మీ పెట్టుబ‌డి పై వ‌ర్తించే ఛార్జీల గురించి తెలుసుకున్నారా?

మ‌దుప‌ర్లు పెట్టే పెట్టుబ‌డుల‌పై వివిధ ర‌కాల రుసుములను నిర్వ‌హ‌ణ సంస్థ‌లు వ‌సూలు చేస్తుంటాయి.

మీ పెట్టుబ‌డి పై వ‌ర్తించే ఛార్జీల గురించి తెలుసుకున్నారా?

మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ప్ర‌ణాళిక లో భాగంగా వివిధ ర‌కాల పెట్టుబ‌డుల‌ను ఎంచుకుంటుంటారు. ఆర్థిక సేవ‌లు అందించినందుకు పెట్టుబ‌డి సంస్థ‌లు కొంత రుసుముగా మ‌దుప‌ర్ల నుంచి వ‌సూలు చేస్తుంటాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు వివిధ సంస్థ‌లు అందించే పెట్టుబ‌డి సాధ‌నాలపై విధించే ఛార్జీలు అన్నీ చూసుకుని పెట్టుబ‌డి చేస్తుంటాం. ఇది స‌రే. ఒక పెట్టుబ‌డి చేసే ముందు అందులో ఎన్ని ర‌కాల ఫీజులు ఉంటాయో తెలుసుకుంటున్నారా? ఎలాంటి ఫీజులు ఉంటాయి. ఎప్పుడు చెల్లించాలి త‌దిత‌ర విష‌యాల‌న్నింటిని తెలుసుకోవ‌డం ద్వారా మంచి పెట్టుబ‌డి నిర్ణయాలు తీసుకోవ‌చ్చు. పెట్టుబ‌డులు చేసే ముందు మ‌దుప‌ర్లు గ‌మ‌నించాల్సిన విష‌యం నిర్వ‌హ‌ణ రుసుము. మ‌దుప‌ర్ల‌కు త‌మ పెట్టుబ‌డులు నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చును పెట్టుబ‌డి నిర్వ‌హించే సంస్థ‌కు చెల్లిస్తారు. దీన్నేనిర్వ‌హ‌ణ రుసుము అంటారు. ఇది పెట్టుబ‌డుల ర‌కాన్ని బ‌ట్టి మారుతుంటుంది.

రిక‌రింగ్ ఫీజు: పెట్టుబ‌డులు కొన‌సాగించినంత కాలం నిర్ణీత కాల‌నికి కొంత ఫీజు ఉంటుంది. ఇది పునావృత్త‌మ‌వుతుంది.

ఒన్ టైమ్ ఫీజు: పెట్టుబ‌డులు చేసేట‌పుడు ప్రారంభంలో ఉంటుంది. ఇది ఒక సారే ఉంటుంది.

ఒక్క సారి చెల్లిస్తే చాలా? బ్యాంకులో చేసే ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను తీసుకుంటే వాటికి ఏ విధ‌మైన ఫీజులు ఉండవు. ఖాతా తెరిచేందుకు ఒక సారి ఫీజు ఉంటుంది. పెట్టుబ‌డుల‌లో కొన్నింటికి ప్రారంభంలో ఉంటుంది. త‌రువాత ఇంకేమీ ఉండ‌దు. కొన్నింటికి ప్రారంభంలో ఉండ‌దు కానీ త‌రువాత నిర్వ‌హ‌ణ‌కు గానూ రుసుము ఉంటుంది. కొన్ని పెట్టుబ‌డుల‌కు రెండూ ర‌కాల ఫీజులు క‌లిపి ఉండొచ్చు.

ఉదాహరణకు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు నిర్వ‌హించే ఫండ్లు పునరావృత నిర్వహణ రుసుమును క‌లిగిఉంటాయి. నేరుగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రారంభంలో ఖాతా ప్రారంభ రుసుము ఉంటుంది. దీంతో పాటు లావాదేవీలు చేసేట‌పుడు ఛార్జీలు చెల్లించాలి. డీమ్యాట్ ఖాతాకు సంబంధించి వార్షిక నిర్వహణ ఛార్జీలు ఉంటాయి.

పునరావృతమయ్యే ఫీజు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ల వంటి ప్ర‌త్యేకంగా నిర్వహించే పెట్టుబ‌డుల‌కు ఉంటాయి. బ్రోకింగ్ రుసుము కూడా పునరావృతమవుతుంది కానీ చేసే లావాదేవీని బ‌ట్టి అది వసూలు అవుతుంది. రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో కూడా బ్రోకింగ్ రుసుం ఉంది. సాధార‌ణంగా ఈ రుసుం ఒక్క‌సారి చెల్లిస్తే స‌రిపోతుంది.

కొన్ని ప్ర‌త్యేకంగా నిర్వ‌హించే ఉత్పత్తులకు ఒకసారి , పునరావృత రుసుములు రెండూ ఉండవచ్చు. ఆల్ట‌ర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లో ప్రారంభంలో ఒక‌సారి రుసుము, త‌రువాత నిర్వహణ రుసుము చెల్లించాలి. ఇదెలా అంటే… ఉదాహరణకు మ్యూచువ‌ల్ ఫండ్లు లాంటి ప్ర‌త్యేకంగా నిర్వ‌హించే పెట్టుబ‌డుల‌కు 2% నిర్వహణ రుసుము ఉంటుంది. ఇది నిర్వహణలో ఉండే మొత్తం ఆస్తులకు వ‌ర్తిస్తుంది. మీ పెట్టుబడుల విలువ రూ. 10,000 ఉంటే, 2% రుసుము లెక్క‌న రూ. 200 వసూలు అవుతుంది.

యూనిట్-లింక్డ్ బీమా పథకాలలో (యులిప్స్) చెల్లించిన ప్రీమియంకు సంబంధించి ప్రీమియం కేటాయింపు రుసుము, ఫండ్ నిర్వహణ రుసుము కూడా ఉంటుంది. యూలిప్ ద్వారా పెట్టుబడులు పెట్టిన‌ మొత్తానికి వర్తింపజేసేది. అదేవిధంగా, ఈక్విటీ లో పెట్టుబ‌డులు పెట్టిన వారికి బ్రోకరేజ్ మీరు ఒక స్టాక్ కొనుగోలు చేసేటప్పుడు, అమ్మినప్పుడు ఉంటుంది.

కాల‌ప‌రిమితి: పెట్టుబ‌డుల‌పై చెల్లించే ఫీజు ఎంత కాలానికి వ‌ర్తిస్తుంద‌నేది కీల‌కం. ఉదాహరణకు ఒక ఫండ్‌ వార్షిక నిర్వాహణ రుసుము 2% . ఇది పెట్టుబ‌డులు కొన‌సాగించిన కాలానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు లావాదేవీ సమయంలో బ్రోకరేజ్ 0.1% అనుకుందాం. ఇది కేవ‌లం లావాదేవీలు చేసేట‌పుడు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. దీనికి కాల‌ప‌రిమితి తో సంబంధం ఉండ‌దు. స‌ద‌రు పెట్టుబ‌డికి లావాదేవీల‌పై వ‌ర్తించే రుసుము ప్ర‌కారం చెల్లింపు ఉంటుంది.

పెట్టుబడిని ఎంచుకోవటానికి వచ్చినప్పుడు ఫీజులు, వ్యయాలు ఆధారంగా నిర్ణయం తీసుకోక‌పోయ‌న‌ప్పటికీ , కొన్ని ఉత్పత్తులకు ఒకటి కంటే ఎక్కువ రుసుముల‌ను క‌లిగి ఉంటాయి. కాబ‌ట్టి పెట్టుబ‌డికి అయ్యే క‌చ్చిత‌మైన వ్యయాన్ని తెలుసుకోవడానికి మీరు మొత్తం చెల్లించే రుసుముల‌ను లెక్కించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly