ఎస్‌బీఐ మెగా ఇ-వేలం మ‌ళ్లీ వ‌చ్చేసింది

ఎలాంటి వివాదాలు లేని స్థ‌లాల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి ఎస్‌బీఐ మంచి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది

ఎస్‌బీఐ మెగా ఇ-వేలం మ‌ళ్లీ వ‌చ్చేసింది

ప్ర‌స్తుతం వాణిజ్య లేదా నివాస ప‌ర‌మైన ఆస్తుల‌ను కొనుగోలు చేయ‌డం క‌త్తి మీద సాము లాగా మారింది. ఎందుకంటే ఈ ఆస్తుల‌లో చాలా వాటికి న్యాయ‌ప‌ర‌మైన‌, ఇత‌ర వివాదాలు ఉంటున్నాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా, స్థ‌లాల‌ను కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా. అయితే మీ కోస‌మే దేశంలో అతి పెద్ద బ్యాంకైనా ఎస్‌బీఐ మెగా ఇ-వేలంని నిర్వ‌హిస్తోంది. ఈ వేలం ద్వారా మ‌దుప‌రులు ఎస్‌బీఐ ఆధీనంలో దాదాపు 1000 నివాస‌, వాణిజ్య స్థలాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ బిడ్డింగ్‌లో గెలిచిన వారికి, వారి అర్హ‌త‌ల‌ను బట్టి రుణ స‌దుపాయం కూడా ఉంది.

ఈ ఎస్‌బీఐ మెగా ఇ-వేలం ఈ నెల 29 న దేశ వ్యాప్తంగా జ‌రగ‌నుంది. ఆస‌క్తి గ‌ల వారు www.sbi.auctiontiger.net, www.bankeauctions.com/sbi, www.bankeauctionwizard.com లేదా www.tenderwizard.com/sbieauction వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించి త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకుని బిడ్డింగ్ ప్ర‌క్రియ‌లో పాల్గోన‌వ‌చ్చు.

ఈ వెయ్యి స్ధ‌లాల‌ను ఎస్‌బీఐ త‌న‌కు రుణం చెల్లించ‌డంలో విఫ‌ల‌మైన రుణ‌గ్ర‌హీత‌ల నుంచి స‌ర్ఫేసీ చ‌ట్టం ప్ర‌కారం స్వాధీనం చేసుకుంది.

ఈ మెగా ఇ-వేలంలో పాల్గోన‌డానికి ఏమేం అవ‌స‌ర‌మంటే

  1. ఇ-వేలంలో ప్ర‌తిపాదించిన ఆస్తుల‌ను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఎర్నేస్ట్ మ‌నీ డిపాజిట్ మ‌నీ డిపాజిట్(ఈఎమ్‌డీ) చెల్లించాల్సి ఉంటుంది.

  2. మీ వినియోగ‌దారుడి గురించి తెల‌సుకో(కేవైసీ) పత్రాల‌ను సంబంధిత బ్యాంకు శాఖ‌లో స‌మ‌ర్పించాలి.

  3. చెల్లుబాట‌య్యే డిజిట‌ల్ సంత‌కం త‌ప్ప‌నిస‌రి. కొనుగోలుదారులు ఇ-వేలంవేసేవారిని లేదా ఇత‌ర అధీకృత ఏజెన్సీల నుంచి డిజిట‌ల్ సంత‌కాన్ని పొంద‌వ‌చ్చు.

  4. బిడ్డ‌ర్లు ఈఎమ్‌డీ, కేవైసీ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన త‌ర్వాత వారి ఇ-మెయిల్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను పంపుతారు.

  5. వేలం జ‌రిగే రోజు బిడ్డ‌ర్లు ఈ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌తో లాగిన్ అయి నిబంధ‌న‌ల‌క‌నుగుణంగా వేలం ప్ర‌క్రియ‌లో పాల్లొగ‌న‌వ‌చ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly