ఎన్‌పీఎస్‌లో రెండు ఖాతాల గురించి తెలుసా?

ఎన్‌పీఎస్‌లో ఉండే వివిధ‌ ఖాతాల గురించి తెలుసుకుందాం.

ఎన్‌పీఎస్‌లో రెండు ఖాతాల గురించి తెలుసా?

స‌మాజంలో మార్పుల వ‌ల్ల చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. ఉపాధి నిమిత్తం పిల్ల‌లు ఇత‌ర ప్ర‌దేశాల‌కు వ‌ల‌స వెళ్లిపోతున్నారు. జీవ‌న ప్ర‌మాణం వృద్ధి చెందింది. దీంతో పాటే జీవించే వ్య‌యం, వైద్య ఖర్చులు అంత‌కంతా పెరిగిపోతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రికి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాతా క్ర‌మ‌మైన ఆదాయం రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకు కొత్త పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్) చ‌క్క‌ని మార్గం. ఎన్‌పీఎస్‌లో ఉండే వివిధ‌ ఖాతాల గురించి తెలుసుకుందాం. ఎన్‌పీఎస్ లో రెండు ఖాతాలు ఉంటాయి…టైర్ 1, టైర్ 2 ఖాతాలు. టైర్ 1 ఖాతాలో న‌గ‌దు జ‌మ‌చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. క‌నీసం రూ.500, గ‌రిష్టంగా రూ.1.5ల‌క్ష‌లు జ‌మ‌చేయాలి. ఏడాదిలో క‌నీసం రూ.6వేలు జ‌మ‌చేయాలి లేక‌పోతే పెనాల్టీ విధిస్తారు. ఇందులోనూ రెండు ర‌కాల పెట్టుబ‌డి ఛాయిస్‌లున్నాయి… యాక్టివ్‌, ఆటో ఛాయిస్‌లు.

యాక్టివ్ ఛాయిస్‌:
ఈక్విటీ, డెట్ ఫండ్లు, ప్ర‌భుత్వ, కార్పొరేట్ బాండ్ల‌లో ఏయే నిష్ప‌త్తుల్లో పెట్టుబ‌డి పెట్టాల‌న్న‌ది మ‌దుప‌రి ఎంచుకోవ‌చ్చు. ఐతే ఈక్విటీల్లో గ‌రిష్టంగా 50శాతం, కనీసం 10శాతం ఉండేలా చూసుకోవాలి. మిగ‌తావి ప్ర‌భుత్వ‌, కార్పొరేట్ బాండ్ల‌లో పెట్ట‌వ‌చ్చు.

ఆటో ఛాయిస్‌:
యాక్టివ్ ఛాయిస్‌ను ఎంచుకోని స‌భ్యుల‌కు ఆటోమెటిక్‌గా ఆటో ఛాయిస్‌ను వ‌ర్తింప‌జేసి చందాదారుల వ‌య‌సును బ‌ట్టి పెట్టుబ‌డి ర‌కాల కేటాయింపులు జ‌రుగుతుంది. 75శాతం వ‌ర‌కు ఈక్విటీల్లో మిగ‌తాది ఇత‌ర వాటిలో పెడ‌తారు.

టైర్ 2 ఖాతా ఐచ్ఛికం. దీంట్లోనూ ఈక్విటీ, బాండ్లు, కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుకోవ‌చ్చు. ఇది టైర్ 1 ఖాతాకు స్టాండ్ బైగా నిలుస్తుంది.

ఎన్‌పీఎస్ ఖాతాతో ఉన్న లాభ‌న‌ష్టాలు ఇవే…

లాభాలు:
ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత చందాదారుకు క‌చ్చిత‌మైన క్ర‌మ‌మైన ఆదాయం వస్తుంది.
బాండ్ల ద్వారా ఆదాయంతో పాటు, ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబ‌డి వ‌ల్ల‌ వృద్ధి ఉంటుంది.

న‌ష్టాలు:
ప్ర‌స్తుత ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల ప్ర‌కారం ఎన్‌పీఎస్ నిధి విత్‌డ్రా చేస్తే 20శాతం ప‌న్ను ప‌డుతుంది. యాన్యుటీలు తీసుకుంటే ఆదాయంగా భావించి ప‌న్ను విధిస్తారు. ఆదాయం, మూల ధ‌నంపై వ‌చ్చే రాబ‌డికి ప‌న్ను విధింపులో వ్య‌త్యాసం ఉండాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly