బీమా పాల‌సీ ఏ వ‌య‌సులో తీసుకోవాలి?

కుటుంబాన్ని సంర‌క్షించే బాధ్య‌తల్లో భాగంగా బీమా పాల‌సీ తీసుకోవ‌డం అన్న‌ది చాలా ముఖ్యం.

బీమా పాల‌సీ ఏ వ‌య‌సులో తీసుకోవాలి?

మ‌న జీవితం మ‌న‌కే కాకుండా మ‌న‌పై ఆధార‌ప‌డిన‌వారికి కూడా చాలా ముఖ్యం అని ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు క‌చ్చితంగా జీవిత బీమా అవ‌స‌రం గురించి తెలుసుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌కు మీరు ఉన్నప్పుడే కాకుండా లేన‌ప్పుడు కూడా భ‌ద్ర‌త క‌ల్పించిన‌వార‌వుతారు. యుక్త వ‌య‌సులో ఉన్న‌ప్పుడు బీమా అవ‌స‌రం లేద‌ని అనుకుంటారు. కానీ, 20 నుంచి 30 ఏళ్ల వ‌య‌సులోనే కుటుంబ బాధ్య‌త తీసుకోవాల్సి వ‌స్తుంది. అప్పుడే ఉద్యోగంలో చేరి డ‌బ్బు చేతికందుతుంటే సంతోషంగా ఉంటుంది. సొంత ఖ‌ర్చుల‌కు ఎవ‌రిమీదా ఆధార‌ప‌డ‌కుండా ఉంటారు. అయితే పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఇంటి ఖ‌ర్చులు, బిల్లులు, పిల్ల‌లు, కుటుంబం బాధ్య‌తలు తీసుకుంటారు. దీంతో బాధ్య‌త‌ల‌తో పాటు కుటుంబానికి మీరు ఎంత అవ‌స‌ర‌మో అన్న విష‌యం తెలుస్తుంది. వయ‌సు పెరిగినా కొద్ది మ‌న ఇష్టాఇష్టాలతో పాటు కుటుంబానికి ఏం కావాలి, ఏం అవ‌స‌రం అన్న దాని గురించి అడుగ‌డుగునా ఆలోచిస్తారు. అప్పుడు మీకోసం కాకుండా కుటుంబం కోసం, మిమ్మ‌ల్ని కావాల‌నుకున్న‌వారి కోసం జీవిస్తారు. వ‌య‌సులో ఉన్న‌ప్పుడు వీకెండ్ పార్టీ గురించి ఎలా ప్లాన్ చేసుకుంటారో, బాధ్య‌త‌లు వ‌చ్చిన త‌ర్వాత ఇళ్లు కొనుగోలు గురించి అదేవిదంగా ఆలోచిస్తారు. కుటుంబం గురించి ఆలోచించే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఆలోచ‌నా విధానం మారిపోతుంది. అయితే కుటుంబాన్ని సంర‌క్షించే బాద్య‌తల్లో భాగంగా బీమా పాల‌సీ తీసుకోవ‌డం అన్న‌ది చాలా ముఖ్యం.

మీ ఆదాయంపై పిల్ల‌లు, కుటుంబ స‌భ్యులు, త‌ల్లిదండ్రులు ఆదార‌ప‌డ‌తారు. ఇలాంటి దశ‌లో మీ కుటుంబానికి భ‌రోసాను ఇచ్చేందుకు మీకు బీమా పాల‌సీ ఉండ‌టం చాలా అవ‌స‌రం. మీ కుటుంబానికి మీరు ఉన్నార‌ని ఇచ్చే హామీ కూడా మీకు ఆనందాన్నిస్తుంది. ట‌ర్మ్ ప్లాన్ తీసుకునేట‌ప్పుడు తీవ్ర వ్యాదుల చికిత్స‌కు హామీ ఉందా లేదా అన్న విష‌యం ప‌రిశీలించాలి. ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం దేశంలో ఆరోగ్య చికిత్స‌ల‌కు సంబంధించిన ఖర్చులు భ‌రించ‌లేక‌ 5.5 కోట్ల మంది పేద‌రికంలో జీవిస్తున్నారు. 61 శాతం మ‌ర‌ణాలు నివార‌ణ లేని వ్యాదులు క్యాన్స‌ర్‌, మ‌దుమేహం, గుండెనొప్పి వంటి వ్యాదుల‌తో సంభ‌విస్తున్నాయి. అనుకోకుండా వ‌చ్చే ఇలాంటి ప్రాణాంత‌క వ్యాదులు మొత్తం కుటుంబాన్ని బాధ‌ల్లోకి నెట్టేస్తాయి. ఇలాంటి స‌మ‌యాల్లో తీవ్ర వ్యాదుల‌కు హామీనందించే పాల‌సీ ఉంటే ర‌క్ష‌ణ‌గా ఉంటుంది. మారుతన్న జీవిన శైలితో ఇలాంటి వ్యాదులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాబ‌ట్టి ముందు జాగ్ర‌త్త పాటించ‌డం మంచిది.

అయితే సాంప్రదాయ‌క, ఆధునికమైన రెండు ర‌కాల పాల‌సీల‌ను క‌లిగి ఉండ‌టం మేలు. అంటే తీవ్ర వ్యాదుల‌కు సంబంధించిన క‌వ‌ర్‌. ఇప్పుడు హైబ్రిడ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌ల‌లో సాంప్ర‌దాయ‌, క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ కలిపి ఒకే పాల‌సీలో ల‌భిస్తున్నాయి. ఇందులో వ‌య‌సు పెరిగినా కొద్ది జీవిత బీమా క‌వ‌రేజ్‌ త‌గ్గి, క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌రేజ్ పెరుగుంది.

స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజ్‌తో తీవ్ర వ్యాదుల చికిత్స త‌ర్వాత ప్రీమియం ర‌ద్దు అవుతుది. దీంతో తిరిగి ప్రీమియం చెల్లించ‌న‌క్క‌ర్లేదు. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ స‌మ‌యంలో హామీ మొత్తం అందించ‌డంతోపాటు జీవిత బీమా క‌వ‌రేజ్ కూడా ఎలాంటి ప్రీమియం చెల్లించ‌క‌పోయినా అదేవిధంగా కొన‌సాగుతుంది. ఈ రోజుల్లో బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం చాలా సుల‌భం. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేసి పాల‌సీ తీసుకోవ‌చ్చు. అయితే దానికంటే ముందు బీమా సంస్థ‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను, హామీ మొత్తాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మీకు , మీ కుటుంబానికి క‌చ్చిత‌మైన‌ ఆర్థిక భ‌రోసా ల‌భిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly