పాన్ బ‌దులుగా ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు

పాన్ కార్డుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయ పత్రాలను ఆదాయపు పన్ను విభాగం అనుమతిస్తుంది

పాన్ బ‌దులుగా ఈ  డాక్యుమెంట్లు ఉంటే చాలు

బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు , పెద్ద లావాదేవీలు చేసేట‌ప్పుడు పాన్ అవ‌స‌రం ఉంటుంది. అయితే ఇటీవ‌ల ఆదాయ ప‌న్ను శాఖ కొత్త నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది. పాన్ అవ‌స‌ర‌మైన చోట, పాన్ లేనివారు ఆధార్‌ లేదా ఫారం 60 కూడా ఇవ్వ‌వ‌చ్చు.

పాన్ బ‌దులుగా ఆధార్‌
పాన్ అవ‌స‌ర‌మైన చోట ఆధార్‌ను చూప‌వ‌చ్చ‌ని ఆదాయ ప‌న్ను శాఖ‌ సెప్టెంబ‌ర్‌లో వెల్ల‌డించింది. పాన్ కార్డ్ లేని వారికి ఆధార్ మాత్ర‌మే ఉన్న‌వారికి పాన్‌కు బ‌దులుగా ఆధార్ నంబ‌ర్‌ను ఇవ్వ‌వ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో ఆదాయ ప‌న్ను శాఖ స్వ‌యంగా వారికి పాన్ జారీ చేస్తుంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు కూడా పాన్ అవ‌స‌రం ఉన్న చోట ఆధార్‌ను అనుమ‌తించాల్సిందిగా రెవెన్యూ కార్య‌ద‌ర్శి అజ‌య్ భూష‌న్ పాండే ఆదేశించారు. అంటే కొత్త ఖాతాను ప్రారంభించాల‌న్నా లేదా రూ.50 వేల కంటే ఎక్కువ న‌గ‌దు బ‌దిలీ చేయాల‌న్న ఆధార్ ఉంటే స‌రిపోతుంది.

ఫారం 60
పాన్ లేనివారు సుల‌భంగా ఫారం 60 పూరించి ఆదాయ ప‌న్ను శాఖ‌కు అందించ‌వ‌చ్చు. ఫారం 60 అంటే పాన్ లేదా ఆదాయ ప‌న్ను శాఖ‌కు తెలుపుతున్న‌ట్లు లెక్క‌. మీ ఆదాయ వివ‌రాలు కూడా ఇక్క‌డ తెలుస్తాయి. కేవ‌లం పాన్ కార్డ్ లేనివారు మాత్ర‌మే దీనిని నింపాలి లేక‌పోతే ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 272 బీ ప్ర‌కారం రూ.10 వేల జ‌రిమానా ప‌డుతుంది. పాన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసి ఉండి ఇంకా రాక‌పోతే కూడా ఈ ఫారం స‌మ‌ర్పించ‌వ‌చ్చు. అయితే పాన్ కోసం దాఖ‌లు చేసిన అప్లికేష‌న్ నంబ‌ర్‌ను ఇవ్వాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly