ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న అమెజాన్..

దేశంలో మొత్తం 100 కియోస్క్ లను నెలకొల్పాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తుంది

ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న అమెజాన్..

ఆన్ లైన్ విక్రయాల్లో దుమ్ములేపుతున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌, ఇప్పుడు ఆఫ్‌లైన్‌ మార్కెట్లో కూడా చక్రం తిప్పడానికి సిద్దమవుతుంది. దీనిలో భాగంగా దేశంలోని పలు షాపింగ్ మాల్స్‌లో కియోస్క్ లను ఏర్పాటు చేయాలని అమెజాన్‌ భావిస్తుంది. దేశంలో మొత్తం 100 కియోస్క్ లను నెలకొల్పాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తుంది. ఈ కియోస్క్ ల ద్వారా అమెజాన్‌కు చెందిన కిండ్లె ఈ-బుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటి ఉత్పత్తులను విక్రయించనుంది. రెండేళ్ల క్రితమే అమెజాన్ బెంగళూరులో రెండు, ముంబయిలో ఒకటి, అలాగే అహ్మదాబాద్‌లో ఒక కియోస్క్ ను ఏర్పాటు చేసింది. అలాగే ఇటీవలే నోయిడాలోని లాజిక్స్‌ మాల్‌లో ఐదో కియోస్క్ ని ఏర్పాటు చేసింది. అమెజాన్‌ కియోస్క్ ను ఏర్పాటు చేయడానికి కేవలం 70 నుంచి 80 చదరపు అడుగుల స్థలం మాత్రమే అవసరమవుతుంది. అందువలన షాపింగ్ మాల్స్ లో చాలా సులువుగా వీటిని నిర్వహించవచ్చు. వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు అమెజాన్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. వినియోగదారులు నేరుగా కియోస్క్ ల వద్దకు వచ్చి కిండ్లె ఈ-బుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటి ఉత్పత్తులను నేరుగా పరిశీలించి, వాటి పని తీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకొని అనంతరం వాటిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 80 కియోస్క్ లను అమెజాన్ విజయవంతంగా నిర్వహిస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly