వైఐ స్మార్ట్ డ్యాష్ కెమెరాను విడుదల చేసిన షియామీ...

ఈ కెమెరాను కారులో ఫిక్స్ చేయడం ద్వారా మీరు డ్రైవ్ చేస్తున్నంతసేపు మీరు ప్రయాణించే మార్గాన్ని ఇది రికార్డు చేస్తుంది

వైఐ స్మార్ట్ డ్యాష్ కెమెరాను విడుదల చేసిన షియామీ...

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియామీకి చెందిన వైఐ టెక్నాలజీ సరికొత్త వైఐ స్మార్ట్ డ్యాష్ కెమెరాను మన దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే ఈ సంస్థ ఇండియా పోర్ట్‌ఫోలియోలో వైఐ యాక్షన్ కెమెరా, వైఐ 4 కే యాక్షన్ కెమెరా, వైఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా వంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ జాబితాలో కొత్త కెమెరా కూడా వచ్చి చేరింది. ఈ కెమెరాను కారులో ఫిక్స్ చేయడం ద్వారా డ్రైవ్ చేస్తున్నంతసేపు మీరు ప్రయాణించే మార్గాన్ని ఇది రికార్డు చేస్తుంది. ఇక ఈ కెమెరా ధర రూ. 5,200 గా సంస్థ నిర్ణయించింది. అయితే ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా సంస్థ దీనిని రూ. 699 తక్కువకు విక్రయిస్తుంది. ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందో కంపెనీ స్పష్టంగా చెప్పలేదు.

వైఐ స్మార్ట్ డ్యాష్ కెమెరాను విండ్‌ స్క్రీన్‌కు అటాచ్ చేయడం ద్వారా కారులో ఇన్‌స్టాల్ చేయవచ్చు. విండ్‌ స్క్రీన్ ద్వారా రోజువారీ సంఘటనలను రికార్డ్ చేయడం ఈ కెమెరా ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ప్రమాద సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వైఐ డ్యాష్ కెమెరా 165 డిగ్రీలలో 1080p 60fps, 1080p 30fps వద్ద వీడియోను రికార్డ్ చేయగలదు. ఇది మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది రికార్డ్ చేసిన అన్ని వీడియోలను నేరుగా ఎస్డీ కార్డ్ లో సేవ్ చేస్తుంది.

ఈ స్మార్ట్ డ్యాష్ కెమెరాలో ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) ఉంది, ఇది డ్రైవర్‌కు రియల్ టైమ్ హెచ్చరికను ఇస్తుంది. ఒకవేళ పొరపాటున డ్రైవర్ రోడ్డు లైన్ దాటి పక్కకు వెళ్తున్నట్లయితే, ఈ ఏడీఏఎస్ సిస్టం డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. అలాగే ఇది కొలిషన్ వార్నింగ్ సిస్టంను కూడా కలిగి ఉంది, ఒకవేళ మీ ముందు వెళ్తున్న వాహనం ఒక్కసారిగా వేగం తగ్గినప్పుడు కూడా ఇది డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

అదనంగా, వైఐ స్మార్ట్ డ్యాష్ కెమెరా 2.7 ఇంచ్ 16: 9 1080p స్క్రీన్‌ను కలిగి ఉంటుంది, ఇది రికార్డ్ చేసిన వీడియోలను చూడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది వైఫై ని కూడా సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా డ్యాష్ కెమెరా నుంచి లైవ్ వీడియోను ప్రసారం చేయవచ్చు. వైఐ స్మార్ట్ డ్యాష్ కెమెరా జీ-సెన్సార్‌తో వస్తుంది, ఇది అత్యవసర పరిస్థితుల్లో వీడియోలను ఆటోమేటిక్ గా రికార్డ్ చేయడానికి, దానిని సేవ్ చేయడానికి కెమెరాను అనుమతిస్తుంది. ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది స్పేస్ గ్రే కలర్‌ లో అందుబాటులో ఉంటుంది. అలాగే దీనిని ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా సులభం.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly