ప్యాసివ్ ఫండ్ల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు

ప్యాసివ్ ఫండ్లు మార్కెట్ సూచీ లేదా ఏదైనా రంగానికి చెందిన సూచీని అనుక‌రిస్తుంటాయి

ప్యాసివ్ ఫండ్ల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్లు క్రియాశీల‌కంగా (యాక్టివ్) నిర్వ‌హించే పెట్టుబ‌డులు, నిష్ర్కియగా (ప్యాసివ్) పెట్టుబ‌డులు రెండు మార్గాల్లో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. ప్యాసివ్ విధానంలో ఈటీఎఫ్ లు, ఇండెక్స్ ఫండ్లు ఉంటాయి. వీటి పెట్టుబ‌డి విధానంలో ఏవిధ‌మైన షేర్లను ఎంపిక చేసుకోకుండా ఏదైనా ఒక ఇండెక్స్ అనుక‌రించి పెట్టుబ‌డులు చేయ‌డం. మ‌దుప‌ర్లు లావాదేవీలు త‌ర‌చూ చేయ‌కుండా పెట్టుబ‌డి దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగించ‌డం ద్వారా మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. పెట్టుబ‌డుల‌ను దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగించ‌డం ద్వారా ఎక్కువ రాబ‌డి పొంద‌వ‌చ్చు. దీని వ‌ల్ల లావాదేవీలు చేసేందుకు అయ్యే ట్రాన్సాక్ష‌న్ ఛార్జీలు త‌గ్గుతాయి. ఈ విధానంలో మార్కెట్ సూచీలు నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఆధారంగా ఉంటుంది కాబ‌ట్టి మార్కెట్ స్థితిని గ‌మ‌నించి సూచీల‌ను అంచ‌నా వేయ‌డం సాధ్యమ‌వుతుంది. ప్యాసివ్ ఫండ్ల ఉద్దేశం అనుక‌రిస్తున్న‌ మార్కెట్ సూచీ కంటే ఎక్కువ రాబ‌డిని పొంద‌డం కాదు ఆ సూచీకి ద‌గ్గ‌ర‌గా రాబ‌డి పొందడమే ల‌క్ష్యం. ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హించే క్రియాశీల‌క ఫండ్లు బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రాబ‌డిని పొందేందుకు ప్ర‌య‌త్నిస్తారు. మ‌దుప‌ర్లు ఎక్కువ శాతం రాబ‌డి పొందాల‌ని ఉద్దేశ్యంతో త‌ర‌చూ కొనుగోలు, అమ్మ‌కం చేయ‌డం మంచిది కాదు. దీని వ‌ల్ల‌ క‌చ్చితంగా మంచి రాబ‌డి వ‌స్తుంద‌నేది చెప్ప‌లేం. దీంతో కొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది.

ప్యాసివ్ ఫండ్ల నిర్వ‌హ‌ణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది. పెట్టుబ‌డి విధానంలో ఏవిధ‌మైన షేర్లను ఎంపిక చేసుకోకుండా ఏదైనా ఒక ఇండెక్స్ అనుక‌రించి పెట్టుబ‌డులు చేయ‌డంతో నిర్వ‌హ‌ణ రుసుం బాగా త‌గ్గుతుంది. యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్ల ప్ర‌ధాన ఉద్దేశం ఇండెక్స్ ను మించి రాబ‌డి సాధించ‌డ‌మే. అయితే కొన్ని యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్లు ఇండెక్స్ ను మించి రాబ‌డి సాధించ‌లేక‌పోవ‌డం మ‌నం చూడొచ్చు.

ప్యాసివ్ ఫండ్లు మార్కెట్ సూచీ లేదా ఏదైనా రంగానికి చెందిన సూచీని అనుక‌రిస్తుంటాయి కాబ‌ట్టి యాక్టివ్ ఫండ్లలా వీటిలో పోల్చి చూసుకోవ‌డానికి ఏమీ ఉండ‌దు. ఏ సూచీలో పెట్టుబ‌డి చేద్దామ‌నేది నిర్ణ‌యించుకుంటే స‌రిపోతుంది. నిష్ర్కియ పెట్టుబ‌డి విధానంలో ఫండ్ నిర్వాహ‌కులు చేసే క్ర‌య‌విక్ర‌యాలు త‌క్కువ‌గా ఉంటాయి.

దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగించే పెట్టుబ‌డుల‌పై మంచి రాబ‌డి వ‌స్తుంది. కాబ‌ట్టి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు అనుకూలంగా ఉంటాయి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం, ల‌క్ష్యం ఆధారంగా ఈ విధానంలో పెట్టుబ‌డులు ఎంచుకోవాలి. ఈ విధానంలో పెట్టుబ‌డికి న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో రాబ‌డి సాధించే ఉద్దేశంతో కాకుండా దీర్ఘ‌కాలంలో స్థిరంగా ఉండి మంచి రాబ‌డి అందించేలా ఉంటాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly