వాట్సాప్ ద్వారా వాహన బీమా పాలసీలు..

భారతీ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన యాక్సా మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన సంస్థే భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్

ఇకపై ద్విచక్ర వాహన బీమా పాలసీలను సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ ఫామ్ అయిన వాట్స్ యాప్ ద్వారా విక్రయించనున్నట్లు భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. ద్విచక్ర వాహన బీమా పాలసీలను వేగంగా అందించడం కోసం వెబ్ అగ్రిగేటర్ అయిన విష్ ఫిన్ బీమాతో భారతీ యాక్సా భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతీ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన యాక్సా మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన సంస్థే భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్. ఇది విష్ ఫిన్స్ బీమా సంస్థకు సంబంధించిన విష్ పాలసీ వెబ్ సైట్ ద్వారా పాలసీలను విక్రయిస్తుంది. సంస్థకు చెందిన అనేక శాఖలు, కస్టమర్ కేర్ సదుపాయం, చాట్ సదుపాయం, సంప్రదింపు కేంద్రం, డైనమిక్ పోర్టల్ వంటి సర్వీసులు పాలసీదారులకు అందుబాటులో ఉంటాయని భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తెలిపింది. దేశీయ నాన్-లైఫ్ బీమా పరిశ్రమలో వాట్స్ యాప్ ద్వారా ద్వి చక్ర బీమాను కొనుగోలు చేసే అవకాశాన్ని అందించిన మొట్ట మొదటి కంపెనీ భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ అని సంస్థ తెలిపింది. వాట్స్ యాప్ వంటి మొబైల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా వినియోగదారులకు ద్విచక్ర వాహన పాలిసీలను అందించనున్నామని భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ శ్రీనివాసన్ తెలిపారు. భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో వాట్స్ యాప్ ద్వారా ద్విచక్ర వాహన బీమాను సజావుగా విక్రయించగలుగుతామని విష్ ఫిన్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పురు వశిష్ఠ తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly