ప్రతి కొనుగోలుపై 5శాతం క్యాష్ బ్యాక్ ను అందించే కార్డు..

ఏడాదిలోగా ఒక మిలియన్ కార్డులను వినియోగదారులకు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది

ప్రతి కొనుగోలుపై 5శాతం క్యాష్ బ్యాక్ ను అందించే కార్డు..

దేశంలోనే క్రెడిట్ కార్డులను జారీ చేసే నాల్గవ అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ గురువారం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఏడాదిలోగా ఒక మిలియన్ కార్డులను వినియోగదారులకు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే అమెరికాకు చెందిన సిటీ బ్యాంకు పేటీఎంతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఒక సంవత్సరంలో ఒక మిలియన్ మార్కును చేరుకోవడానికి మేము వేగంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలనుకుంటున్నామని ప్రెమెంట్స్, కార్డ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ మోఘే తెలిపారు. ఇప్పటి వరకు యాక్సిస్ బ్యాంకు 6.17 మిలియన్ క్రెడిట్ కార్డులను జారీ చేసింది, దీంతో ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద క్రెడిట్ కార్డు ఇష్యూవర్ బ్యాంకుగా నిలిచింది.

ఈ కొత్త క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్, మింత్రా వెబ్ సైట్ లలో షాపింగ్ చేసినట్లయితే, 5 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ ను పొందవచ్చు. ఈ కార్డును పొందాలనుకునే వినియోగదారులు జాయింగ్ ఫీజు కింద రూ. 500, అలాగే వార్షిక రుసుము కింద రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ పరిమితి కింద రూ. 2 లక్షలను అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన సిబ్బంది కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి క్రెడిట్ స్కోర్ ను పరిశీలించి, ఆమోదించిన తరువాత మాత్రమే కార్డును జారీ చేస్తారు. మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో ఈ కొత్త క్రెడిట్ కార్డును జారీ చేయనున్నారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly