వాణిజ్య అవసరాలకు అనువుగా ఉండే కరెంటు ఖాతా

అదిక లావాదేవీలు జరిపే వాణిజ్య సంస్థల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కరంట్ ఖాతా వివరాలు

వాణిజ్య అవసరాలకు అనువుగా ఉండే కరెంటు ఖాతా

‘కరెంట్ ఖాతా ’ వాణిజ్య అవసరాల కోసం, తరచూ లావాదేవీలు జరిపే వారికోసం ఉద్దేశించింది. ఒక రోజుకు చేయాల్సిన లావాదేవీలపై పరిమితులు ఉండవు. కాబట్టి ఈ రకం ఖాతాలో చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు, డిపాజిట్లు చేసుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రకం ఖాతాలోని డిపాజిట్లకు ఎటువంటి వడ్డీ చెల్లించరు.
ఖాతాలో ఉంచాల్సిన కనీస నిల్వ బ్యాంకును బట్టి, బ్యాంకు ఉండే ప్రాంతం (గ్రామం/ పట్టణం /నగరం ) మీద ఆధారపడి ఉంటుంది. చెక్కు పుస్తకం జారీ చేసేందుకు బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. కరెంటు ఖాతా ద్వారా ఎక్కువ శాతం వాణిజ్య కార్యకలాపాలను చెక్కుల ద్వారానే జరుపుతారు.
కేవైసీ నిబంధనలను సంతృప్తి పరిచిన వ్యక్తులు, సంస్థలు, చిరునామా, గుర్తింపు పత్రాలను బ్యాంకులో సమర్పించి కరెంటు ఖాతాలను తెరుచుకునే వీలుంది.

కరెంటు ఖాతా లక్షణాలు :

  1. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ఈ ఖాతా ఉపయోగపడుతుంది.
  2. ఈ ఖాతాలో డబ్బుపై ఎటువంటి వడ్డీ జమ చేయరు.
  3. ఈ రకమైన ఖాతా తెరిచేందుకు ఎక్కువ కనీస నిల్వ ఉండాలి.
  4. ఖాతా లావాదేవీలపై రోజువారీ పరిమితులు ఉండవు.
  5. ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం ఉంటుంది.
  6. ఈ ఖాతా ద్వారా చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు బ్యాంకులో జమచేసి నగదుగా మార్చుకోవచ్చు.
    బ్యాంకులు చిన్న, మధ్య తరహా, పెద్ద వ్యాపార సంస్థల వివిధ రకాల వాణిజ్య అవసరాలకు సరిపోయేవిధంగా రక రకాల కరెంటు ఖాతాలు సైతం అందిస్తున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly