కొత్త అపాచీ ఆర్‌ఆర్‌ 310ను విడుదల చేసిన టీవీఎస్‌..

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ 310ను వినియోగిస్తున్న వారు ఈ సరికొత్త ఫీచర్‌ను టీవీఎస్‌ రేసింగ్‌ యాక్సెసిరీస్‌లో అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది

కొత్త అపాచీ ఆర్‌ఆర్‌ 310ను విడుదల చేసిన టీవీఎస్‌..

టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ అపాచీ ఆర్‌ఆర్‌ 310 కు సంబంధించిన అప్ డేటెడ్ వెర్షన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిలో రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ ను అమర్చారు. రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ ను అమర్చడం ద్వారా బైక్ ఎంత వేగంగా ప్రయాణించినప్పటికీ స్థిరత్వాన్ని కోల్పోదని, ప్రత్యేకంగా రోడ్డు మలుపుల్లో మరింత స్థిరత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో దీనికి రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ ను అమర్చినట్లు టీవీఎస్‌ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ 310ను వినియోగిస్తున్న వారు ఈ సరికొత్త ఫీచర్‌ను టీవీఎస్‌ రేసింగ్‌ యాక్సెసిరీస్‌లో అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ బైకు ఫాంటమ్ బ్లాక్ రంగులో అందుబాటులో ఉండనుంది. దీని ధరను రూ. 2.27లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)గా సంస్థ నిర్ణయించింది.

రేస్‌ ట్యూన్‌ (ఆర్‌టీ) స్లిపరీ క్లచ్‌ను ప్రవేశపెట్టడంపై ఎంతో ఉత్సుకతతో ఉన్నామని, ఇది మా ప్రస్తుత, కొత్త వినియోగదారులకు నచ్చుతుందని భావిస్తున్నామని టీవీఎస్‌ మోటార్స్‌ డైరెక్టర్‌, సీఈవో కె.ఎన్‌.రాధకృష్ణన్‌ తెలిపారు.

టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌ 310 రివర్స్ ఇంక్లైన్డ్ డబుల్ ఓవర్హెడ్ క్యాం (డీఓహెచ్సీ) లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో అదనపు ఆయిల్ కూల్డ్ టెక్నాలజీని వినియోగించారు. ఇందులో సిక్స్ స్పీడ్ గేర్బాక్స్ ను అమర్చారు. ఈ బైకు లో వినియోగించిన 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను టీవీఎస్‌ మోటార్ కంపెనీ, బీఎండబ్ల్యూ మోటార్ రాడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. బీఎండబ్ల్యూ జీ 310, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ లలో కూడా ఇదే ఇంజిన్ ను వినియోగించారు. ఇది 9,700 ఆర్పీఎం వద్ద 34 బీహెచ్పీ గరిష్ట శక్తిని, అలాగే 7,700 ఆర్పీఎం వద్ద 27.3 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. భారత క్రికెటర్ మహేందర్ సింగ్ ధోనీ స్లిప్పర్ క్లచ్ తో అందుబాటులో ఉన్న కొత్త టీవీఎస్‌ అపాచీ ఆర్‌ఆర్‌ 310 కి మొట్టమొదటి యజమాని అని సంస్థ తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly