జోరందుకున్న బుల్‌

ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 38,000పైన లాభ‌ప‌డ‌గా నిఫ్టీ 11,300 పైన ముగించింది.

జోరందుకున్న బుల్‌

దేశీయ మార్కెట్లు నేడు లాభాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 646 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ11,300పైన ట్రేడింగ్ ముగించింది. ఐటీ రంగ షేర్లు మిన‌హాయించి దాదాపు అన్ని రంగాల షేర్లు లాభ‌ప‌డ్డాయి. డాల‌రుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 71.05 వ‌ద్ద ముగిసింది.

అమ్మకాల ఒత్తిడితో వ‌రుస‌గా ఆరు సెక్ష‌న్ల నుంచి కుదేల‌వుతూ వ‌స్తున్న మార్కెట్లు నేటి ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ఉద‌యం 11 గంట‌ల ప్రాంతం వ‌ర‌కు తీవ్ర ఒడిదుకుల‌కు లోనైన మార్కెట్లు త‌రువాత పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 646 పాయింట్ల లాభంతో 38,177 వ‌ద్ద‌, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 11,313 వ‌ద్ద ట్రేడింగ్ ముగించాయి. ఆసియా మార్కెట్లు బుధ‌వారం న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. నేడు నిఫ్టీలో ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభ‌ప‌డ‌గా, య‌స్‌బ్యాంక్‌, హీరోమోటో కార్ప్‌, టైట‌న్ కో, జీఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు న‌ష్ట‌పోయాయి.
నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
09.10.2019.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly