అతి త్వరలో అమెజాన్ ఫ్రీడమ్ సేల్..

అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఒకరోజు ముందుగానే సేల్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది

అతి త్వరలో అమెజాన్ ఫ్రీడమ్ సేల్..

దేశంలోని అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థలలో ఒకటైన అమెజాన్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. “ఫ్రీడమ్ సేల్” పేరుతో ఈ సేల్ ను ప్రారంభించనుంది. ఈ సేల్ ను ఆగష్టు 8 నుంచి 11 వరకు అనగా నాలుగు రోజుల పాటు అమెజాన్ నిర్వహించనుంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఒకరోజు ముందుగానే అనగా ఆగష్టు 7, మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా మొబైల్స్ & యాక్ససరీస్, ఎలక్ట్రానిక్స్, హోమ్ & కిచెన్, టీవీస్ & అప్లయన్సెస్, అమెజాన్ ఫ్యాషన్, డైలీ ఎసెన్షియల్స్, బుక్స్, ఎంటెర్టైన్మెంట్, అమెజాన్ బ్రాండ్స్ పై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది. ఒకవేళ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు అయినట్లైతే, మీరు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు వినియోగదారులతో పాటు డెబిట్ కార్డు వినియోగదారులకు కూడా ఈఎంఐ సదుపాయాన్ని అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ లో భాగంగా మొబైల్స్ & యాక్ససరీస్ పై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్ పై 50 శాతం వరకు, హోమ్ & కిచెన్ పై 30 నుంచి 75 శాతం వరకు, టీవీస్ & అప్లయన్సెస్ పై 60 శాతం వరకు, అమెజాన్ ఫ్యాషన్ పై 80 శాతం వరకు, డైలీ ఎసెన్షియల్స్ పై 70 శాతం వరకు, బుక్స్, ఎంటెర్టైన్మెంట్ పై 70 శాతం వరకు, అమెజాన్ బ్రాండ్స్ పై 65 శాతం వరకు, దేశీయ విమాన టికెట్ బుకింగ్స్ పై రూ. 2000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. సేల్ జరిగే నాలుగు రోజులలో ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు గోల్డెన్ హావర్ డీల్స్ ను అమెజాన్ అందించనుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly