ఇకపై అమెజాన్ ద్వారా విమాన టిక్కెట్లు..

ఈ సర్వీస్ ను ప్రారంభించడానికి ఆన్ లైన్ ట్రావెల్ ప్లాట్ ఫారం అయిన క్లియర్ ట్రిప్ తో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది

ఇకపై అమెజాన్ ద్వారా విమాన టిక్కెట్లు..

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం షాపింగ్, నగదు బదిలీ, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జ్ వంటి సదుపాయాలను అందిస్తున్న అమెజాన్, తాజాగా అమెజాన్ యాప్ ద్వారా దేశీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని తమ వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ను ప్రారంభించడానికి ఆన్ లైన్ ట్రావెల్ ప్లాట్ ఫారం అయిన క్లియర్ ట్రిప్ తో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. "వినియోగదారులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి “క్లియర్ ట్రిప్” తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నామని అమెజాన్ పే డైరెక్టర్ షరీక్ ప్లాస్టిక్ వాలా ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ వినియోగదారులు ఏదైనా కారణంతో టిక్కెట్ ను రద్దు చేసుకున్నట్లైతే, ఎలాంటి అదనపు చార్జీలను విధించమని అమెజాన్ తెలిపింది. కేవలం ఎయిర్ లైన్స్ సంస్థలు విధించే క్యాన్సిలేషన్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు అమెజాన్ మొబైల్ యాప్, వెబ్ సైట్ లో అమెజాన్ పే ఆప్షన్ లోకి వెళ్లి విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అమెజాన్‌ యాప్‌ వినియోగదారులకు, ప్రైమ్‌ సభ్యత్వం తీసుకొన్నవారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ప్లాస్టిక్ వాలా తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly