న‌గ‌దు లావాదేవీల‌పై జ‌రిమానాలు ఎలా వ‌ర్తిస్తాయి?

రూ.2ల‌క్ష‌లకు మించి చేసే న‌గ‌దు లావాదేవీల‌పై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఆంక్ష‌ల‌ను ప్ర‌భుత్వం స‌డ‌లించింది.

న‌గ‌దు లావాదేవీల‌పై జ‌రిమానాలు ఎలా వ‌ర్తిస్తాయి?

గ‌డ‌చిన ఏడాదిలో న‌ల్ల‌ధ‌నాన్ని అంత‌మొందించేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంది. అలాంటి చ‌ర్య‌ల్లో భాగంగా రూ.2ల‌క్ష‌ల‌కు పైగా చేసే న‌గ‌దు లావాదేవీల‌పై జ‌రిమానా విధించేలా చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు తీసుకొచ్చారు.

చెక్కులు, డీడీ, ఇంట‌ర్నెట్ లాంటి మాధ్య‌మాల ద్వారా కాకుండా నేరుగా న‌గ‌దు రూపంలో రూ.2ల‌క్ష‌లకు పైగా లావాదేవీలు జరిపితే ఛార్జీలు చెల్లించాల్సిందే.
న‌గ‌దు లావాదేవీలు రూ.2ల‌క్ష‌లు దాటితే …ఎంత మేర‌కు ఎక్కువ సొమ్ము ఉందో అంతే మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. స‌రైన కార‌ణం చూపించ‌గ‌లిగితే రూ.2ల‌క్ష‌ల‌పై బ‌డిన చెల్లింపుల‌ను పెనాల్టీ నుంచి మిన‌హాయించుకోవ‌చ్చు.

పెనాల్టీ విధించే మూడు సంద‌ర్భాలు

రూ.2ల‌క్ష‌ల ప‌రిమితికి మించి చేసే న‌గ‌దు లావాదేవీల‌పై పెనాల్టీ విధించే సంద‌ర్భాలు మూడు ఉన్నాయి.
1. ఒక వ్య‌క్తి నుంచి రోజంతా క‌లిపి అందే మొత్తం సొమ్ము
2. ఒక లావాదేవీపై అందే మొత్తాల‌పై
3. ఒక సంద‌ర్భానికి(Event/Ocassion) ఒక వ్య‌క్తి నుంచి అందే సొమ్ము.
ఈ మూడు సంద‌ర్భాల్లో ప‌రిమితికి మించి చేసే లావాదేవీల‌పై పెనాల్టీ ప‌డుతుంది.

 • ర‌క‌ర‌కాల వ‌స్తువుల‌న్నింటికీ క‌లిపి వేర్వేరు బిల్లులున్నా స‌రే… వాటి మొత్తం విలువ రూ.2ల‌క్ష‌లు దాటితే న‌గ‌దు అందుకునే వ్య‌క్తి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
 • ఒక్కో బిల్లు విలువ త‌క్కువ ఉంది క‌దా అని పెనాల్టీ విధించ‌క‌మాన‌రు.
 • ఏదైనా ఓ సంద‌ర్భంలో మీ స్నేహితుడు కొనుగోలు చేసిన వ‌స్తువుపై మీరు చెక్కుతో చెల్లింపు చేశారనుకుందాం. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు మీ మిత్రుడు న‌గ‌దు రూపంలో బాకీ తీర్చాడు. ఇప్పుడు ఇది మీ ఆదాయంగా ప‌రిగ‌ణింప‌జాల‌రు, పెనాల్టీ చెల్లించాల్సిందే.
 • బ‌హుమ‌తి రూపంలో అందుకునే సొమ్ముపైనా పెనాల్టీ ఉంటుంది.
 • వ్య‌వ‌సాయ ఆదాయం ప‌న్ను ర‌హిత‌మైనా స‌రే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తిపై సొమ్మును న‌గ‌దు రూపంలో తీసుకుంటే రైతులు పెనాల్టీ చెల్లించాల్సిందే.

ఒక లావాదేవీపై అనేక సందిగ్ధ‌త‌లు

ఒకే లావాదేవీగా నిర్ణ‌యించ‌డం వెన‌క సందిగ్ధ‌త‌లు నెల‌కొని ఉన్నాయి. స్థిరాస్తి లేదా వాహ‌న అమ్మ‌కాన్ని ఒకే లావాదేవీగా ప‌రిగ‌ణించినా ఆదాయ‌పు ప‌న్ను అధికారులు ఏ విధంగా వీటిని ప‌రిగ‌ణిస్తారో చూడాల్సి ఉంటుంది. ఏదైనా స‌రే అప్ప‌టి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా వారు నిర్ణయం తీసుకుంటారు.

వేర్వేరు తేదీల్లో స్థిరాస్తి చెల్లింపులు…

 • రూ.2ల‌క్ష‌ల‌కు పైగా విలువ కలిగిన స్థిరాస్తిని విక్ర‌యించేవారు కొనుగోలుదారు వ‌ద్ద న‌గ‌దు రూపంగా స్వీక‌రించే సంద‌ర్భాలు ఇలా ఉండ‌వ‌చ్చు.
 • ఒక స్థిరాస్తిని అమ్మేవారు వేర్వేరు తేదీల్లో విడివిడిగా రూ.2ల‌క్ష‌ల కంటే త‌క్కువ సొమ్మును న‌గ‌దు రూపంలో అందుకున్నార‌నుకుందాం. పైకి వేర్వేరు తేదీల్లో చెల్లింపులు జ‌రిపినా ఆస్తి విక్ర‌యం ఒక‌టే కాబ‌ట్టి ఒకే లావాదేవీగా ప‌రిగ‌ణిస్తారు. ఇలా వేర్వేరు తేదీలుగా విడ‌గొట్టి చూపించ‌డం చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంది.
 • ఒక స్థిరాస్తిని భాగాలు చేసి వేర్వేరు వ్య‌క్తుల‌కు అమ్మిన సంద‌ర్భం గ‌మ‌నిస్తే… వేర్వేరు వ్య‌క్తుల నుంచి న‌గ‌దు రూపంలో అందుకునే సొమ్ము విడివిడిగా రూ.2ల‌క్ష‌ల లోపు ఉన్నా స‌రే అన్నింటినీ క‌లిపి చూస్తే ప‌రిమితిని దాటుతుంది. ఇలా వేర్వేరుగా చూపించ‌డ‌మూ చ‌ట్ట ఉల్లంఘ‌నే అవుతుంది.

ఈవెంట్ల నిర్వ‌హ‌ణ‌

 • ఈవెంట్ల నిర్వ‌హ‌ణ‌ల్లో న‌గ‌దు లావాదేవీల ప‌రిమితిని ఈవెంట్ ను బ‌ట్టి కాకుండా ఈ వేదిక‌కు హాజ‌ర‌య్యే వారు చేసే చెల్లింపుల‌ను బ‌ట్టి ఉంటుంది.
 • ఏదైనా ఈవెంట్‌కు టికెట్ల ద్వారా ఒక రోజులో అందే సొమ్ము రూ.2ల‌క్ష‌లు మించితే, దీనిపై పెనాల్టీ ప‌డ‌దు. వేర్వేరు వ్య‌క్తులు టికెట్ సొమ్మును చెల్లిస్తారు కాబ‌ట్టి ఈ సంద‌ర్భం చ‌ట్ట ఉల్లంఘ‌న కింద‌కు రాదు.
 • ఇదే విధానం పెళ్లిళ్ల‌కు వ‌ర్తిస్తుంది. వేర్వేరు వ్య‌క్తులంతా క‌లిసి బ‌హుమ‌తిగా న‌గదు రూపంలో ఇచ్చే సొమ్ము రూ.2ల‌క్ష‌ల‌కు మించినా పెనాల్టీ విధించ‌బోరు. ఎందుకంటే పెళ్లిని ఒక్క వేడుక‌గా ప‌రిగ‌ణిస్తారు. అదే ఒక వ్య‌క్తి నుంచి న‌గ‌దు రూపంలో రూ.2ల‌క్ష‌ల‌కు మించి అందుకుంటే అప్పుడు సొమ్ము అందుకునే వ్య‌క్తి పెనాల్టీ చెల్లించాల్సి వ‌స్తుంది.

ధార్మిక‌ సంస్థ‌ల‌కు విరాళాలు

 • ఏదైనా ధార్మిక లేదా స్వ‌చ్ఛంద‌ సంస్థల‌కు విరాళంగా వ‌చ్చే సొమ్ముపై పెనాల్టీ ప‌డే సంద‌ర్భాలు ఈ విధంగా ఉంటాయి.
 • కేవ‌లం ఒక వ్య‌క్తి నుంచి న‌గ‌దు రూపంలో రూ.2ల‌క్ష‌ల‌కు పై బ‌డి సొమ్ము పుచ్చుకుంటే స‌ద‌రు ధార్మిక సంస్థ పెనాల్టీ చెల్లించాలి. అయితే విరాళాలు ఇచ్చే వ్య‌క్తి గోప్య‌త‌ను పాటించినా, విరాళం ఇచ్చిన‌వారి ఆచూకీ తెలియ‌క‌పోయినా ధార్మిక సంస్థ‌లు చేసేదేమీ ఉండ‌దు.
 • ఒక వ్య‌క్తి నుంచే అంత పెద్ద మొత్తం సొమ్ము అందుకున్న‌ట్టు ప‌న్ను అధికారులే నిరూపించాల్సి ఉంటుంది.
 • అథ‌మ‌ప‌క్షంగా ఇలా ఆచూకీ లేని విరాళాల‌పై 30శాతం ప‌న్ను విధిస్తారు.
 • న‌గ‌దు రూపంలో విరాళాలు చేసి సెక్ష‌న్ 80G కింద ప‌న్ను మిన‌హాయింపు పొందాల‌నుకునేవారికి ఈ సారి బ‌డ్జెట్ నిరాశ క‌లిగించింది. ఇది వ‌ర‌కు రూ.10వేల వ‌ర‌కు విరాళంగా ఇచ్చి మిన‌హాయింపులో చూపించుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఇప్పుడు రూ.2వేల‌కు త‌గ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ నిబంధ‌న విరాళాలు స్వీక‌రించే ట్ర‌స్టుల‌కు వ‌ర్తించ‌దు. ఈ ట్ర‌స్టుల‌కు రూ.2వేల ప‌రిమితి లేదు.

బ్యాంకు డిపాజిట్లు

బ్యాంకుల్లో న‌గ‌దు డిపాజిట్ల‌పై, విత్‌డ్రాయ‌ల్స్ పై న‌గ‌దు ప‌రిమితి ఆంక్ష‌లు లేవు. ప్ర‌భుత్వం అందుకునే సొమ్ముపైనా న‌గ‌దు ప‌రిమితిపై నిషేధం లేదు.

మార్పు ఆశిద్దాం

ఇలా నిషేధాలు పెట్టుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించ‌డం సాధ్య‌ప‌డుతుందా? ఏమో చెప్పలేము. అయితే ప‌్ర‌జ‌లు ఎక్కువ మొత్తంలో న‌గ‌దు లావాదేవీలు జరపడం తగ్గిస్తారు. ఇలాంటి ప‌రిమితుల‌తో లావాదేవీలు చేసుకోవ‌డం న‌ల్ల‌ధ‌నం ఉన్న వ్య‌క్తులకు క‌ఠినంగా మారుతుంది.

అవ‌స‌ర‌మై, వాస్త‌వ‌ లావాదేవీలు చేసేవారికి దుర‌దృష్ట‌వ‌శాత్తు ఈ నిషేధాలు ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డి ఆసుప‌త్రి బిల్లును న‌గ‌దు రూపంలో చెల్లించాల్సి వ‌స్తే… త‌ప్ప‌క‌ పెనాల్టీ క‌ట్టాల్సిందేనా? ప‌్ర‌భుత్వం ఇలాంటి సంద‌ర్భాల‌ను దృష్టిలో ఉంచుకొని త‌గిన స‌వ‌ర‌ణ‌లు చేస్తే బాగుంటుంది. వాస్త‌వంగా జ‌రిపే లావాదేవీల‌ను గుర్తించేలా ప్ర‌భుత్వ యంత్రాంగం ప‌నిచేసి పెనాల్టీ ప‌డ‌కుండా చూసే మార్పు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని ఆశిద్దాం.

(Courtesy: LiveMint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly