బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు..

ఫేమ్ స్కీమ్ ఫేజ్ 2 కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాటిపై రాయితీలను ప్రకటించింది

బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు..

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఫేమ్ స్కీమ్ ఫేజ్ 2 కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాటిపై రాయితీలను ప్రకటించింది. దీని కోసం రూ. 10,000 కోట్లను బడ్జెట్ లో కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2019 నుంచి అమలులోకి వస్తుందని, వచ్చే మూడేళ్లలో దీని కోసం రూ.10,000 కేటాయిస్తామని నిర్మలా సీతారామర్ తెలిపారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకమైన చార్జింగ్ స్టేషన్లను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రాయితీలు కేవలం అడ్వాన్స్‌డ్ బ్యాటరీ అండ్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని ఆమె తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly