అంతర్జాతీయ బ్రాండ్లను సులభంగా కొనుగోలు చేయండిలా...

అంతర్జాతీయ బ్రాండ్‌లను అందుబాటులోకి తెచ్చే 'పేటీఎం మాల్ వరల్డ్ స్టోర్'ను సంస్థ వేగంగా విస్తరిస్తోంది

అంతర్జాతీయ బ్రాండ్లను సులభంగా కొనుగోలు చేయండిలా...

భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘పేటీఎం మాల్ వరల్డ్ స్టోర్’ ప్లాట్ ఫారంను ప్రారంభించింది, అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లలో షాపింగ్ చేసేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొనే కొనుగోలుదారులకు షాపింగ్ అనుభవాన్ని సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

అంతర్జాతీయ బ్రాండ్‌లను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే 'పేటీఎం మాల్ వరల్డ్ స్టోర్’ను సంస్థ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఫ్లాట్ ఫారంలో యుఎస్, స్పెయిన్, కొరియా, చైనా, జపాన్ తో పాటు మరికొన్ని దేశాలకు చెందిన 2 మిలియన్ ఎస్కేయూ లు (స్టాక్ కీపింగ్ యూనిట్) తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని పేటీఎం మాల్ ఒక ప్రకటనలో తెలిపింది.

పేటీఎం మాల్ అంతర్జాతీయ, భారతీయ లాజిస్టిక్స్ కంపెనీల భాగస్వామ్యంతో, అంతర్జాతీయ అమ్మకందారులు, బ్రాండ్ల నుంచి నేరుగా భారతదేశంలోని వినియోగదారులకు ఉత్పత్తులను అందించడానికి ప్రత్యేకమైన సాంకేతికతతో కూడిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే సంస్థ సింగపూర్, చైనా, కొరియాతో సహా అనేక దేశాలలోని స్థానిక భాగస్వాములతో కలిసి సఫలీకృత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో, భారతదేశానికి రవాణా చేసే ముందు ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం, పన్నులు వంటి వాటిని తనికీ చేస్తారు. బ్రాండ్లు, అమ్మకందారులు తమ ఉత్పత్తులను నిల్వ చేయడానికి, నిర్వహించడానికి ఈ కేంద్రాలను, అలాగే పేటిఎమ్ మాల్ సాంకేతికతను, లాజిస్టిక్స్ భాగస్వాములను ఉపయోగిస్తారు.

పేటీఎం మాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మోథే మాట్లాడుతూ అంతర్జాతీయ అమ్మకందారులకు, బొటిక్ బ్రాండ్లకు తమ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడానికి పేటిఎమ్ మాల్ వరల్డ్ స్టోర్ అతిపెద్ద గేట్వే అని తెలిపారు. వివిధ బ్రాండ్లు అందించే ఉత్పత్తులను వినియోగదారులు సులభంగా కనుగొనే విధంగా తమ టెక్నాలజీ సహాయపడుతుందని తెలిపారు. అలాగే భారతీయ వినియోగదారులు తమ అభిమాన అంతర్జాతీయ ఉత్పత్తులను సురక్షితంగా, సౌకర్యవంతంగా, సరసమైన ధరలకే తమ భాగస్వాములు అందిస్తారని తెలిపారు.

(source - livemint)

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly