భారీ న‌ష్టాల‌తో ముగింపు

కీల‌క స్థాయిల‌ను కోల్పోయిన మార్కెట్లు, సెన్సెక్స్‌@36,699, నిఫ్టీ10,862

భారీ న‌ష్టాల‌తో ముగింపు

సోమ‌వారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 400 పాయింట్లుపైగా న‌ష్ట‌పోగా, నిఫ్టీ 134 పాయింట్లు న‌ష్ట‌పోయింది. ఐటీ రంగం త‌ప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు న‌ష్ట‌పోయాయి. ఎన‌ర్జీ, లోహ‌, బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, ఇన్ఫ్రా, ఫార్మా రంగాలు అధికంగా న‌ష్ట‌పోయాయి. డాల‌రుతో పోలిస్తే రూపాయి మార‌కం విలువ రూ.70.49గా ఉంది.

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూప‌డంతో పాటు, బలహీన అంతర్జాతీయ సంకేతాలతో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవ‌డంతో ఒక ద‌శ‌లో సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్ల న‌ష్టాన్ని చ‌విచూసింది. అయితే, తిరిగి కోలుకున్న సూచీలు ఆరంభ నష్టాలను కొంతమేర పూడ్చుకున్నాయి. కశ్మీర్‌ విభజన విషయంలో మదుపరుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో చివ‌రికి సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయి 36,699.84 వద్ద, నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 10,862 వ‌ద్ద ట్రేడింగ్ ముగించాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు న‌ష్టాల‌తోనే ట్రేడింగ్ ముగించాయి.

నేడు నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. మ‌రోవైపు య‌స్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్ప్‌, గెయిల్ ఇండియా మొదలైన షేర్లు నష్టాలను చవి చూశారు.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
05.08.2019.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly