ద్విచక్ర వాహన బీమా ప్రీమియంను తగ్గించుకోండిలా..

మీరు ఒక ప్రామాణిక బైకును లేదా వినియోగించిన బైకును ఎంచుకున్నట్లైతే, బీమా ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది

ద్విచక్ర వాహన బీమా ప్రీమియంను తగ్గించుకోండిలా..

భారతదేశంలో బైకులను రోజువారీ రవాణా కోసం వినియోగిస్తుంటారు. చట్ట ప్రకారం, ఒకవేళ మీరు బైక్ ను కలిగి ఉన్నట్లయితే, దానికి కచ్చితంగా బీమా చేయించుకోవాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు ఒక ప్రాథమిక పాలసీని ఎంపిక చేసుకోవచ్చు లేదా అధిక ప్రీమియంను చెల్లించి సమగ్రమైన బీమా పాలసీని ఎంచుకోవచ్చు. బైకు బీమా ప్రీమియంను తగ్గించగల కొన్ని చిట్కాలను మీ కోసం కింద తెలియచేశాము.

సరైన బైకును ఎంచుకోండి :

బీమా ప్రీమియంను నిర్ణయించడానికి ముందుగా బైకు రకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఖరీదైన బైకును ఎంచుకున్నట్లైతే, అధిక బీమా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా, మీరు ఒక ప్రామాణిక బైకును లేదా కొంచెం పాత మోడల్ లేదా వినియోగించిన బైకును ఎంచుకున్నట్లైతే, బీమా ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

బీమా ప్లాన్లను పోల్చి చూడండి :

ఒక బీమా ప్లాన్ ను కొనుగోలు చేసే ముందు, దేశంలోని ప్రముఖ బీమా సంస్థలు అందించే వివిధ రకాల బీమా ప్లాన్లతో పోల్చడం చాలా ముఖ్యం. దీనిని థర్డ్ పార్టీ ఆన్లైన్ బీమా పోర్టల్ ను ఉపయోగించి లేదా సంబంధిత బీమా వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా పోల్చి చూడవచ్చు. పాలసీ ప్రయోజనాలు, ఫీచర్లు, క్లెయిమ్ విధానం, ప్రీమియం చెల్లింపు ఛానెళ్లు, సంస్థ క్లెయిమ్ నిష్పత్తిని క్షుణ్ణంగా చదివి నిర్ధారించుకోవడం మంచిది. ప్రీమియం కొటేషన్ కోసం అభ్యర్ధించి, సరసమైన ధరకే తగినంత కవరేజ్ లభించే ప్లాన్లను ఎంచుకోండి.

దీర్ఘకాల పరిమితి పాలసీని ఎంపిక చేసుకోండి :

కారు బీమా పాలసీ వలే సంవత్సరానికి ఒకసారి కాకుండా, బైకు బీమా పాలసీని దీర్ఘకాలం కోసం కొనుగోలు చేయవచ్చు. కావున, మీరు మూడు సంవత్సరాల కాలపరిమితి వరకు బైకు బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీర్ఘకాలం బీమా పాలసీని ఎంచుకోవడం వలన పాలసీ ప్రీమియం తగ్గుతుంది.

తగ్గింపు కోసం ప్రయత్నించండి :

ఏదైనా బైక్ బీమా ప్లాన్ ను ఎంచుకునే ముందు, బీమా ప్రతినిధిని లేదా బీమా ఏజెంట్ ను డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా అడగడం మంచిది. పాలసీ కొనుగోలుదారులకు వయస్సు సంబంధిత డిస్కౌంట్లను అందించే అనేక బీమా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా, కొంత మంది బీమా సంస్థలు మహిళలకు ప్రత్యేకమైన డిస్కౌంట్లను కూడా అందిస్తారు. ఒకవేళ మీరు దీర్ఘ కాలవ్యవధి కోసం పాలసీని కొనుగోలు చేసినట్లయితే మరింత డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిస్కౌంట్ తో పొందే బీమా పాలసీని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మంచిది.

చిన్న చిన్న క్లెయిమ్స్ చేయకపోవడం మంచిది :

పాలసీ కాలవ్యవధిలో ఎలాంటి క్లెయిమ్ చేయని డ్రైవర్లకు నో క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు చిన్న నష్టానికే క్లెయిమ్ చేసినట్లయితే, ఆ నిర్దిష్ట సంవత్సరానికి గాను నో క్లెయిమ్ బోనస్ ను పొందలేడు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly