ఎయిర్ఏషియా కొత్త రూట్ల‌లో టికెట్‌ రూ.1999

న్యూదిల్లీ-శ్రీనగర్, న్యూదిల్లీ-పుణెలకు విమానాల కోసం రూ. 2,499, రూ. 2,699 టిక్కెట్ల ధ‌ర‌లు ఉంటాయ‌ని ఎయిర్ఏషియా పేర్కొంది.

ఎయిర్ఏషియా కొత్త రూట్ల‌లో టికెట్‌ రూ.1999

ఫిబ్రవరి 1 నుంచి న్యూదిల్లీ, హైదరాబాద్ కు విమాన సర్వీసులు ఎయిర్ఏషియా ఇండియా ప్రారంభించనుంది. న్యూదిల్లీ, హైదరాబాద్ ల‌ను అనుసంధానిస్తున్న విమానాల కోసం రూ. 1,999 చొప్పున టిక్కెట్లను ప్ర‌యాణికులు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ఏషియా తెలిపింది. న్యూఢిల్లీ-హైదరాబాద్ విమానం ఉద‌యం 6.05 గంటలకు, సాయంత్రం5.50 గంటలకు దేశ‌ రాజధాని నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 8.45 గంటలకు, రాత్రి 8.25 గంటలకు ప్రారంభం అవుతుంది. గత నెలలో చెన్నై, హైదరాబాద్ ల‌ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించింది. ఎయిర్ఏషియా ఇండియా జనవరి 15 నుంచి ముంబయి, బెంగళూరుల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది. టాటా సన్స్, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా ఉమ్మ‌డి వెంచర్ ఎయిర్ ఏషియా ఇండియా దేశవ్యాప్తంగా 19 గమ్యస్థానాలకు విమానాల‌ను న‌డుపుతూ 20 విమానాలను కలిగి ఉంది. న్యూదిల్లీ తో శ్రీనగర్, పుణెలను కలిపే మార్గాల‌కు కూడా విమానాలను అదనంగా ఎయిర్ఏషియా ప్రకటించింది. న్యూదిల్లీ నుంచి శ్రీనగర్, న్యూదిల్లీ నుంచి పుణె మధ్య న‌డిచే రెండు విమానాలు వరుసగా మ‌ధ్యాహ్నం12.15, ఉద‌యం 10.55 గంటలకు ప్రారంభమవుతాయి. శ్రీనగర్, పుణె నుంచి తిరిగి మ‌ధ్యాహ్నం 2 గంటలు, 1.30 గంటలకు బయలుదేరుతాయి. న్యూదిల్లీ-శ్రీనగర్, న్యూదిల్లీ-పుణెలకు విమానాల కోసం రూ. 2,499, రూ. 2,699 టిక్కెట్ల ధ‌ర‌లు ఉంటాయ‌ని ఎయిర్ఏషియా పేర్కొంది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly