టీవీ చానెల్స్, క్రెడిట్ కార్డులను ఆవిష్కరించిన యాపిల్..

ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్ ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది

టీవీ చానెల్స్, క్రెడిట్ కార్డులను ఆవిష్కరించిన యాపిల్..

మొబైల్ తయారీ రంగంలో దూసుకుపోతున్న యాపిల్, ఇప్పుడు కొత్తగా టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ టీవీ ఛానెల్లను ఆవిష్కరించింది. దీనితో పాటు క్రెడిట్ కార్డులను కూడా మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

యాపిల్ టీవీ ప్లస్ :

ఈ సబ్ స్క్రిప్షన్ స్ట్రీమింగ్ సర్వీస్ ఒరిజినల్ కంటెంట్ లైబ్రరీని కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్ ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ స్ట్రీమింగ్ సేవల కోసం యాపిల్ సుమారు రూ. 138 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.

యాపిల్ టీవీ ప్లస్ అనేది స్వతంత్రంగా పనిచేసే యాప్ కాదు. దీనిని ఐఓఎస్, మ్యాక్, ఇతర ప్లాట్ ఫామ్లపై యాపిల్ టీవీ యాప్ ద్వారా యాక్సిస్ చేయాల్సి ఉంటుంది. యాపిల్ టీవీ ప్లస్ అనేది సోనీ, ఎల్జీ, శామ్సంగ్, విజియో స్మార్ట్ టీవీ, రోకు, అమెజాన్ స్ట్రీమింగ్ స్టిక్ ప్లాట్ ఫారంలపై అందుబాటులోకి రానుందని యాపిల్ వైస్ ప్రెసిడెంట్, పీటర్ స్టెర్న్ తెలిపారు. యాపిల్ టీవీ ప్లస్ సర్వీస్ ను యాపిల్ టీవీ యాప్ లోని ప్రత్యేకమైన ట్యాబ్ లేదా సెక్షన్ లో పొందవచ్చు.

యాపిల్ టీవీ చానెల్స్ :

యాపిల్ టీవీ చానెల్స్ సబ్ స్క్రైబ్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో హెచ్‌బీవో, స్టార్జ్, షోటైమ్, సీబీఎస్ ఆల్ యాక్సెస్, స్మిత్‌సోనియన్ ఛానల్, ఎపిక్స్, ఎంటీవీ హిట్స్ వంటి పలు ప్రముఖ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఒక్కొక్క సర్వీస్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే యాపిల్ అన్ని సర్వీసులను డిస్కౌంట్ తో అందించనుంది. అయితే, సర్వీసులకు అయ్యే ఖర్చును మాత్రం యాపిల్ పేర్కొనలేదు.

వినియోగదారులు తమకు నచ్చిన టీవీ నెట్ వర్క్ లను ఎంపిక చేసుకుని వాటిని యాపిల్ టీవీ యాప్ లో చూడవచ్చు. యాపిల్ టీవీ ఛానళ్ళు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100కి పైగా దేశాలలో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే మే నెలలో సాఫ్ట్ వేర్ అప్డేట్ ద్వారా యాపిల్ టీవీ యాప్ కి జత చేయనున్నారు.

వీటితో పాటు ‘యాపిల్ కార్డు’ పేరుతో క్రెడిట్ కార్డులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటిచింది. దీని కోసం గోల్డ్‌మన్ శాక్స్‌తో యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే యాపిల్ న్యూస్ ప్లస్, వీడియో గేమ్ సర్వీసులను కూడా సంస్థ ప్రారంభించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly