Wh ఛార్జ్ ను కలిగి ఉంటుంది. ఈ బైకును ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే ఈ బైకు గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.

himo c20.jpg

హిమో సీ20 బైకు స్టైలింగ్ విషయానికి వస్తే, ఇది వైట్ - బ్లాక్ కాంబినేషన్ తో పాటు గ్రే - బ్లాక్ కాంబినేషన్ లో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్ లాంప్, అలాగే వెనకవైపు టైయిల్ లైట్ ను అమర్చారు. బైకు వేగం, ఎంత ఛార్జ్ మిగిలి ఉంది, ఎంత దూరం ప్రయాణించాం వంటి వివరాలను చూసేందుకు ఎల్ఈడీ డిస్ ప్లే ను అమర్చారు. ఇందులో 20 అంగుళాల వీల్స్, హై ప్రొఫైల్ టైర్లను అమర్చారు. ఈ బైకులో అల్యూమినియం ఫ్రేమ్ లను వినియోగించడం వలన ఇది 21 కిలోల బరువు ఉంటుంది.

ప్రస్తుతం, హిమో సీ20 చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, రాబోయే కొన్ని నెలల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ మన దేశ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly