కార్డు చెల్లింపుల్లో సైబ‌ర్ నేరాలు పెర‌గొచ్చు

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్థ‌లు భ‌ద్ర‌తా నిబంధన ప్ర‌మాణాలను పాటించ‌డం త‌గ్గుద‌ల‌తో మ‌రిన్ని సైబ‌ర్ నేరాలు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని వెరిజాన్ నివేదిక పేర్కొంది.

కార్డు చెల్లింపుల్లో సైబ‌ర్ నేరాలు పెర‌గొచ్చు

వెరిజాన్ విడుద‌ల చేసిన పేమెంట్ సెక్యూరిటీ నివేదిక 2018 ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థ‌ల ఆర్థిక‌ లావాదేవీల్లో సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌ను ప‌ర్య‌వ్యేక్షించే పేమెంట్ కార్డ్ ఇండ‌స్ట్రీ డేటా సెక్యూరీటీ స్టాండ‌ర్డ్ (పీసీఐ డీఎస్ఎస్‌)కు నిబంధ‌ల‌కు అనుగుణంగా( కంప్లెయిన్స్) వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ్గిన‌ట్లు పేర్కొంది.

పేమెంట్ కార్డ్ ఇండ‌స్ట్రీ డేటా సెక్యూరీటీ స్టాండ‌ర్డ్ (పీసీఐ డీఎస్ఎస్‌), కార్డు చెల్లింపు స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్న వ్యాపార సంస్థ‌ల‌కు, వారి చెల్లింపు వ్య‌వ‌స్థ‌ను ఉల్లంఘించి, కార్డుదారుల డేటాను దొంగ‌త‌నం చేయు సైబ‌ర్ నేర‌స్తుల‌ నుంచి ర‌క్షించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఎప్పుడూ లేని విధంగా గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో స‌మ్మ‌తి నిబంధ‌న‌లు పాటించ‌డంలో త‌గ్గుద‌ల న‌మోదైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కంపెనీలు 2016లో ఇది 55.4 శాతం సంస్థ‌లు స‌హ‌క‌రిస్తే 2017 లో 52.5 శాతం వ్యాపార సంస్థ‌లు మాత్ర‌మే స‌హ‌క‌రించాయి. నిబంధ‌న‌ల విష‌యంలో స‌హ‌కారం త‌గ్గిపోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగే వ్యాపారాల‌లో సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డే వారి సంఖ్య పెరిగి పోతుంది.

ఆసియా ప‌సిఫిక్ కొంత న‌యం

యూరోప్ (46.4శాతం), అమెరికా (39.7శాతం)ల‌తో పోలిస్తే ఆసియా- ప‌సిఫిక్ ప్రాంతంలో ఉన్న కంపెనీలు 77.8 శాతం స‌హ‌క‌రిస్తూ పూర్తి స్థాయి భ‌ద్ర‌త‌ను సాధించే దిశ‌గా క‌దులుతున్న‌ట్లు నివేదిక పేర్కొంది. భౌగోళిక స‌మ‌యాలు, మారుతున్న విధానాలు, ఐటీ ప‌ర‌ణితి క‌లిగి ఉండ‌టం వంటి వాటి కార‌ణంగా ఈ తేడాలు ఏర్ప‌డుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పేమెంట్ సెక్యూరీటీని వృద్ధి చేయ‌డానికి, ప్ర‌మాద స్థాయిని అంచ‌నా వేయ‌డానికి డేటా భాగ‌స్వామ్యం, క్రాస్ ప‌రిశ్ర‌మ‌ల స‌హ‌కారం అవ‌స‌రం.
పీసీఐ సెక్యూరిటీ స్టాండ‌ర్డ్ కౌన్సిల్ అందించిన నివేదిక‌లోని కంపెనీలు, వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అధిక‌ స్థాయి సెక్యూరీటీని నిర్వ‌హించ‌డంలో అనేక స‌వాళ్ళును ఎదుర్కొంటున్నాయి…సంస్థ‌లు ఎప్ప‌టి క‌ప్పుడు భ‌ద్ర‌తా ఎలా ఉండాలి అనే అంశంపై శ్ర‌ధ్ద పెడుతూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎందుకంటే డేటా భ‌ద్ర‌తపై సంస్థ విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది.

తొలి స్థానం ఐటీ రంగానిదే

నివేదిక ప్ర‌కారం భ‌ద్ర‌తా ప్ర‌మాణాల విష‌యంలో రిటైల్, ఆతిథ్య, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ప‌రిశీలిస్తే ఐటీ రంగం మొద‌టి స్థానంలో ఉంది. మొత్తం ఐటీ కంపెనీల‌లో మూడు వంతుల (77.8 శాతం) సంస్థ‌లు పూర్తి స్థాయి భ‌ద్ర‌త‌ని క‌లిగి వున్నాయి. రిటైల్ రంగంలో 56.3 శాతం ఫైనాన్సియ‌ల్ రంగంలో 47.9 శాతం హాస్ప‌టాలిటీలో 38.5 శాతంతో కొన‌సాగుతున్నాయి.

సంస్థ‌లు భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించేందుకు యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) వంటి సంస్థ‌ల డేటా రక్షణ నిబంధనలను అనుస‌రించాలి. రోజువారీ ఎలక్ట్రానిక్ చెల్లింపులతో మ‌మేక‌మై ఉండే వ్యాపార సంస్థ‌లు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న చాలాసంస్థ‌లు పీసీఐ సమ్మతి ప్రమాణాలను పాటించ‌డం లేదు. సైబ‌ర్ నేరాల నియంత్రణకు సంస్థ‌లు అవి అవ‌లంబిస్తున్న పద్ధతులను పునఃపరిశీలించడం, డేటా రక్షణను దృష్టి లో ఉంచుకుని నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని వెరిజాన్ క‌న్సెల్టెన్సీ నివేదిక పేర్కొంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly