సంక్షిప్త వార్తలు:

 • గురువారం న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ @ 39,745, నిఫ్టీ @ 11,633
 • నేడు డాల‌ర్‌తో రూ.71.65 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
 • హురూన్అంత‌ర్జాతీయ ధ‌న‌వంతుల జాబితా 2020' లో 9వ స్థానం ద‌క్కించుకున్న ముకేశ్ అంబాని
 • అంకురాల‌ను ప్రోత్స‌హించేందుకు హైద‌రాబాద్‌లో సీఐఐ ఆద్వ‌ర్యంలో ఏర్పాటైన‌ ఇన్నోవేష‌న్ కేంద్రం
 • బీఎస్‌-6 ప్ర‌మాణాల‌తో మారుతీ సుజుకీ విటారా బ్రెజా పెట్రోల్ వేరియంట్ ధ‌ర రూ.7.34 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం
 • భార‌త్ మార్కెట్లోకి ల్యాండ్‌రోవ‌ర్ డిఫెండ‌ర్ స‌రికొత్త వ‌ర్ష‌న్‌, ధ‌ర రూ.69.99 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం
 • ఎయిర్ఇండియా విక్ర‌యానికి బిడ్‌లు దాఖ‌లు చేసేందుకు గ‌డువును పొడిగించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం
 • వ‌చ్చే ఏడాది నుంచి మాస్ట‌ర్ కార్డుకు కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా మైఖేల్ మిబాక్‌ను ప్ర‌క‌టించిన కంపెనీ
 • మార్చి 2 న ప్రారంభం కానున్న ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ షేరు ధ‌ర‌ను రూ.750-755 గా నిర్ణ‌యించిన కంపెనీ
 • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.76.47, డీజిల్ ధ‌ర రూ.70.42

బ్యాంకులతో ఎదురయ్యే సమస్యల పరిష్కారం!!

రోజువారీ అవసరాలకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతుంటారు. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకులు వివిధ రకాల ఆర్థికేతర సేవలనూ అందిస్తున్నాయి. ఈ లావాదేవీలు, సేవలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా, లోపాలు ఉన్నా వాటిని పరిష్కరించుకునే విధానం తెలుసుకోవడం అవసరం.

బ్యాంకింగ్ లో ఎదురయ్యే సాధారణ సమస్యలు

 • సరైన కారణం చూపకుండా ఖాతా తెరిచేందుకు నిరాకరించడం
 • ఏటీఎం లలో లావాదేవీలు జరిపేటప్పుడు
 • చెక్కులు, బిల్లులు చెల్లింపులలో జాప్యం, నిరాకరణ
 • ఆన్ లైన్ లావాదేవీల సంబంధిత సమస్యలు
 • రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం వడ్డీ చెల్లించక పోవడం.
 • ఖాతాదారునికి ముందుగా సమాచారం ఇవ్వకుండా రుసుములు, సర్వీస్ చార్జీలు విధించడం.
 • బ్యాంకు బ్రాంచీలలో లాకర్లు వంటి సరిగా సేవలలు సరిగా అందించక పోవడం
 • పని వేళలలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం
 • కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే సరైన స్పందన లేకపోవడం, మొదలైనవి

బ్యాంకింగ్ సేవలలో ఎదురయ్యే సమస్యలను వివిధ దశలలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఒక స్థాయిలో పరిష్కారం కాకున్నా, సూచించిన పరిష్కారం సంతృప్తిగా లేకున్నా ఉన్నతి స్థాయిలో ఫిర్యాదు చెయ్య వచ్చు.

బ్యాంకింగ్ సమస్యలు ఫిర్యాదులు చేసే వివిధ స్థాయిలు

BANK-COMP-2.png
 • ఈ ఫిర్యాదులు రాత పూర్వకంగా, కస్టమర్ కేర్ ద్వారా, ఈ మెయిల్, రిజర్వ్ బ్యాంకు వెబ్సైటులో ఆన్ లైన్లో, మొదలైన వివిధ మాధ్యమాల ద్వారా చెయ్య వచ్చు.

 • ప్రతి స్థాయిలోనూ ఫిర్యాదుకి సమాధానం నిర్ధారించిన గడువులో రావాలి, అలా కాకుంటే పై స్థాయి వారికి ఫిర్యాదు చెయ్యవచ్చు.

కంప్లైంట్ చేసేందుకు అవసరమైన వివరాలు

 • సమస్య ఎదురయిన సందర్భం, రోజు తదితర వివరాలు
 • ఖాతా దారుని పేరు, ఖాతా నెంబర్, కంప్లైంట్ వివరాలు, ఫోన్ నెంబర్
 • బ్యాంకుకు ఫిర్యాదు చేసిఉంటే సబంధిత పత్రాలు
 • ముందు స్థాయిల్లో చేసిన ఫిర్యాదుకు సంబంధించిన రసీదులు, పొందిన సమాధానాలకు సంబంధించి పత్రాలు, ఇతర రుజువులు ఏమైనా.

ఆంద్ర ప్రదేశ్, తెలంగాణాల బ్యాంకింగ్ అంబుడ్స్ మ్యాన్ అడ్రస్

The Ombudsman,
C/o Reserve Bank of India
6-1-56, Secretariat Road
Saifabad, Hyderabad-500 004
STD Code: 040
Tel. No. 23210013/23243970
Fax No. 23210014
Email : bohyderabad@rbi.org.in

ఫిక్సిడ్ డిపాజిట్ – వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ
యాక్సిస్ బ్యాంకు 6.75% - 7.25%
అలహాబాద్ బ్యాంకు 6.50%
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ 7.00% - 6.60%
ఆంధ్ర బ్యాంకు 6.25% - 6.75%
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 6.50% - 6.70%

రికరింగ్ డిపాజిట్ – వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ
ఆంధ్ర బ్యాంకు 6.25% - 6.75%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75% - 6.90%
కెన‌రా బ్యాంక్ 6.00% - 6.40%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6.25% - 7.25%
ఐసీఐసీఐ బ్యాంక్ 6.00% - 7.30%

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%