5 శాతం డీఏ పెంచిన కేంద్రం..ఈ ప్ర‌యోజ‌నం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది?

ప్ర‌భుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న క‌రువు భ‌త్యాన్ని 12 శాతం నుంచి 17 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు

5 శాతం డీఏ పెంచిన కేంద్రం..ఈ ప్ర‌యోజ‌నం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది?

ద్రవ్యోల్భ‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు చెల్లించే క‌రువుభ‌త్యం (డీఏ)ను 5 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణ‌యించింది. పెంచిన డీఏ జులై1, 2019నుంచే వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. డీఏ అనేది దేశంలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించే జీవన సర్దుబాటు భత్యం. ప్రజలపై ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్యోగి ప్రాథమిక జీతం ఆధారంగా డీఏ శాతాన్ని లెక్కిస్తారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి1, జులై1న రెండు సార్లు డీఏను స‌వ‌రిస్తారు.

7వ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా కేంద్ర మంత్రి వర్గం క‌రువుభ‌త్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ద్వారా 49.93 ల‌క్ష‌ల కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు 65.26 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల‌కు లబ్ధిచేకూర‌నుంది. ఉద్యోగులు ప‌ని చేస్తున్న ప్ర‌దేశం లేదా న‌గ‌రం ఆధారంగా డీఏ మారుతూ ఉంటుంది. కార‌ణం గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో జీవ‌న వ్య‌యం భిన్నంగా ఉంటుంది. ఉద్యోగికి ల‌భించే డీఏపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగులు ఉభ‌యుల‌కు ప్రాథ‌మిక వేత‌నంతో గృహ అద్దె భ‌త్యం(హెచ్ఆర్ఏ), క‌రువుభ‌త్యం(డీఏ) వంటి అనేక అంశాల‌ను చేర్చి, ఉద్యోగి మొత్తం వేత‌నాన్ని లెక్కిస్తారు. సాధార‌ణంగా ప్రాథ‌మిక వేత‌నం, హెచ్ఆర్ఏ ఉద్యోగి జీతం ఆధారంగా లెక్కిస్తారు. అయితే డీఏను మాత్రం య‌జమాని ఇష్టానుసారం పెంచుతారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన క‌రువుభ‌త్యం ప్ర‌భుత్వ రంగ ఉద్యోగుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఈ ప్ర‌యోజ‌నం ఎంత మాత్రం వ‌ర్తించ‌దు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly