బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన షామీ..

భారత మార్కెట్ లోకి షామీ అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ఫోన్‌పై రూ. 200 డిస్కౌంట్ ను అందిస్తుంది

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన షామీ..

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ దిగ్గజం షామీ, ఈ సారి బడ్జెట్‌ ధరలో ఒక స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. దాని పేరు రెడ్మీ 7ఏ. ఈ ఫోన్ మొదటి సేల్ ను జులై 11 న ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లలో నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇది రెండు వేరింయట్లలో అందుబాటులో ఉండనుంది. ఒకటి 2 జీబీ ర్యామ్‌/16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కాగా రెండవది 2 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌. 2 జీబీ ర్యామ్‌/16 జీబీ వేరియంట్ ధరను రూ. 5,799గా అలాగే 2 జీబీ ర్యామ్‌/32 జీబీ ధరను రూ. 5,999 గా సంస్థ నిర్ణయించింది. అయితే ఈ ధర కేవలం జులై నెల వరకు మాత్రమే వర్తిస్తుంది. వచ్చే నెల నుంచి వీటి ధరలు వరుసగా రూ. 5,999, రూ.6,199 గా ఉండనున్నాయి. భారత మార్కెట్ లోకి షామీ అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ఫోన్‌పై రూ. 200 డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.

రెడ్మీ 7ఏ ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

  • ఆండ్రాయిడ్‌ 9. 0 పై ఆపరేటింగ్ సిస్టం
  • 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్‌ 439 ఆక్టాకోర్ ప్రాసెసర్‌
  • 2 జీబీ ర్యామ్‌/16 జీబీ, 2 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • వెనుకవైపు 12 ఎంపీ మెయిన్ కెమెరా
  • ముందువైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly