ప్ర‌తీనెల రూ. 100తో రిక‌రింగ్ డిపాజిట్‌ను ప్రారంభించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఒక‌వేళ ఒక‌నెల డిపాజిట్ చేయ‌కుంటే ఏమి అవుతుంది? ఎన్ని నెల‌లు డిపాజిట్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి? నేను విద్యార్థిని, నాకు శాల‌రీ రాదు. రిక‌రింగ్ డిపాజిట్‌లో 7 శాతం వ‌డ్డీ వ‌స్తుందంటున్నారు. అందువ‌ల్ల నా ద‌గ్గ‌ర ఉన్న మొత్తాన్ని పొదుపు ఖాతాలో కాకుండా రిక‌రింగ్ డిపాజిట్ చేయాల‌నుకున్నాను. ఇందుకోసం నేను ఖ‌చ్చితంగా బ్యాంకుకు వెళ్ళాలా? లేదంటే పొదుపు ఖాతాలో జ‌మ చేస్తే, ఆమొత్తాన్ని రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాకు బ‌దిలీ చేసుకుంటారా? తెలుపగ‌ల‌రు.

మీరు రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరువ‌వ‌చ్చు. ప్ర‌తినెలా మీరు పొద‌పు ఖాతాలో జ‌మ‌చేసే మొత్తాన్ని రిక‌రింగ్ ఖాతాలోకి బ‌దిలీ చే......

హాయ్ డియర్ సిరి టీం, మూడు నెలల క్రితం నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డును తీసుకున్నాను. గత కొంత కాలంగా నాకు ఎస్బీఐ పేరుతో చాలా నకిలీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారు నా వ్యక్తిగత సమాచారంతో పాటు క్రెడిట్ కార్డు వివరాలను కూడా పదే పదే అడుగుతూన్నారు. కానీ వారికి నేను ఎలాంటి సమాచారాన్ని అందించకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ కి ఈ విషయాన్ని తెలియచేశాను. కానీ ఇప్పటి వరకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున నేను దీని నుంచి బయట పడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి చెప్పగలరు. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ ని ఎలా సంప్రదించాలో చెప్పగలరు.

మొదటగా మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ కి మెయిల్ రూపంలో మీ సమస్యని తెలియచేయండి. దానితో పాటు మీరు పొందిన ఫోన్ కాల్స్ నంబర్ల వివరాలను దగ్గరలోన......
కే వై సీ అంటే ఏమిటి? బ్యాంకు ఖాతా తెరిచేందుకు కే వై సీ కింద‌ ఏఏ ప‌త్రాలు తీసుకుంటారు?

కే వై సీ అంటే "మీ వినియోగ‌దారుడిని తెలుసుకోండి"అని అర్ధం.దీని ద్వారా బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త, చిరునామా వివ‌రాలు ఉన్న గ‌ర్తింపు ప‌త్రాల‌తో పాటు ఇటీవ‌లి 2 పాస్ పోర్టు సైజు ఫోటోలు అవసరమవుతాయి. బ్యాంకు ఖాతాలో సాగే లావాదేవీల్లో ఎలాంటి అక్ర‌మ కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటానికి కే వై సీ విధానం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

బ్యాంకులో ఎన్ని ర‌కాల పొదుపు మార్గాలు ఉన్నాయి?

సేవింగ్స్ ఖాతా, వాణిజ్య ఖాతా, ప్రాధ‌మిక పొదుపు ఖాతా, ఫిక్సిడ్ డిపాజిట్, రిక‌రింగ్ డిపాజిట్ వంటి వివిధ రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.

BSBDA అంటే ఏమిటి ?

BSBDAఅంటే "బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతా". దీనినే నో- ఫ్రిల్స్ ఖాతా / జీరో(0) బ్యాలెన్స్ ఖాతా / ప్రాధ‌మిక పొదుపు ఖాతా అని అంటారు.ఈ ఖాతాలో క‌నీస బ్యాలెన్స్ ఉంచ‌కుండా , దాని వాడకంలో కొన్ని ఆంక్ష‌లు విధిస్తూ అంద‌రికీ బ్యాంకు సౌక‌ర్యాల‌ను అందించడానికి ఏర్పాటుచేశారు.

మైన‌ర్లకు బ్యాంకు ఖాతా తెర‌వ‌చ్చా ?

మైన‌ర్లకు , త‌ల్లిదండ్రులు (లేదా) సంర‌క్ష‌కుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బ్యాంకు ఖాతా తెర‌వొచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు " kids account " పేరుతో చిన్న పిల్ల‌లకు కూడా బ్యాంకు ఖాతా తెరిచే స‌దుపాయం క‌ల్పిస్తున్న‌వి. ఈ ఖాతాలలో జ‌రిపే లావాదేవీల పై కొన్ని ప‌రిమితులు ఉంటాయి.

పొదుపు ఖాతాలో నిల్వపై వ‌డ్డీని ఎలా లెక్కిస్తారు ?

పొదుపు ఖాతాలలో చేసిన డిపాజిట్లకు బ్యాంకులు చెల్లించాల్సిన‌ వ‌డ్డీని, ఖాతాలో ఉన్న రోజువారీ స‌రాస‌రి నిల్వ‌ ఆధారంగా లెక్కిస్తారు.

ఏటీఎం ద్వారే ఏ యే బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు?

న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ , బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ నెంబ‌ర్ మార్పు, న‌గ‌దు/చెక్ డిపాజిట్లు, ఫండ్ల‌ను బ‌దిలీ చేయుట‌, మినీ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ , ఫాస్ట్ క్యాష్, చెక్ బుక్ రిక్వెస్ట్ , క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లో రిజిస్ట్రేష‌న్, మొబైల్ ఎల‌ర్ట్స్ కోసం రిజిస్ట్రేష‌న్, క్యాష్ డొనేష‌న్స్ ,ఆధార్ లింకింగ్ వంటి మొద‌లైన స‌దుపాయాల‌ను బ్యాంకులు ఏటీఎంల ద్వారా వారి ఖాతాదారుల‌కు క‌ల్పిస్తున్నాయి.

ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే ఏమి చేయాలి ?

ఏటీఎం కార్డు పోతే వెంట‌నే బ్యాంకు టోల్ ఫ్రీ నెంబ‌రుకు ఫోన్ చేసి (లేదా) స‌మీప బ్యాంకు బ్రాంచిలో వివ‌రాల‌ను తెలిపి " కార్డును బ్లాక్ చేయించాలి ".

బ్యాంకులు అందించే సేవ‌ల‌కు రుసుములను ఏవిధంగా నిర్ణ‌యిస్తాయి? ఆ రుసుముల‌కు పరిమితి ఉంటుందా?

బ్యాంకులు అందించే ప్రాధ‌మిక సేవ‌ల‌కు నామ మాత్ర‌పు రుసుములను నిర్ణ‌యిస్తాయి.ఈ సేవ‌ల విష‌యంలో ప్ర‌త్యేక కేట‌గిరీల‌(మ‌హిళ‌లు , పెన్ష‌న‌ర్లు)వారికి కాస్త త‌క్కువగా ఉంటాయి.ఆ రుసుముల‌కు పరిమితి ఉంటుంది.బ్యాంకులు న‌కిలీ కార్డు జారీల‌కు, మొబైల్ సందేశాలు / హెచ్చ‌రిక‌ల‌కు , ఏటీఎం లో అద‌న‌పు లావాదేవీలకు , చెక్ బుక్ జారీల‌కు రుసుములు వ‌సూలు చేస్తాయి. వినియోగ‌దారులకు ఖాతా తెరిచే సమ‌యంలోనే ఈ రుసుముల‌ను గురించి బ్యాంకులు తెలుపుతాయి. ఒక‌వేళ ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే వెంట‌నే తెలియ‌జేస్తాయి.

డిపాజిట్ స‌మ‌యంలో ఎంచుకున్న‌ కాల‌ప‌రిమితికి ముందే బ్యాంకులోని డిపాజిట్ల‌ను తిరిగి తీసుకొనే వీలుంటుందా ?

ఉంటుంది. బ్యాంకులో చేసిన‌ డిపాజిట్ల‌ను ఖాతాదారుని ఇష్టం మేర‌కు గ‌డువు పూర్తవ్వ‌క ముందే తిరిగి తీసుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ సాధార‌ణంగా డిపాజిట్ల పై ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంకులు కాల‌ప‌రిమితిని బ‌ట్టి నిర్ణ‌యిస్తాయి కనుక అనుకున్న కాలప‌రిమితికి ముందే డిపాజిట్ల‌ను ఖాతాదారులు తిరిగి తీసుకుంటే , బ్యాంకులు డిపాజిట్ల‌పై ఇవ్వాల్సిన వ‌డ్డీరేట్ల‌ను కూడా త‌గ్గించి ఇస్తాయి. అలాగే ఫోర్ క్లోజింగ్ కు కొంత రుసుముల‌ను విధిస్తాయి

ఎన్ ఈ ఎఫ్ టీ ను ఎలా వినియోగం గురించి తెలుపండి ?

ఎన్ ఈ ఎఫ్ టీ అంటే" నేష‌న‌ల్ ఎల‌క్ర్టానిక్ ఫండ్ ట్రాన్స్ ఫ‌ర్ ".దీనితో వినియోగ‌దారులు, బ్యాంకు ఖాతాలో ఉన్న త‌మ న‌గ‌దును రూ.1 నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఒక ఖాతా నుంచి వేరొక ఖాతాకు ఎక్క‌డికైనా బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఎన్ ఈ ఎఫ్ టీ వినియోగానికి కాల ప‌రిమితి ఉద‌యం 8:00 గంట‌ల నుంచి సాయంత్రం 7:00 గంట‌ల వ‌ర‌కూ ఉంటుంది.బ్యాంకులు , ఖాతాదారులు బ‌దిలీ చేసిన న‌గ‌దు పరిమాణంను బ‌ట్టి ఛార్జీలు విధిస్తాయి. ‌

ఆర్టీజీఎస్ ను ఎలా వినియోగం గురించి తెలుపండి ?

ఆర్టీజీఎస్ అంటే "రియ‌ల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్".దీనితో వినియోగ‌దారులు ,బ్యాంకు ఖాతాలో ఉన్న త‌మ న‌గ‌దును రూ.2ల‌క్ష‌ల పై నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఒక ఖాతా నుంచి వేరొక ఖాతాకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.‌ ఆర్టీజీఎస్ వినియోగానికి కాల ప‌రిమితి ఉద‌యం 8:15 గంట‌ల నుంచి సాయంత్రం 4:15 గంట‌ల వ‌ర‌కూ ఉంటుంది. ‌ఆర్టీజీఎస్ విధానం ఖాతాలో ఉన్న పెద్ద మొత్తాల‌ను/ఫండ్ల‌ను వేగంగా బ‌దిలీ చేయుట‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్యాంకులు ,ఖాతాదారులు బ‌దిలీ చేసిన న‌గ‌దు పరిమాణంను బ‌ట్టి ఛార్జీలు విధిస్తాయి.

ఈసిఎస్ ఉపయోగం ఏమిటి ?

ఈసిఎస్ అంటే " ఎల‌క్ర్టానిక్ క్లియ‌రింగ్ సిస్ట‌మ్ ". ఇంటర్నెట్ ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మ‌రొక బ్యాంకు ఖాతాకు ఎల‌క్ర్టానిక్ ప‌ద్ధ‌తిలో నిధుల‌ను సుల‌భంగా, సుర‌క్షితంగా బ‌దిలీ చేసే విధానం. ఈసిఎస్ విధానంలో బ్యాంకు ఖాతాలోని సొమ్ము"తీసుకున్న‌ రుణాల తాలూకు ఈఎంఐ, ఇన్సురెన్స్ ప్రీమియ‌మ్ ల‌ను, మ్యూచువల్ ఫండ్ క్రమానుగత పెట్టుబ‌డుల తాలూకా చెల్లింపులు అటోమాటిక్ గా జరుగుతాయి.

బ్యాంకులో, ఖాతాదారుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే ఎవ‌రిని సంప్ర‌దించాలి ?

ఖాతాదారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను బ్యాంకు ఫిర్యాదుల విభాగానికి సమస్య తెలియజేయాలి. వారు సూచించిన పరిష్కారం సరిగా లేదు అనుకుంటే వివిధ స్థాయిల్లో ఉన్న‌ బ్యాంకింగ్ అంబ‌డ్స‌మ‌న్, లోక్ పాల్, వినియోగ‌దారుల కోర్టు వంటి వివిధ స్థాయిలలోని సంస్థలను సంప్ర‌దిస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డతాయి.

ఫిక్సిడ్ డిపాజిట్ – వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ
యాక్సిస్ బ్యాంకు 6.75% - 7.25%
అలహాబాద్ బ్యాంకు 6.50%
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ 7.00% - 6.60%
ఆంధ్ర బ్యాంకు 6.25% - 6.75%
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 6.50% - 6.70%

రికరింగ్ డిపాజిట్ – వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ
ఆంధ్ర బ్యాంకు 6.25% - 6.50%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50% - 6.60%
కెన‌రా బ్యాంక్ 6.50% - 6.20%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.75% - 6.00%
ఐసీఐసీఐ 6.00% - 6.50%

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%