ఆ దేశాల్లో మ‌న రూపాయికి బ‌ల‌మెక్కువ‌

విదేశీ యాత్ర‌కు వెళ్లే ఆలోచ‌న మీకు ఉందా? అయితే కాస్త జాగ్ర‌త్త‌గా ప్ర‌ణాళిక వేసుకుంటే మీకు డ‌బ్బు క‌లిసొచ్చే మార్గం ఉంది.

ఆ దేశాల్లో మ‌న రూపాయికి బ‌ల‌మెక్కువ‌

గ‌త కొన్ని రోజులుగా డాల‌తో పోలిస్తే రూపాయి విలువ బ‌ల‌హీన ప‌డుతోంది. దీంతో డాల‌ర్ ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ రూపాయ‌లు చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీని ద్వారా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ లో కొన్ని ఒడుదొడుకులు రావ‌డం స‌హ‌జం. మ‌న దిగుమ‌తుల‌కు చెల్లించాల్సిన బిల్లు డాల‌ర్లో ఉంటుంది కాబ‌ట్టి దానికి ఎక్కువ మొత్తంలో మ‌న క‌రెన్సీ అవ‌స‌రం ఉంటుంది. ఇదే స‌మ‌యంలో విదేశీ విహార‌యాత్ర‌కు అనుకూలంగా ఉండే దేశాలు కూడా ఉన్నాయి. అక్క‌డ మ‌న క‌రెన్సీకి బ‌లమెక్కువ‌. అదెలా చూద్దామా.

విదేశాల‌కు వెళ్లేందుకు…

భార‌తదేశం నుంచి వెళ్లే విహార‌యాత్రికుల‌కు వారు వెళ్లబోయే దేశ‌ కరెన్సీలో మార్పు చేసుకుంటారు. అక్క‌డి ఖ‌ర్చుల‌కు కోసం కొంత‌ మొత్తం న‌గ‌దును ఆయా దేశాల క‌రెన్సీని తీసుకుంటారు.ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న చేసేందుకు కొన్ని దేశాలు అనుకూలంగా ఉంటాయ‌ని చెప్పాలి. డాల‌ర్ తో రూపాయి విలువ బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ట్లుగా ఇత‌ర దేశాల క‌రెన్సీలు కూడా బ‌ల‌హీనప‌డుతున్నాయి. ఆ దేశాల్లో మ‌న డ‌బ్బుకు విలువ పెరుగుతుంది.

డాల‌ర్ తో పోల్చి చూసిన‌పుడు మ‌న రూపాయి కంటే ఏయే దేశాల్లో క‌రెన్సీ బ‌ల‌హీన ప‌డిందో తెలుసుకుంటే… ఆ ప్ర‌దేశాల్లో మ‌న రూపాయి బ‌లంగా ఉన్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. ట‌ర్కీ, ఇండోనేషియా, ర‌ష్యా, బ్రెజిల్, ఇథియోపియా, శ్రీలంక‌, ఇథియోపియా, వియ‌త్నాం దేశాల్లో క‌రెన్సీ మ‌న దేశీయ క‌రెన్సీ కంటే శాతం బ‌ల‌హీన ప‌డ్డాయి. కాబ‌ట్టి ఈ దేశాల్లో మ‌న రూపాయే కింగ్ అన్న‌మాట‌.

ట‌ర్కీ వెళ్తే…

ట‌ర్కీ ప్ర‌పంచంలో ఉన్న అత్యుత్త‌మ ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఉన్న ప్ర‌దేశంగా చెప్ప‌వ‌చ్చు.చూడాల్సిన ప్ర‌దేశాలు చాలా ఉంటాయి. మ‌న రూపాయితో పోలిస్తే తుర్కిష్ లిరా 11 శాతం బ‌ల‌హీన‌ప‌డింది. జ‌ప‌నీస్ య‌న్ మ‌న రూపాయితో పోలిస్తే గ‌త ఏడాది 1.53. ఈ ఏడాది 1.63కి పెరిగింది. దీంతో పాటు విమానాలు ఎక్కువ సంఖ్య‌లో తిర‌గ‌డం ద్వారా ఈ మార్గంలో విమాన ఛార్జీలు త‌గ్గాయి.

ఆగ్నేయ ఆసియా…

ఆగ్నేయ ఆసియా లో ఉన్న దేశాల్లో మ‌న రూపాయికి మంచి విలువ ఉంది. వియ‌త్నాం, కంబోడియా, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ చాలా ఆక‌ర్షణీయంగా ఉంటాయి.అయితే మ‌న రూపాయి ఎక్కువ విలువ ఉన్న దేశాల్లో ప‌ర్య‌ట‌న చేసేందుకు ముందు ఆయా దేశాలు అనుకూలమైన‌వో కాదో తెలుసుకోవాలి. బొలివియా, ప‌రాగ్బే జింబాబ్వే లాంటి దేశాలు మ‌న క‌రెన్సీ కంటే త‌క్కువస్థాయిలో ఉన్నా ఆ ప్ర‌దేశాలు విహారానికి అంత‌కూలంగా ఉండ‌వ‌నే చెప్పాలి.

ఇప్ప‌టికే టికెట్ లు ప్ర‌యాణ ఏర్పాట్లు పూర్తిచేసుకుంటే స‌రే. ప్ర‌ణాళిక వేసుకునేందుకు ఇంకా స‌మ‌యం ఉంద‌నుకుంటే ముడిచ‌మురు, డాల‌ర్ ధ‌రలను ప‌రిశీలించి ప్ర‌ణాళిక వేసుకోవ‌డం మంచిది. అయితే మ‌న రూపాయి డాల‌ర్ తో పోలిస్తే విలువ త‌గ్గింది. డాల‌రు వ‌ద్ద రూపాయి మార‌క‌ విలువ అమెరికా వెళ్లేవారికి కొంత ఖ‌ర్చు ఎక్కువ అవుతుంది. కాబ‌ట్టి యూఎస్ఏ వెళ్లే వారికి దీని వ‌ల్ల కొంత ఖ‌ర్చు పెరుగుతుంది.

ఎంచుకోండిలా…

ప్ర‌స్తుతం డాల‌ర్ విలువ రూ.68.50. విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం రూపాయి బ‌లహీన ప‌డ‌టం మ‌రో 3-6 నెల‌లు ఉంటుంద‌ని అంటున్నారు. ముడిచ‌మురు ధ‌ర‌ల ప్ర‌భావంతో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే అవ‌కాశం ఉంటుంది. దీంతో పాటు విమానాలు ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ మార్గాల్లో విమాన ఛార్జీలు త‌క్కువ‌గా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని విహారాల‌ను ప్లాన్ చేసుకుంటే కొంత ఖ‌ర్చు క‌లిసొస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly