జీవిత బీమా లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో చూస్తున్నారా? - పార్ట్‌2

ప్రీమియం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉన్న సంస్థ నుంచి పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది

జీవిత బీమా లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో చూస్తున్నారా? - పార్ట్‌2

జీవితంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో మ‌నం ముందుగా చెప్ప‌లేము. ఒక‌వేళ అనుకోని సంఘ‌ట‌న‌ల ద్వారా కుటుంబంలోని సంపాదించే వ్య‌క్తికి ఏమైనా జ‌రిగిన‌, జీవిత‌ బీమా ఆ కుటుంబానికి అండ‌గా ఉంటుంది. మీరు తీసుకునే బీమా(జీవిత‌, ఆరోగ్య, వాహ‌న‌) ఏదైనా ఆర్థికంగా భ‌రోసాను క‌ల్పిస్తుంది. అందువల్ల, సంపాదించే ప్రతీ వ్యక్తి, వారి నెలవారీ బడ్జెట్‌లో బీమా ప్రీమియం కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలి. జీవిత బీమా తీసుకునేప్పుడు, సరైన పాలసీని ఎంచుకోవడం మాత్ర‌మే కాకుండా, మొత్తం హామీ, ప్రీమియం ల‌తో పాటు ‘క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో’(సీఎస్ఆర్‌)ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థ‌లు మొత్తంగా ఎన్ని క్లెయిమ్‌ల‌ను తీసుకున్నాయి అందులో ఎన్ని క్లెయిమ్‌ల‌ను సెటిల్‌చేశాయి. ఎంత మొత్తాన్ని క్లెయిమ్ రూపంలో చెల్లించాయి అనే విష‌యాల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకోవాలి. ప్ర‌తి సంవ‌త్స‌రం బీమా సంస్థ‌లు అందించే డేటా ప్ర‌కారం బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏ బీమా సంస్థ‌ల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని, వార్షిక నివేదిక‌ల ద్వారావిడుద‌ల చేస్తుంది.

బీమా సంస్థ‌లు అందించిన స‌మాచారం ప్ర‌కారం బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్ర‌తీ ఏడాది, వార్షిక నివేధిక‌ల‌ను విడుద‌ల చేస్తుంది. 2015-16, 2016-17, 2017-18 వార్షిక నివేదిక‌ల‌ ప్ర‌కారం ఇంత‌కు ముందు క‌థ‌నంలో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వంటి బీమా సంస్థ‌ల స‌మాచారం తెలుసుకున్నాం. ఆ క‌థ‌నం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. క్లెయిమ్ సెటిల్మెంటు రేషియో చూస్తున్నారా?- పార్ట్‌1

ఇప్పుడు ఈ కింది ఆరు బీమా సంస్థ‌లు, అటు న‌గ‌దు ప‌రంగానూ ఇటు పాల‌సీల సంఖ్య రీత్యా ఎక్కువ శాతం క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించాయి అనేది చూద్దాం.
1.బ‌జాజ్ అలియాంజ్ లైఫ్‌
2.ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్‌
3.పీఎన్‌బీ మెట్ లైఫ్‌
4.రిల‌య‌న్స్ నిప్ప‌న్ లైఫ్‌
5.టాటా ఏఐఏ లైఫ్‌
6.ఏగాన్ లైఫ్‌

ఏ సంస్థ ఎన్ని పాల‌సీలను క్లెయిమ్‌కు స్వీక‌రించింది, ఎంత మొత్తం క్లెయిమ్ చేసింది, క్లెయిమ్ సెటిల్‌రేషియో ఎంత‌, త‌దిత‌ర స‌మాచారం కోసం ఈ కింది ప‌ట్టిక‌ల‌ను ప‌రిశీలించండి.

1.బ‌జాజ్ అలియాంజ్ లైఫ్‌:
2017-18 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 312 కోట్లు(83.94 శాతం) చెల్లించింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 0.57 శాతం ఎక్కువ‌. చెల్లించిన మొత్తం పాల‌సీల సంఖ్య 13,176(92.04 శాతం) అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 0.37 శాతం ఎక్కువ‌.

bajaj.jpg

2.ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్‌:
2017-18 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 248 కోట్లు(90.52 శాతం) చెల్లించింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 0.28 శాతం త‌క్కువ‌. చెల్లించిన మొత్తం పాల‌సీల సంఖ్య 5,292(96.38 శాతం) అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 1.68 శాతం ఎక్కువ‌.

aditya.jpg

3.పీఎన్‌బీ మెట్ లైఫ్‌:
2017-18 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 180 కోట్లు(82.4 శాతం) చెల్లించింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 10.02 శాతం ఎక్కువ‌. చెల్లించిన మొత్తం పాల‌సీల సంఖ్య 3,726(91.12 శాతం) అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 3.98 శాతం ఎక్కువ‌.

pnb.jpg

4.రిల‌య‌న్స్ నిప్ప‌న్ లైఫ్‌
2017-18 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 150 కోట్లు(86.11 శాతం) చెల్లించింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 3.25 శాతం ఎక్కువ‌. చెల్లించిన మొత్తం పాల‌సీల సంఖ్య 8,553 (95.17 శాతం) అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 0.64 శాతం ఎక్కువ‌.

reliance.jpg

5.టాటా ఏఐఏ లైఫ్‌:
2017-18 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 132 కోట్లు(94 శాతం) చెల్లించింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 3.89 శాతం ఎక్కువ‌. చెల్లించిన మొత్తం పాల‌సీల సంఖ్య 2,793(98 శాతం) అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 1.99 శాతం ఎక్కువ‌.

tata.jpg

6.ఏజియ‌న్ లైఫ్‌:
2017-18 సంవ‌త్స‌రంలో ఈ సంస్థ రూ. 49.17 కోట్లు(94.56 శాతం) చెల్లించింది. ఇది అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 0.5 శాతం ఎక్కువ‌. చెల్లించిన మొత్తం పాల‌సీల సంఖ్య 530(95.67 శాతం) అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 1.44 శాతం త‌క్కువ‌.

aegon.jpg

చివ‌రిగా:
ఇత‌ర బీమా సంస్థ‌లు కూడా అధిక శాతం క్లెయిమ్‌ల‌ను చెల్లించాయి. అయితే మొత్తం క్లెయిమ్ ఎమౌంట్ త‌క్కువ‌. ప్రీమియంలు పోల్చి చూసుకునేందుకు వెబ్ అగ్రిగేట‌ర్ల‌ను www.polcybazaar.com , www. Coverfox.com ఉప‌యోగించుకోవ‌చ్చు.

Source: IRDAI

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly