వైట్ లేబుల్ ఏటీఎమ్‌ల్లో లావాదేవీలు చేస్తున్నారా?

వైట్ లేబుల్ ఏటీఎం లను ఉపయోగించడం మీ ఖాతా ఉన్న బ్యాంకు కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంను ఉపయోగించడం మాదిరిగా ఉంటుంది.

వైట్ లేబుల్ ఏటీఎమ్‌ల్లో లావాదేవీలు చేస్తున్నారా?

రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవ‌లె వైట్ లేబుల్ ఏటీఎమ్ ల నిర్వహణకు మార్గదర్శకాలను సమీక్షించింది. వాటి ఆర్థిక సాధ్యతను పెంచుకునేందుకు ఈ ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లకు కొన్ని అదనపు చర్యలను తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది.

ఏటీఎమ్ ప్ర‌దేశం, భద్రత, నగదు నిర్వహణ వంటి వివిధ ఖర్చులతో కూడికుని ఉంటుంది. బ్యాంకులకు శాఖలు లేని ప్రదేశాల్లో, దాని సొంత ఏటీఎమ్ కలిగి ఉండటానికి బ్యాంకుల‌కు అధికంగా ఖ‌ర్చ‌వుతుంది. అందువల్ల, ఏటీఎమ్ సర్వీసు ప్రొవైడర్లను ఏటీఎమ్ ల‌ను ప్రారంభించేందుకు అనుమతించారు. దీని మూలంగా ఏటీఎమ్ ల లభ్యత పెరిగింది. బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు ప్రారంభించే ఏటీఎమ్‌ల‌ను వైట్ లేబుల్ ఏటీఎమ్ లు అంటారు. ప్ర‌స్తుతం ఇలాంటి ఎనిమిది వైట్ లేబుల్ ఏటీఎమ్ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. గ‌తంలో ఈ ఏటీఎమ్ ల‌ను న‌గ‌దు డిపాజిట్ చేసుకునే సౌల‌భ్యం ఉండేది కాదు. అయితే ఇటీవ‌లె రిజ‌ర్వు బ్యాంకు స‌మీక్ష త‌రువాత వీటికి ఆ అవ‌కాశాన్ని క‌ల్పించారు. దీంతో పాటు బిల్లు చెల్లింపు సేవ‌ల‌ను కూడా అనుమ‌తించారు. బ్రౌన్ లేబుల్ ఏటీఎమ్ అనే మ‌రో కేట‌గిరీ ఉంది. ఇవి బ్యాంకుల సొంత ఏటీఎమ్ లుగానే వ్య‌వ‌హ‌రిస్తాయి కానీ ఇత‌ర సంస్థ‌ల‌కు లీజుకు ఇస్తాయి. ఈ ఏటీఎమ్ లు బ్యాంకు లోగో క‌లిగి సాధారాణ బ్యాంకు ఏటీఎమ్‌లానే క‌నిపిస్తాయి.

వైట్ లేబుల్ ఏటీఎం లను ఉపయోగించడం మీ ఖాతా ఉన్న బ్యాంకు కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంను ఉపయోగించడం మాదిరిగా ఉంటుంది. మీకు ఉన్న ఉచిత లావాదేవీ పరిమితిలో ఉన్నంత కాలం, ఎటువంటి ఛార్జీలు ప‌డ‌వు. మెట్రో నగరాలకు, ఉచిత లావాదేవీ పరిమితి మూడు లావాదేవీలు, నాన్ మెట్రో నగరాలకు ఐదు. అయితే, కొన్ని బ్యాంకులు ప్రీమియం బ్యాంకు ఖాతాలకు ప్రత్యేక కేట‌గిరీ వినియోగదారులకు ఎక్కువ ఉచిత లావాదేవీలను అందిస్తాయి.

బ్యాంకు ఖాతా కాకుండా మరొక బ్యాంకు ఏటీఎమ్ లావాదేవీ చేస్తున్నప్పుడు, కార్డు జారీ చేసే బ్యాంకు ఏటీఎమ్ ని ఉపయోగిస్తున్న బ్యాంకుకు రుసుమును చెల్లింస్తుంది. వైట్ లేబుల్ ఏటీఎమ్ ల విషయంలో, కార్డు జారీ చేసే బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎమ్ ఆపరేటర్ కు రుసుము చెల్లింస్తాయి. దీనిని ఏటీఎమ్ ఇంటర్ఛేంజ్ రుసుము అని పిలుస్తారు.

అయితే ఏటీఎమ్ లో అదనపు భద్రతా చర్యలు తీసుకురావ‌డంతో ఆపరేటర్లకు నిర్వ‌హణ ఖర్చులు పెరిగాయి. దీంతో ఈ సంస్థలు ఈ ఇంటర్ఛేంజ్ ఫీజు పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని బ్యాంకులు వ్య‌తిరేకిస్తున్నాయి. ప్రస్తుతం నగదు లావాదేవీలకు ఏటీఎమ్ ఇంటర్ఛేంజ్ ఫీజు నగదు లావాదేవీలకు రూ. 15, ఇత‌ర (నాన్ క్యాష్ )లావాదేవీల‌కు రూ. 5 గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ ఏటీఎమ్ ల ఆర్థిక ప‌రిపుష్ట‌త‌కు తాజా ఆర్బిఐ మార్గదర్శకాలు స‌హ‌రిస్తున్నాయి. బ్యాంకు ఏటీఎమ్ ల్లోలా కాకుండా, వైట్ లేబుల్ ఏటీఎమ్ లు ఏటీఎమ్ ప్రాంగణంలో థ‌ర్డ్ పార్టీ ప్రకటనలను ప్రదర్శించటానికి అనుమతి ఉంది.

టాటా కమ్యూనికేషన్స్ వంటి వైట్ లేబుల్ ఏటీఎమ్ ఆపరేటర్లు కో-బ్రాండింగ్ మోడల్ ను అమ‌లు చేస్తున్నాయి. దీంతో కొత్త బ్యాంకులతో అనుసంధానమై సేవ‌లు అందించ‌డం ద్వారా ఆదాయం పొందుతాయి. వినియోగ‌దారుల‌కు ఈ కో బ్రాండెడ్ ఏటీఎమ్ లు త‌మ బ్యాంకు ఎటిఎమ్ లుగానే వ్య‌వ‌హ‌రిస్తాయి. తమ ప‌రిమితి బ‌ట్టి ఉచిత లావాదేవీలను అనుమతిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly