లాభాల‌తో ముగిసిన నేటి మార్కెట్లు

నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 277 పాయింట్లు లాభాప‌డ‌గా, నిఫ్టీ10,900 పైకి చేరుకుంది.

లాభాల‌తో ముగిసిన నేటి మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్లు పెరిగి 36,976 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 10,935 వద్ద ముగిశాయి. ఎన‌ర్జీ రంగ షేర్లు త‌ప్ప ఇన్ఫ్రా, ఆటో, బ్యాంకింగ్‌, మెట‌ల్‌, ఎఫ్ఎమ్‌సీజీ వంటి అన్ని రంగాల షేర్లు లాభ‌ప‌డ్డాయి. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ 70.80 వ‌ద్ద ముగిసింది.

నిన్న‌టి ట్రేడింగ్‌లో భారీ న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు నేడు తిరిగి కోలుకున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుపై భారీ ఆశలు నెలకొనడంతో సూచీలు పెరిగాయి. రేపు రిజ్వరు బ్యాంక్‌ వరసగా నాలుగోసారి కూడా 25 బేస్‌ పాయింట్ల మేరకు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించవచ్చనే ప్రచారం జరగడంతో షేర్లు దూసుకెళ్లాయి. చైనాపై కరెన్సీ గారడి చేస్తున్న దేశంగా అమెరికా ముద్ర వేయడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. చైనా తన కరెన్సీని స్థిరీకరించేందుకు చర్యలు చేపట్టడం సానుకూల ప్రభావం చూపింది. మధ్యాహ్నం 2.47 సమయంలో సెన్సెక్స్‌ అత్యధికంగా 437 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత మదుపరులు అమ్మకాలకు దిగడంతో కొంత తగ్గింది.

నేటి మార్కెట్లో యస్‌బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. నేడు నిఫ్టీలో ఇండియాబుల్స్ హౌసింగ్‌, య‌స్ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, టెక్ మ‌హీంద్రా, ఈచ‌ర్ మోటార్స్‌, షేర్లు లాభ‌ప‌డ్డాయి. మ‌రోవైపు జీఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సిప్లా, ప‌వ‌ర్‌గ్రిడ్ కార్ప్‌, టీసీఎస్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్లు న‌ష్ట‌పోయాయి.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
06.08.2019.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly