మూసివేత దిశగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్..

ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఏబీపీబీ) అనేది పూర్తి సర్వీస్ డిజిటల్ బ్యాంక్

మూసివేత దిశగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్..

ప్రారంభించి సరిగ్గా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే, ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకు మూసివేతకు సిద్ధమైంది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఏబీఐపీబీఎల్) డైరెక్టర్ల బోర్డు అన్ని రెగ్యులేటరీ లకు లోబడి ఏబీఐపీబీఎల్ ను స్వచ్ఛందంగా మూసివేయడాన్ని ఆమోదించింది. .

వ్యాపార నమూనాలో ఊహించని పరిణామాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇవి ఆర్థిక నమూనాను అవాంఛనీయమైనవిగా చేశాయని కమిటీ తెలిపింది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఏబీపీబీ) అనేది పూర్తి సర్వీస్ డిజిటల్ బ్యాంక్, ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐడియా సెల్యులార్ లిమిటెడ్ తో కలిసి 51:49 ఈక్విటీ వాటాను కలిగి ఉంది.

పెమెంట్స్ బ్యాంకు వినియోగదారులు తమ ఖాతాల్లోని మొత్తాన్ని వేరొక బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చునని, అలాగే జూలై 26, 2019 నుంచి బ్యాంకు ఎలాంటి డిపాజిట్లను అనుమతించదని ఒక ప్రకటన ద్వారా తెలిపింది. డిపాజిట్లను పెంచుకోడానికి బ్యాంకు చాలా కష్టపడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రాబోయే మూడు నెలల్లో దీని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.

పెమెంట్స్ బ్యాంకుల్లోని వినియోగదారులు తమ ఖాతాల్లో రూ. లక్ష వరకు జమ చేయవచ్చు. ఈ బ్యాంకులు కేవలం డిపాజిట్ లను అనుమతిస్తాయే గానీ ఉపసంహరణలు అనుమతించవు. ఆర్థిక చేరికలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ 2014 నవంబర్‌లో పెమెంట్స్ బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ, చాలా పెమెంట్స్ బ్యాంకులు టేకాఫ్ చేయడానికి చాలా కష్టపడ్డాయి.

ఈ పథకం కింద 2015 సంవత్సరంలో లైసెన్స్ పొందిన ఏడు బ్యాంకులలో ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకు ఒకటి. ఇది ఫిబ్రవరి 2018 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly