వాహ‌న బీమా తీసుకునేందుకు లైసెన్స్ అవ‌స‌రం లేదు

వాహ‌న బీమా తీసుకునేందుకు డ్రైవింగ్ లైసెన్సు అవ‌స‌రం లేన‌ప్ప‌టికీ క్ల‌యిమ్ చేసే సంద‌ర్భంలో అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క ప‌త్రం ఇది.

వాహ‌న బీమా తీసుకునేందుకు లైసెన్స్ అవ‌స‌రం లేదు

వాహ‌న‌ బీమా పాలసీని కొనుగోలు చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. మీరు క్రొత్త కారు గానీ బైక్ గానీ కొనుగోలు చేసి వాహ‌న బీమా పాలసీని కొనాల‌నుకునేవారు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మస్య అని అనుకోవచ్చు. అయితే మోటారు వాహ‌న బీమా పాలసీని కొనడానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కాదు.

మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా మీ కోసం లేదా మీ కుటుంబ సభ్యుల కోసం ఒక వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. దానికి డ్రైవింగ్ లైసెన్సు అవ‌స‌రం లేదు. వాహనాన్ని నమోదు చేయడానికీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

అవసరమైన పత్రాలు: మోటారు వాహ‌న బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా ప్ర‌పోస‌ల్ ఫార‌మ్ లో బీమా చేయించుకునే వాహనం, డ్రైవర్ వ్యక్తుల గురించి అన్ని ప్రాథమిక సమాచారం క‌లిగి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి) కాపీ ఉండాలి. ఒక వేళ పాల‌సీ పునరుద్ధరణ అయితే మునుపటి సంవత్సరం పాల‌సీ కాపీ అవ‌స‌రం ఉంటుంది. బీమాలో డ్రైవర్ వివరాలు అవ‌స‌రం ఉన్ప‌ప్ప‌టికీ , డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కాదు.

బీమా కొనుగోలు చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కానప్పటికీ, క్ల‌యిమ్ దాఖలు చేయడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలలో ఇది ఒకటి. ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏంటంటే ప్రమాదం సమయంలో వాహనం డ్రైవింగ్ చేసిన వ్యక్తి చెందిన డ్రైవింగ్ లైసెన్స్ అవ‌స‌రం ఉంటుంది. క్లయ‌మ్ ఆమోదం పొందితే బీమా చేసిన మొత్తం పాలసీదారుడి ఖాతాలో మాత్రమే జమ అవుతుంది. డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే బీమా సంస్థలు క్ల‌యిమ్ ను తిరస్కరిస్తాయి

వాహనం యాజమాన్యాన్ని ధ్రువీకరించడానికి ఆర్‌సిని సమర్పించాల్సి ఉంటుంది. పాల‌సీ యాక్టివ్ గా ఉందోలేదో తెలుసుకునేందుకు, అందులో ఏయే అంశాలు కవర్ అవుతాయో తెలిపేందుకు ఆ పాల‌సీ నకలు, క్లెయిమ్ ఫారం వాహన న‌ష్టం జ‌రిగిన‌ తేదీ, కారణం. ప్రమాదం జరిగితే, గాయాలు లేదా మరణం లేదా మూడవ పక్షానికి నష్టం, రశీదులు, మరమ్మత్తు బిల్లుల కోసం ఎఫ్ఐఆల‌ర్ వంటి అదనపు వివరాలు కూడా అవసరం.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly