మీ స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్స్ ను వినియోగిస్తున్నారా?

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రారంభించిన ఈ చెల్లింపు విధానం విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది

మీ స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్స్ ను వినియోగిస్తున్నారా?

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఒకరి బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులకు వెల్లడించకుండా, రియల్ టైంలో డబ్బును ఎప్పుడైనా బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది మీ విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ బిల్లులను సురక్షితంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించేలా అనుమతిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రారంభించిన ఈ చెల్లింపు విధానం విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి, డిసెంబరులో 1.31 బిలియన్ లావాదేవీలు జరిగాయని నివేదికలు తెలియచేశాయి.

ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి వినియోగదారులు తమని తాము రక్షించుకోవడానికి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఒకవేళ మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లైతే?

  • ఒకవేళ మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లైతే, ఫోన్‌లో ఉన్న యూపీఐ యాప్ కు లింక్ చేసిన బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయాలి.
  • యూపీఐ ఆధారిత లావాదేవీలకు యూపీఐ-పిన్ అవసరం కావున, తెలియని వారు మీ యూపీఐ సంబంధిత యాప్ లను ఉపయోగించలేరు.
  • అదనంగా, మీ బ్యాంకు కస్టమర్ కేర్ ను సంప్రదించండి.
  • మీరు చెల్లింపును స్వీకరిస్తున్నప్పుడు మీ పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
  • యూపీఐ-పిన్ వంటి సున్నితమైన వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు, అలాగే లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

యూపీఐ ఎలా పనిచేస్తుంది?

యూపీఐని ఉపయోగించి డబ్బును బదిలీ చేయడానికి లేదా స్వీకరించడానికి ముందుగా మీ బ్యాంక్ ఖాతాకు యూపీఐని యాక్టివేట్ చేయాలి. ఇలా చేయడానికి మీరు మీ మొబైల్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయాలి. మీరు యూపీఐని యాక్టీవేట్ చేసినప్పుడు, యూపీఐ ఐడీ మాదిరిగా వీపీఏ (వర్చువల్ పేమెంట్ అడ్రస్) ను కూడా క్రియేట్ చేసుకోవాలి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly