మీ పాన్ కార్డు యాక్టివేట్ చేసుకోండిలా...

పాన్‌-ఆధార్ అనుసంధానానికి చివరి తేది మార్చి 31, 2019

మీ పాన్ కార్డు యాక్టివేట్ చేసుకోండిలా...

2017 లో ప‌దిల‌క్ష‌ల కంటే ఎక్కువ పాన్ కార్డుల‌ను ప్ర‌భుత్వం డీయాక్టివేట్ చేసింది. డూప్లికేట్ పాన్‌కార్డుల‌ను త‌గ్గించేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకుంది. న‌కిలీ పాన్ కార్డుల‌ను గుర్తించేందుకు పాన్ నంబ‌ర్‌ను ఆధార్‌తో అనుసంధానించ‌వ‌ల్సిందిగా ఆదేశించింది. దీంతో ప‌న్ను ఎగ‌వేత‌ల‌ను కూడా అరిక‌ట్ట‌వ‌చ్చు. ఈ రెండింటి అనుసంధానానికి ఇది కూడా ముఖ్య కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రైతే ఇంకా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోలేదో వారు త్వ‌ర‌గా చేసుకోవాలి. ప్ర‌భుత్వం ఈ గ‌డువును మార్చి 31, 2019 వ‌ర‌కు పెంచింది. ఈ తేదిలోపు పాన్‌-ఆధార్ జ‌త చేయ‌క‌పోతే చాలా సంఖ్య‌లో పాన్ కార్డులు ర‌ద్దు చేసే అవ‌కాశ‌ముంటుంది. అయితే ఆధార్-పాన్ లింక్ చేసిన‌ప్ప‌టికీ మీ పాన్ కార్డ్ బ్లాక్ అయితే ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. ఆదాయ ప‌న్ను శాఖ పాన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స‌దుపాయాన్ని క‌ల్పించింది.

పాన్ కార్డ్ స్టేట్ చెక్ చేసుకునేందుకు:

  1. ఆదాయ ప‌న్ను వెబ్‌సైట్‌లో -
    ఆదాయ ప‌న్ను వెబ్‌సైట్‌లో https://incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో Quick Links సెక్ష‌న్‌లో Know Your PAN ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఒక‌ వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది.
pan1.jpg
  1. Know Your PAN -

‘Know Your PAN’ పేజీలో ఒక ఫారం క‌నిపిస్తుంది. అందులో ఇంటిపేరు, స్టేట‌స్‌, పుట్టిన తేది, మొబైల్ నంబ‌ర్ వంటి వ్యక్తిగ‌త వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. స్టేట్‌స్ విభాగంలో పాన్ వ్య‌క్తిగ‌త, హిందు అవిభాజ్య‌కుటుంబం, కంపెనీ లేదా ట్ర‌స్ట్ కి సంబంధించిన‌దా అనే ఆప్ష‌న్ న‌మోదు చేయాలి. వివరాలు అన్ని పూర్తి చేసిన త‌ర్వాత మొబైల్ నంబ‌ర్‌కి ఓటీపీ వ‌స్తుంది.

pan2.jpg
  1. ఓటీపీ ఎంట‌ర్ చేయ‌డం
pan3.jpg

ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత వివ‌రాలు అన్ని సరిచూసుకోవ‌డానికి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. మీరు అందించిన వివ‌రాలు ఆదాయ ప‌న్ను శాఖ‌తో స‌రిపోల‌క‌పోతే “No records for the provided details” అని వ‌స్తుంది. వివ‌రాల‌న్ని సరిగ్గా ఉంటే పాన్ కార్డు వివ‌రాలు, స్టేటస్ మీకు క‌నిపిస్తుంది. అప్పుడు మీరు మీ పాన్‌పై ఉన్న వివ‌రాలు, పాన్ యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవ‌చ్చు.

pan4.jpg

బ్లాక్ అయిన పాన్ యాక్టివేట్ చేసుకోవ‌డం ఎలా?

  1. మీ ప్రాంతానికి సంబంధించిన‌ అధికారికి (ఏఓ) కి లేఖ‌ రాయాలి.
  2. దీంతో పాటు Indemnity Bond , పాన్ కార్డు కాపీ, గ‌త మూడు సంత్స‌రాల నుంచి ప‌న్ను రిట‌ర్నుల కాపీలు ఆ లేఖ‌తో జ‌త చేయాలి.
  3. ఆదాయ ప‌న్ను శాఖ‌కు లేఖ అందించిన‌ త‌ర్వాత పాన్ ని తిరిగి యాక్టివేట్ చేసేందుకు 10-15 రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly