కేవలం రూ. 3500 కే అమెజాన్ టాబ్లెట్..

జూన్ 6 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది

కేవలం రూ. 3500 కే అమెజాన్ టాబ్లెట్..

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతి తక్కువ ధర కలిగిన కొత్త టాబ్లెట్ ను గురువారం అమెరికాలో విడుదల చేసింది. దీని పేరు “ఫైర్ 7”. దీని ధర కేవలం $ 49.99 మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 3,500 అన్నమాట. ఇది జూన్ 6 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. అమెజాన్ ఫైర్ 7 టాబ్లెట్ ద్వారా అలెక్సా వాయిస్ అసిస్టెంట్, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్ యాప్ స్టోర్, అమెజాన్.కామ్ లతో సహా అమెజాన్ ఉత్పత్తులను సులభంగా యాక్సిస్ చేయవచ్చు. అమెజాన్ ఫైర్ 7 ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 7 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే ని కలిగి ఉండడంతో పాటు 1.3 GHz క్వాడ్ కోర్ చిప్ ను కలిగి ఉంది. దీనిలో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. అయితే, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512 జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీ, స్క్రీన్ షేరింగ్, బ్యాక్ కెమెరా, 7 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దీనిలో ఎంత ర్యామ్ ను అందిస్తున్నారనే విషయాన్ని సంస్థ తెలియచేయలేదు. ఇది బ్లాక్, గ్రీన్, పర్పుల్, బ్లూ రంగులలో లభిస్తుంది. దీనితో పాటు “ఫైర్ 7 కిడ్స్ వెర్షన్” ను కూడా అమెజాన్ విడుదల చేసింది. దీని ధర $ 99.99, అనగా మన కరెన్సీ లో సుమారు రూ. 7,000. ఇది “కిడ్ ప్రూఫ్ కేసు” తో అందుబాటులో ఉండనుంది. అలాగే ఇది ఒక సంవత్సర అమెజాన్ ఫ్రీ టైమ్ సర్వీస్ సబ్ స్క్రిప్షన్ తో లభించనుంది. ఇందులో పిల్లలకు సంబంధించిన గేమ్స్, యాప్స్, పుస్తకాలు, వీడియోలు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ఫైర్ 7 అనేది ప్రధానంగా వీడియోలు, మ్యూజిక్, ఇంటర్నెట్ ను సర్ఫ్ చేయాలనుకునే వారికి ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువగా గేమ్స్ ఆడేవారికి ఇది అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే హార్డ్ కోర్ గేమ్స్ కి సపోర్ట్ చేసే విధంగా దీనిని రూపొందించలేదు. అయితే ఆపిల్ సంస్థకి చెందిన ఐప్యాడ్ మినీ ధర రూ. 48,900 లతో మొదలవుతుంది, దీనితో ఎక్కువ మంది వినియోగదారులు ఫైర్ 7 వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. మన దేశంలో ఈ టాబ్లెట్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో ఇంకా స్పష్టత లేదు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly